Heart Attack: ఈ బ్లడ్ గ్రూపులు ఉన్నవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ.. పూర్తి వివరాలివే..
Heart Attack: మానవ శరీరంలో ప్రధానంగా నాలుగు రకాల బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. ఈ రక్త వర్గాలను A, B, AB, O అని పిలుస్తారు. ఈ నాలుగు రకాల బ్లడ్ గ్రూప్స్ ప్రతి వ్యక్తిలో..
Heart Attack: మానవ శరీరంలో ప్రధానంగా నాలుగు రకాల బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. ఈ రక్త వర్గాలను A, B, AB, O అని పిలుస్తారు. ఈ నాలుగు రకాల బ్లడ్ గ్రూప్స్ ప్రతి వ్యక్తిలో విభిన్నంగా ఉంటాయి. అవి రక్తంలో యాంటిజెన్‌ల సంఖ్య ఆధారంగా నిర్ణయించబడుతుంది. సాధారణంగా అయితే వ్యక్తి బ్లడ్ గ్రూప్ పాజిటివ్ లేదా నెగిటివ్ ఉంటుంది. ఇది రక్తంలో యాంటిజెన్ ఉనికి ఆధారంగా ఉంటుంది. దీనిని Rh కారకం అని కూడా అంటారు. సాధారణ భాషలో అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే.. ఒకరి బ్లడ్ గ్రూప్ A లో Rh కారకం ఉంటే.. అతని బ్లడ్ గ్రూప్ A పాజిటివ్‌గా ఉంటుంది.
గ్రూపుల వారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ..
ఇటీవలి అధ్యయనం ప్రకారం A, B, AB బ్లడ్ గ్రూపులు ఉన్నవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తేల్చారు. ఆర్టియో స్క్లెరోసిస్, థ్రాంబోసిస్, వాస్కులర్ బయాలజీలో ప్రచురించబడిన అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA) అధ్యయనం O బ్లడ్ గ్రూపులు ఉన్నవారి కంటే A, B బ్లడ్ గ్రూప్‌లు ఉన్న వ్యక్తులకు గుండెపోటు వచ్చే అవకాశం 8 రెట్లు ఎక్కువ అని తేలింది. 4 లక్షల మందిని అధ్యయనం చేయగా.. ఈ విషయాన్ని నిర్ధారించారు.
యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ అధ్యయనం కూడా..
యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ 2017లో నిర్వహించిన మరో అధ్యయనంలో 13.6 లక్షల మందిపై పరిశోధన జరుపగా.. ఇదే విశ్లేషణ చేశారు. నాన్ ఓ బ్లడ్ గ్రూప్ ఉన్నవారిలో ఓ బ్లడ్ గ్రూప్ ఉన్నవారి కంటే కొరోనరీ, గుండె సంబంధిత సమస్యల ప్రమాదం 9 శాతం ఎక్కువగా ఉంటుందని అధ్యయనం ఫలితాలు చూపించాయి.
ఈ అధ్యయనం ప్రకారం.. O గ్రూపుతో పోలిస్తే B బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం 15 శాతం ఎక్కువ. అయితే, A బ్లడ్ గ్రూప్ ఉన్నవారిలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఇంకాస్త ఎక్కువగా ఉంది. A బ్లడ్ గ్రూప్ ఉన్నవారిలో ప్రమాదం 11 శాతం ఎక్కువగా తేలింది. O నెగటివ్ మినహా అన్ని రక్త సమూహాలలో గుండెపోటు ప్రమాదం రక్తం గడ్డకట్టడానికి వారి గ్రహణశీలతను పెంచుతుందని నివేదించబడింది. రక్తం గడ్డకట్టే ప్రోటీన్, వాన్ విల్‌బ్రాండ్ ఫ్యాక్టర్ (VWF), నాన్ ఓ బ్లడ్ గ్రూప్‌లో ఎక్కువగా ఉండటాన్ని గమనించారు పరిశోధకులు.
(గమనిక: ఈ కథనంలో పేర్కొన్న సమాచారం ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని పబ్లిష్ చేయడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించడం లేదు.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..