పచ్చి  బొప్పాయి ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. 

02 April 2025

TV9 Telugu

పచ్చి బొప్పాయి, వాటి ఆకులలో కూడా చాలా పోషకాలు ఉంటాయి. చక్కెర స్థాయిలు తక్కువగా ఉండడం వల్ల ఇది తింటే మధుమేహం అదుపులో ఉంటుంది.

పచ్చి బొప్పాయిలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఈ కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

పచ్చి బొప్పాయి ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. ఎలాంటి ఇన్ఫెక్షన్లను రాకుండా బొప్పాయి కాపాడుతుంది.

డెంగ్యూతో బాధపడే వారికి బొప్పాయి ఆకుల రసాన్ని తాగిస్తే ప్లేట్లెట్ల సంఖ్య పెరుగుతుంది. ఈ ఆకుల్లో ఉండే సైటో టాక్సిన్లు క్యాన్సర్ కారకాలను నిరోధిస్తుంది.

ఎవరికైనా గాయాలు అయితే బొప్పాయి గుజ్జును రాయడం వల్ల త్వరగా నయం అవుతాయి. ఇది అజీర్ణం, ఉబ్బరం, మలబద్దకాన్ని తగ్గిస్తుంది.

పచ్చి బొప్పాయిలోని బీటా కెరోటిన్, టానిన్స్, ఫ్లేవనాయిడ్స్, లైకోపీన్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.

పచ్చిబొప్పాయిలో విటమిన్ సి, ఎ, ఇ, పొటాషియం, మెగ్నీషియం, ఖనిజాలు ఫైబర్ , యాటీఆక్సిడెంట్లు ఎక్కువ. విటమిన్ సి, ఇ చర్మాన్ని రక్షించి అకాల వృద్ధాప్యాన్ని తగ్గిస్తుంది.

పచ్చి బొప్పాయిలో ఉండే ఫైబర్ , పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో చక్కగా పనిచేస్తుంది.