Health: వడగట్టిన తేయాకును వృథా అని పడేస్తున్నారా.. ఈ బెనెఫిట్స్ తెలిస్తే అస్సలు వదలరు..
మన దేశంలో అందరూ అత్యంత ఇష్టంగా తాగే పానీయం ఏదైనా ఉందంటే అది కేవలం టీ మాత్రమే. ప్రాంతానికి బట్టి పేర్లు, రుచులు.. మారినా రోజులో ఒక్కసారైనా చాయ్ ను చప్పరించకుంటే ఏదో కోల్పోయిన పీలింగ్ కలుగుతుంది....

మన దేశంలో అందరూ అత్యంత ఇష్టంగా తాగే పానీయం ఏదైనా ఉందంటే అది కేవలం టీ మాత్రమే. ప్రాంతానికి బట్టి పేర్లు, రుచులు.. మారినా రోజులో ఒక్కసారైనా చాయ్ ను చప్పరించకుంటే ఏదో కోల్పోయిన పీలింగ్ కలుగుతుంది. ఇంకొంత మందికి నిద్ర లేచిన తర్వాత టీ తాగనిదే రోజు స్టార్ట్ అవదు. టీ తాగేవారు కనీసం రోజుకు రెండు సార్లైనా టీ తాగుతారు. అయితే సాధారణంగా అందరూ టీ తయారు చేసి వడగట్టిన తర్వాత టీ పొడిని పారేస్తారు. అలా పారేసే బదులు దాని వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనం పొందవచ్చు. అవును.. టీ తయారు చేసిన తర్వాత వడకట్టిన పౌడర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సలాడ్ కోసం ఉపయోగించవచ్చు: ఇది మీకు వింతగా అనిపించినా మంచి రుచి, ఆరోగ్య ప్రయోజనాన్ని అందిస్తుంది. మిగిలి పోయిన తడి టీ పౌడర్ ను సలాడ్‌లో యాడ్ చేసుకోవచ్చు. కూరగాయల ముక్కలపై పౌడర్ గా చల్లుకోవచ్చు. అయితే.. టీ తయారు చేసిన గంటలోగా ఉపయోగించుకోవడం మంచిది.
శుభ్రం చేయడంలో సహాయపడుతుంది: వంటగదిలో మరకలు లేదా చాపింగ్ బోర్డు మురికిగా ఉండే వాటిని శుభ్రం చేయడానికి టీ ఆకులను ఉపయోగించవచ్చు. మరకలు ఉన్న చోట టీ ఆకులు వేసి రుద్దాలి. ఇది గ్రీజు వాసనలనూ తొలగిస్తుంది. వంటసామాన్లు, చాపింగ్ నైఫ్ ల మీద ఉండే మరకలను తొలగించడంలో చక్కగా ఉపయోగపడుతుంది.త మరియు కత్తిపీట నుండి మరకలు మరియు వాసనలను తొలగించడానికి కూడా ఈ ఆకులను ఉపయోగించవచ్చు.




ఫ్రిజ్ దుర్వాసనను తొలగించడానికి: కొన్నిసార్లు రిఫ్రిజిరేటర్ లో నిల్వ చేసిన ఆహార పదార్థాల వల్ల వాసన వస్తుంది. ఫ్రిజ్ డోర్ తెరిచిన వెంటనే దుర్వాసన వస్తుంటుంది. ఈ సమస్యకు నివారణగా టీ ఆకులను ఉపయోగించవచ్చు. టీ ఆకులు చెడు వాసనలను గ్రహిస్తాయి. మిగిలిన టీ ఆకులను పొడి చేసి మస్లిన్ క్లాత్‌లో ప్యాక్ చేసి ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇలా చేయడం ద్వారా దుర్వాసన రాకుండా ఉంటుంది.
కుకీలకు భిన్నమైన మంచి రుచిని ఇస్తుంది: కుకీలు, కేకులు, మఫిన్‌లు తయారు చేసేటప్పుడు టీ ఆకులను జత చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా వెరైటీ రుచితో టీ-ఇన్ఫ్యూజ్డ్ డెజర్ట్ ఫ్లేవర్ ను పొందవచ్చు. మొత్తానికి టీ అంటే ఇష్టపడే వారు.. ఈ వెరైటీలను మాత్రం ఎందుకు ట్రై చేయకూడదు.
నోట్..ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..