AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nose Picking: మీకు ముక్కులో వేలు పెట్టుకునే అలవాటు ఉందా.? ఈ ప్రమాదకర వ్యాధులు తప్పవు జాగ్రత్త..

మనలో చాలా మందికి ముక్కులో వేలు పెట్టుకునే అలవాటు ఉంటుంది. ఇది సర్వసాధారణమైన విషయం. అయితే ముక్కులో దురదగా ఉన్నప్పుడో, జలుబు చేసి మానిన తర్వాత పక్కులు తీయడం పరిపాటే. కానీ కొందరు మాత్రం నిత్యం ముక్కులో వేలు పెడుతుంటారు. చేతులు కాస్త ఖాళీగా..

Nose Picking: మీకు ముక్కులో వేలు పెట్టుకునే అలవాటు ఉందా.? ఈ ప్రమాదకర వ్యాధులు తప్పవు జాగ్రత్త..
Nose Picking
Narender Vaitla
|

Updated on: Jan 28, 2023 | 4:26 PM

Share

మనలో చాలా మందికి ముక్కులో వేలు పెట్టుకునే అలవాటు ఉంటుంది. ఇది సర్వసాధారణమైన విషయం. అయితే ముక్కులో దురదగా ఉన్నప్పుడో, జలుబు చేసి మానిన తర్వాత పక్కులు తీయడం పరిపాటే. కానీ కొందరు మాత్రం నిత్యం ముక్కులో వేలు పెడుతుంటారు. చేతులు కాస్త ఖాళీగా ఉన్నాయంటే చాలు వెంటనే ముక్కులో వేలు పెట్టి ఓ తెగ తిప్పేస్తుంటారు. అయితే ముక్కులో వేలు పెట్టుకోవడం పెద్ద సమస్య కాదని చాలా మంది భావిస్తుంటారు. కానీ ముక్కులో వేలు పెట్టుకునే అలవాటు అంత శ్రేయస్కరం కాదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల మతిమరుపు, న్యుమోనియా వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అదేంటి ముక్కులో వేలు పెట్టుకుంటే ఇంత ప్రమాదమా అనుకుంటున్నారా? ఇంతకీ ముక్కులో వేలు పెట్టుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మనిషి గాలి పీల్చుకోవడానికి, వాసన చూడడానికి ఉపయోగపడే జ్ఞానేంద్రియం ముక్కు. గాలి పీల్చుకునే సమయంలో గాలితో పాటు ధుమ్ము, ధూళి, బ్యాక్టీరియా వంటివి లోపలికి వెళుతుంటాయి. అయితే ముక్కులో ఉండే వెంట్రుకలు గాలిని ఫిల్టర్ చేస్తాయి. ధుమ్ము, ధూళి, బాక్టీరియా వంటివి లోనికి వెళ్లకుండా అడ్డుకుంటాయి. అలాగే ముక్కులో ఉండే మ్యూకస్ మైంబ్రేన్ బయటకు వెళ్లకుండా చేస్తాయి. అయితే తరచూ ముక్కులో వేలు పెట్టుకోవడం వ్లల ముక్కు వెంట్రుకల దగ్గర ఆగిపోయిన బాక్టీరియా తిరిగి లోపలికి వెళుతుంది.

ఇలా బ్యాక్టీరియా లోపలికి నేరుగా వెళ్లడం వల్ల ఊపిరిత్తులతో పాటు మెదడుపై ప్రభావం పడుతుంది. ఈ బాక్టీరియా మెదడును చేరితే మనిషి వాసన చూసే సామర్థ్యం కోల్పోతారు. అలాగే కొన్ని రకాల బ్యాక్టీరియాల వల్ల దీర్ఘకాలంలో అల్జీమర్స్‌ వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే బ్యాక్టీరియా ఊపిరితిత్తుల్లోకి వెళుతుంది. ఇది న్యుమోనియా వంటి వ్యాధులకు కారణంగా మారుతుంది. చూశారుగా తెలిసో తెలియకో ముక్కులో వేలు పెట్టుకోవడం వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో. మీకు కూడా ఈ అలవాటు ఉంటే వెంటనే మానేయండని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు
భారతీయ వీరులకు తెరపై జీవం పోసిన స్టార్ హీరోస్ వీళ్లే..
భారతీయ వీరులకు తెరపై జీవం పోసిన స్టార్ హీరోస్ వీళ్లే..