AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Health: జుట్టు తెల్లబడడానికి కారణం ఏంటో తెలుసా.. నెరిసిపోయిన జుట్టును ఎందుకు లాగొద్దంటే..

జుట్టు తెల్లబడటం అనేది ప్రస్తుత రోజుల్లో అందరినీ వేధించే సమస్యగా మారింది. గతంలో తెల్లజుట్టు కనిపిస్తే చాలు ముసలివారు అయిపోయారు అని ఆటపట్టించేవారు. కానీ ఇప్పుడు ఈ సమస్య స్త్రీ, పురుషులు..

Hair Health: జుట్టు తెల్లబడడానికి కారణం ఏంటో తెలుసా.. నెరిసిపోయిన జుట్టును ఎందుకు లాగొద్దంటే..
White Hair Peeling
Ganesh Mudavath
|

Updated on: Sep 04, 2022 | 1:47 PM

Share

జుట్టు తెల్లబడటం అనేది ప్రస్తుత రోజుల్లో అందరినీ వేధించే సమస్యగా మారింది. గతంలో తెల్లజుట్టు కనిపిస్తే చాలు ముసలివారు అయిపోయారు అని ఆటపట్టించేవారు. కానీ ఇప్పుడు ఈ సమస్య స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా విస్తృతమవుతోంది. నెరిసిన వెంట్రుకలు కనిపిస్తే చాలు నిరుత్సాహ పడిపోతుంటారు. తెల్లజుట్టు కనిపించకుండా ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. జుట్టుకు రంగు వేయడం, హెన్నా వేసుకోవడం వంటి చిట్కాలు పాటిస్తారు. అయితే అవి శాశ్వత పరిష్కారం చూపించలేపు. ఈ క్రమంలో తెల్లజుట్టు సమస్యపై నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. సాధారణంగా వెంట్రుకల్లో మెలనిన్ అనే వర్ణద్రవ్యం ఉంటుంది. అది ఎక్కువగా ఉంటే నల్లగా, తక్కువగా ఉంటే తెల్లగా కనిపిస్తుంది. చర్మం లోనూ మెలనిన్ ఉంటుంది. వయసు పైబడితే తెల్ల వెంట్రుకలు వస్తాయి. కానీ వయుసుతో సంబంధం లేకుండా యువకుల్లోనూ తెల్లజుట్టు సమస్య అధికంగా ఉంటోంది. మారిపోయిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, జన్యువులు, డీఎన్ఏ కారణంగా మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీంతో జుట్టు నెరిసిపోయినట్లు కనిపిస్తాయి.

విటమిన్ బీ12 , విటమిన్ డీ లోపం, మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోవడం, థైరాయిడ్ సమస్యలు, ధూమపానం, ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాల వల్ల జుట్టు నెరిసిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా మంది తెల్ల వెంట్రుకలను లాగుతుంటారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయవద్దు. ఎందుకంటే అది ఇంకా తెల్లజుట్టు పెరుగుదలకు కారణమవుతుంది. ఆ వెంట్రుకను లాగినప్పుడు విడుదలయ్యే మెలనిన్ ఇతర వెంట్రుకలపై ఎఫెక్ట్ చూపిస్తుంది. దీంతో వెంట్రుకలు తెలుపు రంగులో మారిపోతాయి. అందుకే నెరిసిపోయిన జుట్టును లాగడం చేయకండి. అది ఈ సమస్యను మరింత పెంచుతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి.

పదే పదే తెల్ల జుట్టును తీయడం వల్ల ఆ ప్రాంతంలో గాయం, మచ్చలు ఏర్పడతాయి. ఇది జుట్టు పెరుగుదలపై ప్రభావం చూపుతుంది. ఇది భవిష్యత్ లో జుట్టు పెరగకపోవడం వంటి సమస్యలకు దారి తీస్తుంది. ఒకవేళ నెరిసిపోయిన జుట్టు ఇబ్బందికరంగా అనిపిస్తే.. వాటిని లాగకుండా కత్తెరతో కట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..