Sugar Control tips: ఆ విటమిన్ లోపంతో షుగర్ లెవెల్స్ పెరుగుతాయని తెలుసా? ఈ టిప్స్ తో షుగర్ ఫికర్ దూరం
మధుమేహం నుంచి రక్షణకు ఆరోగ్యకరమైన ఆహరం అలాగే మితమైన వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తుంటారు. ఆహారం విషయంలో నియమాలు, వ్యాయమం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎవరికీ సరైన అవగాహన ఉండదు. సహజంగా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఆహారాలు, అలాగే విటమిన్లు చాలా ఉన్నాయి. అందులో విటమిన్ డి అనేది చక్కెర నిర్వహణ కీలకపాత్ర పోషిస్తుంది.

సాధారణంగా మధుమేహం బారిన పడితే జీవితాంతం మందులు వాడాల్సిన పరిస్థితి. మారుతున్న జీవన శైలి, ఆహార అలవాట్ల కారణంగా ప్రస్తుతం అందరికీ మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే మధుమేహం నుంచి రక్షణకు ఆరోగ్యకరమైన ఆహరం అలాగే మితమైన వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తుంటారు. ఆహారం విషయంలో నియమాలు, వ్యాయమం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎవరికీ సరైన అవగాహన ఉండదు. సహజంగా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఆహారాలు, అలాగే విటమిన్లు చాలా ఉన్నాయి. అందులో విటమిన్ డి అనేది చక్కెర నిర్వహణ కీలకపాత్ర పోషిస్తుంది. చాలా వరకూ సూర్యరశ్మి ద్వారా శరీరంలో విటమిన్ -డి పొందుతుంది. విటమిన్-డి ఉంటే రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవడమే కాకుండా చర్మ ఆరోగ్యం, అలాగే ఆరోగ్యవంతమైన ఎముకలు శరీరంలో వృద్ధి చెందుతాయి. అలాగే విటమిన్-డి షుగర్ ను కంట్రోల్ ఉంచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుందని తాజాగా నిపుణులు వెల్లడిస్తున్నారు.
విటమిన్-డితో కలిగే ప్రయోజనాలు
విటమిన్-డి అంటే సాధారణంగా కొవ్వులో కరిగే విటమిన్. శరీరం సరిగ్గా పని చేయడంలో విటమిన్ -డి చాలా అవసరం. సాధారణంగా శాకాహారుల్లో విటమిన్ డి లోపం ఉంటుంది. మనం తీసుకునే వివిధ ఆహారాల నుంచి కాల్షియం శోషణలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి విటమిన్-డి లోపిస్తే ఎముక సంబంధిత వ్యాధులు పెరిగే అవకాశం ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు విటమిన్-డి అనే చాలా అవసరమని పలు పరిశోధనల్లో వెల్లడైంది. మధుమేహ రోగుల్లో స్థిరమైన విటమిన్ డి-3 ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచడంలో సాయం చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. విటమిన్-డి లోపిస్తే టైప్-2 డయాబెటిస్ బారిన పడే అవకాశం ఉంది. ఎందుకంటే విటమిన్ డి లోపిస్తే ఎండోక్రైన్ ఆరోగ్యం దెబ్బతింటుంది. దీంతో పాటు థైరాయిడ్ గ్రంధి కూడా ప్రభావితమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్సులిన్ ఉత్పత్తి స్థాయిలు నిలకడగా ఉండవు. పాంక్రియాస్ తగినంత స్థాయిలో ఇన్సులిన్ ఉత్పత్తి చేయవు. అలాగే విటమిన్ డి లోపిస్తే విపరీతంగా బరువు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు విటమిన్-డి పెంచుకోడానికి సరైన చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
విటమిన్ -డి లోప నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
సూర్యరశ్మి ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్-డి అందుతుంది. కాబట్టి ఉదయాన్నే శరీరానికి ఎండ తగిలేలా వ్యాయామం చేయడం ఉత్తమం. అలాగే పాలు, పాల ఉత్పత్తులు, లీన్ ప్రోటీన్లు ఉన్న ఆహారం తరచూగా తీసుకుంటే విటమిన్ డి పెరుగుతుంది. అలాగే మాంసాహారులు సాల్మన్ ఫిష్, గుడ్లు అధికంగా తీసుకుంటే మంచిది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి…