వర్షంలో వేడి వేడి పకోడీ తింటే ఆ మజానే వేరు..! 5 నిమిషాల్లోనే చేసే అద్భుతమైన స్నాక్ రెసిపీ..!
వర్షం పడుతుంటే వేడి వేడి ఉల్లిపాయ పకోడీ తింటే ఆ మజానే వేరు. చాయ్‌తో తింటే ఇంకెంతో రుచిగా ఉంటుంది. తక్కువ సమయంలో ఇంట్లోనే సులభంగా చేసుకునే ఈ స్నాక్ చిన్నాపెద్దా అందరికీ ఇష్టమయ్యే క్రిస్పీ ట్రీట్. ఉల్లిపాయ, మసాలా మిశ్రమం ఇచ్చే రుచితో ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.

వర్షం కురుస్తుంటే వేడివేడిగా ఉల్లిపాయ పకోడి తింటే ఆ ఆనందమే వేరు. చాయ్‌తో కలిసి తింటే ఇంకా రుచిగా ఉంటుంది. ఇంట్లో తక్కువ సమయంలోనే సులభంగా చేసుకోవచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవారిదాకా అందరికీ ఈ పకోడి ఎంతో నచ్చుతుంది. దీని క్రిస్పీ స్వభావం, రుచికరమైన మసాలా సువాసన వల్ల ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.
కావాల్సిన పదార్థాలు
- పెద్ద ఉల్లిపాయలు – 2
- సెనగపిండి – ½ కప్పు
- బియ్యప్పిండి – ¼ కప్పు
- మిరప పొడి – 1 టీస్పూన్
- పసుపు – ½ టీస్పూన్
- ఉప్పు – రుచికి సరిపడా
- జీలకర్ర – ½ టీస్పూన్
- కరివేపాకు – 5–6 ఆకులు
- నూనె – తగినంత
తయారీ విధానం
ముందుగా ఉల్లిపాయలపై నుండి ఒక్క లేయర్ తీసి శుభ్రంగా కడిగి పెద్దగా, సన్నవిగా కట్ చేసుకోవాలి. కట్ చేసినవి బాగా మందంగా ఉండకూడదు. సన్నవిగా దేనికి అవి సపరేట్ గా ఉండేలా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో సెనగపిండి, బియ్యప్పిండి, మిరప పొడి, పసుపు, ఉప్పు, జీలకర్ర, చిన్నగా తరిగిన కరివేపాకు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా నీళ్లు పోస్తు మరీ పలుచగా కాకుండా చిక్కగా ఉండేలా కలపాలి. మిశ్రమం గట్టిగా ఉండేలా చూసుకోవాలి లేదంటే పకోడీలు క్రిస్పీగా రావు.
ఇప్పుడు కట్ చేసి ఉంచిన ఉల్లిపాయ ముక్కలను ఈ పిండిలో వేసి చేతితో బాగా కలపండి. ఉల్లిపాయ ముక్కలకు పిండిని బాగా పట్టించాలి. ఇలా చేయడం వల్ల మంచి క్రిస్పీ టెక్స్చర్ వస్తుంది.
అనంతరం ఒక పాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి బాగా వేడి చేయాలి. ఆయిల్ బాగా వేడాయ్యాక ఇప్పుడు మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని చిన్నచిన్న ముక్కలుగా విడదీసి నూనెలో వేసి బంగారు రంగులోకి మారే వరకు మీడియమ్ మంటపై వేయించాలి. పకోడీలు సరిగ్గా వేగే వరకు కలుపుతూ.. సన్నని మంట మీద వేయిస్తే అవి మరింత క్రిస్పీగా వస్తాయి.
వేడి వేడిగా టీతో కలిపి తింటే మరింత రుచిగా ఉంటుంది. ఈ ఉల్లిపాయ పకోడీని కేవలం టీతోనే కాకుండా అన్నంతో సైడ్ డిష్‌గా కూడా తీసుకోవచ్చు. సాయంత్రం వేళ నోటికి నోరూరించే వంటకం కావాలనుకుంటే ఈ పకోడీ బెస్ట్ చాయిస్.