Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health care Tips: స్మార్ట్‌ఫోన్లు జేబుల్లో పెట్టుకుంటున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు.. జాగ్రత్తపడకపోతే అంతే సంగతులు..

Health care Tips: స్మార్ట్‌ఫోన్‌లను అతిగా వాడటం వల్ల కళ్లు దెబ్బతింటాయని, నిద్ర రుగ్మతలు తలెత్తుతాయని అనేక పరిశోధనలు తేల్చిచెప్పాయి. ఇక స్మార్ట్‌ఫోన్ల నుంచి వెలువడే రేడియేషన్ ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Health care Tips: స్మార్ట్‌ఫోన్లు జేబుల్లో పెట్టుకుంటున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు.. జాగ్రత్తపడకపోతే అంతే సంగతులు..
Follow us
Basha Shek

| Edited By: Ravi Kiran

Updated on: May 12, 2022 | 9:57 AM

Health care Tips: ప్రస్తుత ఆధునిక జీవనంలో స్మార్ట్‌ఫోన్‌కు ఉన్న ప్రాధాన్యాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొబైల్స్‌ లేకుండా చాలా మంది జీవితం సాఫీగా సాగని పరిస్థితి నెలకొంది. ఇంకా నిజం చెప్పాలంటే చాలామంది స్మార్ట్‌ఫోన్లకు బానిసలయ్యారు. కాగా వీటివల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో ఎక్కువగా వాడడం వల్ల అన్నే ప్రతికూలతలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌లను అతిగా వాడటం వల్ల కళ్లు దెబ్బతింటాయని, నిద్ర రుగ్మతలు తలెత్తుతాయని అనేక పరిశోధనలు తేల్చిచెప్పాయి. ఇక స్మార్ట్‌ఫోన్ల నుంచి వెలువడే రేడియేషన్ ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దిండు కింద..

కాగా అవసరం లేకున్నా చాలామంది తమ ఫోన్లను దగ్గరనే ఉంచుకుంటారు. చొక్కా జేబుల్లో లేదా ప్యాంట్‌ జేబుల్లో పెట్టుకుని తిరుగుతుంటారు. ఇక రాత్రి పూట దిండు కింద పెట్టుకునే నిద్రపోతుంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇలా పడుకోవడం వల్ల మొబైల్స్ నుంచి వెలువడే రేడియేషన్ మెదడు పనితీరును దెబ్బతీస్తుంది. నిత్యం దిండు కింద ఫోన్ పెట్టుకునే వారికి తలనొప్పి, తల తిరగడం వంటి సమస్యలు వస్తాయంటున్నారు.

ఇవి కూడా చదవండి

బ్యాక్‌ ప్యాకెట్‌లో..

చాలా మందికి ఫోన్‌ని బ్యాక్ జేబులో పెట్టుకునే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా యువతలో ఫోన్‌ని బ్యాక్‌పాకెట్‌లో పెట్టుకునే ట్రెండ్‌ పెరుగుతోంది. ఇలాంటివారిలో కడుపునొప్పి లేదా కాళ్ల నొప్పులు వచ్చే ప్రమాదముంది. పైగా బ్యాక్‌ప్యాకెట్‌లో ఫోన్లను పెట్టుకోవడం వల్ల చోరీకి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.

చొక్కా జేబులో..

ఇక ఫోన్‌ని తమ షర్టు జేబుల్లో ఉంచుకుని హడావిడిగా తిరిగివారు కూడా అప్పుడప్పుడు కూడా మనకు కనిపిస్తుంటారు. ఇలా ఫోన్ పెట్టుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి పొరపాటున చొక్కా జేబులో ఫోన్ పెట్టుకునే అలవాటుంటే వెంటనే మానుకోవాలంటున్నారు. లేకపోతే ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ గుండెను బలహీనపరుస్తుందని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: 

Gastroenteritis: అక్కడ భారీగా పెరుగుతోన్న గ్యాస్ట్రో ఎంటెరిటిస్ కేసులు.. బాధితులతో నిండిపోతున్న ఆస్పత్రులు.. కారణమేంటంటే..

RR vs DC, IPL 2022: దంచికొట్టిన మార్ష్‌, వార్నర్‌.. RRపై ఢిల్లీ సూపర్‌ విక్టరీ.. ప్లే ఆఫ్‌ అవకాశాలు సజీవం..

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాటకు తెలంగాణ సర్కార్‌ మరో గుడ్‌ న్యూస్‌.. ఆ థియేటర్లలో ఉదయం 4 నుంచే స్పెషల్ షోలు..