Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: బరువు తగ్గాలనుకుంటున్నారా.? అయితే ఈ టీని ట్రై చేయండి..

ఇక బరువు తగ్గించుకోవడానికి చాలా మంది డైటింగ్ పేరుతో కడుపుమాడ్చుకుంటారు. అయితే సహజ పద్ధతుల ద్వారా కూడా బరువు తగ్గొచ్చు. అలాంటి వాటిలో బెల్లం టీ ఒకటి. బెల్లం టీని అలవాటు చేసుకోవడం వల్ల సహజంగా బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ బెల్లం టీ ద్వారా శరీరానికి ఎలాంటి పోషకాలు లభిస్తాయి.? బెల్లం టీని ఎలా తయారు చేసుకోవాలి లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...

Health: బరువు తగ్గాలనుకుంటున్నారా.? అయితే ఈ టీని ట్రై చేయండి..
Jaggery Tea
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 14, 2023 | 9:54 PM

మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహరంలో మార్పులు, పనితీరు మారడం వెరసి.. ఇటీవల ఊబకాయంతో బాధపడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. ఆహారం తీసుకోకపోయినా బరువు పెరుగుతున్నారు. అయితే పెరిగే బరువును తగ్గించుకోవడానికి ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి.

ఇక బరువు తగ్గించుకోవడానికి చాలా మంది డైటింగ్ పేరుతో కడుపుమాడ్చుకుంటారు. అయితే సహజ పద్ధతుల ద్వారా కూడా బరువు తగ్గొచ్చు. అలాంటి వాటిలో బెల్లం టీ ఒకటి. బెల్లం టీని అలవాటు చేసుకోవడం వల్ల సహజంగా బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ బెల్లం టీ ద్వారా శరీరానికి ఎలాంటి పోషకాలు లభిస్తాయి.? బెల్లం టీని ఎలా తయారు చేసుకోవాలి లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం…

బెల్లం పోషకాలకు పెట్టింది పేరని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బెల్లంలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇందులోని కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, బి కాంప్లెక్స్, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి2 వంటివి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. బెల్లం టీని క్రమంతప్పకుండా తీసుకుంటే జీర్ణక్రియ పనితీరు మెరుగవుతుంది. దీంతో పొట్టలో ఉన్న కొవ్వు కరిగిపోవడమే కాకుండా కొత్తగా కొవ్వు పేరుకుపోదు. పొట్ట చుట్టూ కొవ్వు రాకుండా ఇది సహాయపడుతుంది.

అంతేకాకుండా బెల్లంలోని చక్కెర కంటెంట్‌ జీవక్రియ రేటును పెంచుతుంది. ఐరన్ లోపం ఉన్న వారికి కూడా బెల్లం దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. రక్తహీనతను చెక్‌ పెడుతుంది. ఇక బెల్లంలోని పొటాషియం ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది. కండరాలను నిర్మించడానికి, జీవక్రియను పెంచడానికి పొటాషియం తోడ్పడుతుంది. అధిక బరువును ఇది కరిగిస్తుంది.

ఇంతకీ ఈ టీని ఎలా తయారు చేసుకోవాలంటే..

బెల్లం టీని తయారీకి నీళ్లు, బెల్లం, టీపొడి, అల్లం, యాలకులు, దాల్చిన చెక్క, నల్ల మిరియాల పొడి కావాలి. మొదట స్టవ్‌ వెలిగించి గిన్నెలో కొన్ని నీళ్లు పోసుకోవాలి. అనంతరం 3 టేబుల్ స్పూన్లు టీపొడి , 1 టీస్పూన్ అల్లం, 1 అంగుళం యాలకులు, 3 దాల్చినచెక్క వేసి 5 నిముషాలు మరగబెట్టాలి. తర్వాత మిరియాల పొడిని కలపాలి. టీపొడి, బెల్లం మిక్స్ చేయాలి.. దీన్ని బాగా మరగనిచ్చి ఆరిపోయిన తర్వాత తాగాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..