AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Get Sleep Fast: రాత్రివేళ హాయిగా నిద్రపోవాలంటే.. ఈ దేశీయ డ్రింక్స్ ట్రై చేయండి చాలు..

ప్రస్తుత కాలంలో చాలామంది నిద్ర లేమి సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారు కొన్ని చిట్కాలను అనుసరించడం ద్వారా సులభంగా హాయిగా నిద్రపోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు..

Get Sleep Fast: రాత్రివేళ హాయిగా నిద్రపోవాలంటే.. ఈ దేశీయ డ్రింక్స్ ట్రై చేయండి చాలు..
Healthy Sleep
Shaik Madar Saheb
|

Updated on: Sep 04, 2022 | 2:03 PM

Share

How to get sleep fast: ఉరుకులు పరుగుల జీవితం, ఒత్తిడి, ఆందోళనతో చాలామంది సమయానికి నిద్రపోరు.. నిత్యం అసంపూర్తిగా నిద్రపోతూ.. పలు అనారోగ్య సమస్యల బారిన పడతారు. జీవితంలో చాలా విషయాలను తగిన సమయానికి చేయలేకపోవడం వల్ల మనకు చిరాకు వస్తుంది. అలానే.. 8 గంటలపాటు నిద్ర లేకపోయినా.. రోజులో తగినంత నిద్ర పోకపోయినా చికాకు, ఒత్తిడి మరింత పెరుగుతుంది. ప్రస్తుత కాలంలో చాలామంది నిద్ర లేమి సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారు కొన్ని చిట్కాలను అనుసరించడం ద్వారా సులభంగా హాయిగా నిద్రపోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

దేశీయ డ్రింక్స్..

చిన్నతనంలో చాలామంది తల్లులు హాయిగా నిద్రపోయేందుకు.. కొన్ని సార్లు పసుపు, మరికొన్నిసార్లు పిల్లలకు కుంకుమపువ్వు పాలు ఇస్తారు. అయితే ఇంకొంతమంది బెల్లం పాలను కూడా తాగుతారు. వాస్తవానికి, ఈ పద్ధతులన్నీ మంచి నిద్ర కోసం మాత్రమే అవలంబిస్తారు. ఈ రోజు మనం అలాంటి పానీయం గురించి వివరించబోతున్నాం.. ఈ రెసిపీని పాలతో కాకుండా బాదం పాలతో తయారు చేస్తారు. అంటే పడుకునే ముందు బాదం పాలతో చేసిన దేశీ డ్రింక్.. మీ మూడ్‌ని మరింత మెరుగ్గా మార్చి సమయానికి నిద్రపోయేలా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

కావాల్సిన పదార్థాలు..

  • ఒక కప్పు బాదం పాలు
  • 2 చిటికెల దాల్చిన చెక్క పొడి
  • 1/4 టీస్పూన్ పసుపు పొడి
  • కొంచెం అశ్వగంధ పొడి
  • రెండు చిటికెల యాలకుల పొడి
  • 1 స్పూన్ కొబ్బరి నూనె
  • 1 టీస్పూన్ తేనె
  • 1 చిటికెడు నల్ల మిరియాల పొడి

ఈ పద్ధతిలో పానీయం సిద్ధం చేయండి

బాదం పాలను తక్కువ మంట మీద వేడి చేయండి.. పాలు బాగా వేడిగా మారినప్పుడు, ఈ పాలలో తేనె తప్ప మిగిలిన అన్నింటిని వేసి కాసేపు మంటపై ఉంచండి.. ఇప్పుడు మంటను ఆపి, పాలు గోరువెచ్చగా మారేలా ఉంచండి. పాలు కొద్దిగా వెచ్చగా మారిన తర్వాత.. జల్లెడ పట్టి తేనెను జోడించాలి. ఆ తర్వాత పాలను తీసుకోవాలి. అనంతరం పళ్ళను తోముకుని నిద్రపోతే మంచిది. ఎందుకంటే.. పళ్లు పసుపు రంగులోకి మారకుండా ఆరోగ్యంగా ఉంటాయి. కొన్ని రోజుల పాటు దీన్ని నిరంతరం తాగడానికి ప్రయత్నించండి. దీన్ని తీసుకోవడం వల్ల త్వరగా నిద్ర వస్తుంది.

హాయిగా నిద్రపోవాలంటే ఇలా చేయండి..

  1. నిద్రపోయే ముందు పాలు-బెల్లం, పసుపు పాలు లేదా కుంకుమపువ్వు అధికంగా ఉండే పాలను తీసుకోండి. దీంతో త్వరగా నిద్రపోవచ్చు.
  2. ఇక్కడ పేర్కొన్న పానీయాన్ని సిద్ధం చేసుకొని నిద్రపోయే ముందు తాగాలి. దీంతో హాయిగా నిద్రపోవచ్చు.
  3. వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని పడుకునే ముందు చల్లని లేదా వేడి నీటితో స్నానం చేయాలి. ఎందుకంటే స్నానం చేసిన తర్వాత నిద్ర ఎక్కువగా వస్తుంది.
  4. నిద్రపోయే ముందు తల మసాజ్ లేదా ఫుట్ మసాజ్ చేయాలి. ఈ రెండు మసాజ్‌లు శరీరాన్ని రిలాక్స్ చేస్తాయి. దీంతో నిద్ర త్వరగా వస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..