చలితో జర జాగ్రత్త.. ఇలా చేయకపోతే రోగాల బారిన పడక తప్పదు.. వివరాలు ఇవే..
రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన కొద్దిరోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. రానున్న మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. మిగిలిన కాలాలతో పోల్చితే శీతాకాలంలో ప్రధానంగా ఆరోగ్యంపై అధికంగా ప్రభావం ఉంటుంది. ఉష్ణోగ్రతలు రోజు రోజూ తగ్గుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.

రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన కొద్దిరోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. రానున్న మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. మిగిలిన కాలాలతో పోల్చితే శీతాకాలంలో ప్రధానంగా ఆరోగ్యంపై అధికంగా ప్రభావం ఉంటుంది. ఉష్ణోగ్రతలు రోజు రోజూ తగ్గుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇక రాత్రులు, తెల్లవారుజామున చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. వాతావరణంలో వచ్చిన మార్పులతో జలుబు, దగ్గు తదితర సమస్యలతో అనారోగ్యం బారిన పడుతున్నారు. చలిని తట్టుకోలేక చిన్నారులు, వృద్ధులు చాలా ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. చలికాలంలో పరిశుభ్రతతో పాటు ఆహారపు అలవాట్లలో స్వల్ప మార్పులు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే చలికాలం నుంచి వెచ్చగా బయటపడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
వృద్ధుల్లో హైపోతెరమి ముప్పు..
చలి తీవ్రతను తట్టుకోలేక కొందరు వృద్దులు.. చేతులు వంకరపోవడం వంటి లక్షణాలతో ప్రాణాలు విడిచిపెడుతున్నారు. దీన్నే ప్రాస్ట్ బైట్ అంటారు. వృద్ధుల్లో శరీరానికి కావాల్సిన ఉష్ణోగ్రతలు ఉత్పత్తి కాకపోవడంతో మరణిస్తారు. దీన్ని వైద్య పరిభాషలో హైపోథెరమి అంటారు. శరీరంలోని రక్తనాళాల్లో రక్తం సరఫరాలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ కాలంలో ఆస్తమా వ్యాధిగ్రస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి ఊపిరితిత్తుల సమస్యలు ఏర్పడవచ్చు. బ్యాక్టీరియా వైరల్ ఇన్‌ఫెక్షన్స్ వస్తాయని వైద్యులు చెబుతున్నారు. గొంతు ఇన్‌ఫెక్షన్స్, కీళ్ల నొప్పులు పెరుగుతాయి. గతంలో కీళ్ల నొప్పులు ఉన్నవారికి సమస్య అధికమవుతుంది. కొందరిలో తలనొప్పి వస్తుంది. గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో ఎక్కువ సమయం నీళ్లలో చేతులు ఉంచి పనులు చేయడం వల్ల చేతిపై ఉండే నూనె పొర తొలగిపోతుంది. సబ్బులు, డిటర్జెంట్లను ఉపయోగించడం వల్ల నూనె పొర తొలిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో చర్మం పొడిబారి చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. చలిగాలులు చర్మాన్ని ఇబ్బంది పెడతాయి. వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ గాలిలో తేమశాతం తక్కువగా ఉంటుంది. శరీరంలోని తేమ బయటికి పోవడంతో చర్మం పొడిబారుతుంది. నూనె పొరను కాపాడుకునేందుకు ప్రయత్నించాలి. శరీరంలో వేడి ఉత్పత్తి అయ్యేలా జీర్ణవ్యవస్థ నిరంతరం పనిచేస్తుండాలి. ప్రోటిన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
చర్మంపై చలిగాలులు ప్రభావం:
చలికాలం మొదలైన నాటి నుంచి చివరి వరకు చర్మంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. అధిక చలికి చర్మం పూర్తిగా పొడిబారి దురదపెట్టడం మొదలై పలు రకాల అలర్జీలు కారణమవుతాయి. శీతాకాలంలో ప్రధానంగా చిన్నారులు, వృద్దులపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఏ వయసు వారైనా చల్లటి గాలికి తిరగడం, శీతల పానీయాలకు దూరంగా ఉండడం మంచిది. గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. అధిక చలిలో పిల్లలు, వృద్దులు ఎక్కువగా బయట తిరగకుండా జాగ్రత్తగా వహించాలి. పిల్లలను పాఠశాలలకు పంపే ముందు దుస్తుల పట్ల శ్రద్ధ వహించాలి. కాచి చల్లార్చిన నీరు, వేడి ఆహారాన్ని తీసుకోవాలి.
ఉదయం వాకింగ్.. జాగ్రత్త:
ఎక్కువ మంది వ్యాయామం అంటే ఉదయం పూటనే ప్రాధాన్యం ఇస్తారు. మహిళలు, మధ్య వయస్కులు, వృద్దులు ఎక్కువగా ఉదయపు నడకకు వెళ్తుంటారు. అలాంటి వారు మిగతా కాలాలతో పోల్చితే శీతాకాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల మధ్య పొగ మంచులో కాలుష్యం కలిసి ఉంటుంది. ఈ సమయంలో ఉదయం రన్నింగ్/వాకింగ్ చేసేవాళ్లు దాన్ని పీల్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారు శ్వాసకోశ వ్యాధులు బారిన పడే ప్రమాదం ఉంటుంది. ఈ మూడు నెలలు ఉదయం 7 గంటలు దాటిన తర్వాత వాకింగ్ చేయడం ఉత్తమం, కుదరకపోతే సాయంత్రం వేళలో చేసుకోవడం తప్పదని అనుకునేవారు ముఖం, ముక్కు, చెవులు కప్పి ఉంచే టోపీలు, దుస్తులు, స్వెటర్లు ధరించాలి.