Knee Pain Relief Tips: మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? ఐతే ఇలా చేసి తక్షణ ఉపశమనం పొందండి!

Knee Pain Relief Tips: మనలో చాలా మంది ప్రతి రోజూ కీళ్ల నొప్పులతో బాధపడుతుండటం చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు పెద్దల్లో మాత్రమే కనిపించే..

Knee Pain Relief Tips: మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? ఐతే ఇలా చేసి తక్షణ ఉపశమనం పొందండి!
Knee Pain
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 04, 2022 | 2:53 PM

Knee Pain Relief Tips: మనలో చాలా మంది ప్రతి రోజూ కీళ్ల నొప్పులతో బాధపడుతుండటం చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు పెద్దల్లో మాత్రమే కనిపించే ఈ కీళ్ల నొప్పుల సమస్య.. ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా అందరిలోనూ కనిపిస్తోంది. శరీరంలో క్యాల్షియం తక్కువగా ఉండటమే ఈ నొప్పులకు ప్రధాన కారణమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. చాలా మందికి రుచికరమైన ఆహారం తినడం అలవాటు. ఈ రుచికి అలవాటు పడిన జనాలు.. పౌష్టికాహారాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ కారణంగానే.. జనాలు అనేక వ్యాధుల బారిన పడుతున్నామని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మోకాళ్లకు గాయం కావడం, మోకాళ్లపై నిరంతర ఒత్తిడి, కీళ్లనొప్పులు, కొవ్వు పెరగడం, బరువు పెరగడం, శరీరంలో పోషకాల లోపం వంటి అనేక కారణాల వల్ల మోకాళ్ల నొప్పులు రావచ్చు. చాలా మందికి ఆర్థరైటిస్ లేదా గౌట్ కారణంగా మోకాళ్ల నొప్పులు ఉంటాయి. ఈ నొప్పి పురుషుల కంటే మహిళలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. మోకాళ్ల నొప్పులతో ఏ పనీ చేయలేని పరిస్థితి ఉంటుంది. ఈ నొప్పికి చికిత్స చేయకపోతే, కూర్చున్నప్పుడు మోకాళ్ల నుండి శబ్దంతో పాటు, తీవ్రమైన నొప్పి వస్తుంది. అయితే, మోకాళ్ల నొప్పులు తగ్గేందుకు నిపుణులు కొన్ని హోమ్ రెమిడీస్‌ను సూచిస్తున్నారు. ఆ రెమిడీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పసుపు పాలు తాగాలి..

ఇవి కూడా చదవండి

మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నట్లయితే రోజూ పసుపు పాలు తాగాలి. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న పసుపులో క్రిమినాశక, నొప్పి నిరోధక లక్షణాలు ఉన్నాయి. దీనిని తాగడం వలన వాపు, నొప్పి నుండి ఉపశమనం పొందొచ్చు. గాయాలను నయం చేయడంలో కూడా పసుపు ప్రభావవంతంగా పనిచేస్తుంది. పసుపును పాలతో కలిపి ఉపయోగించడం వల్ల మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

తులసి రసం..

ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న తులసిని తీసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. తులసి రసం రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ తులసి రసాన్ని కలిపి తాగడం వల్ల మోకాళ్ల నొప్పుల నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు.

(గమనిక: పై కంటెంట్ సమాచార ప్రయోజనం కోసం మాత్రమే. TV9 తెలుగుతో ఎటువంటి సంబంధం లేదు. ఇది ఆరోగ్య సంరక్షణ నిపుణులు తెలిపిన సమాచారం మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..