అబ్బ.. బిర్యానీ, షవర్మా.. లొట్టలేసుకుంటూ తెగ తిన్నారు.. కట్ చేస్తే, ఉరుకులు పరుగులు..
బిర్యానీ.. షవర్మా.. అంటే చాలు నాన్ వెజ్ ప్రియులు లొట్టలేస్తుంటారు.. ముందు వెనుక ఆలోచించకుండా తెగ లాగేస్తుంటారు.. బిర్యానీ, షవర్మా లాంటి వంటకాల సువాసన.. సుగంధ ద్రవ్యాల పరిమళం.. వాటి రుచిని మరింత పెంచుతుంది.. ఈ ఆహారాల ప్రత్యేకత గురించి మనం చెప్పాల్సిన పనిలేదు.. కానీ..

బిర్యానీ.. షవర్మా.. అంటే చాలు నాన్ వెజ్ ప్రియులు లొట్టలేస్తుంటారు.. ముందు వెనుక ఆలోచించకుండా తెగ లాగేస్తుంటారు.. బిర్యానీ, షవర్మా లాంటి వంటకాల సువాసన.. సుగంధ ద్రవ్యాల పరిమళం.. వాటి రుచిని మరింత పెంచుతుంది.. ఈ ఆహారాల ప్రత్యేకత గురించి మనం చెప్పాల్సిన పనిలేదు.. కానీ.. కొన్ని హోటళ్ల యాజమాన్యాలు, రెస్టారెంట్ల నిర్వాహకుల తీరుతో బిర్యానీ, షవర్మా లాంటివి తినాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా, కుళ్లిపోయిన ఆహార పదార్థాలను సర్వ్ చేస్తుండటంతో.. బయట తినాలంటేనే ప్రజలు జంకుతున్నారు.. ఫుడ్ సెఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నా.. హోటల్స్, రెస్టారెంట్ నిర్వాహకులు అవేమీ పట్టించుకోకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఫుడ్ తయారీలో ప్రాణాంతక రసాయనాలు, కుళ్లి పోయిన పదార్థాలు ఉపయోగించడంతోపాటు.. అపరిశుభ్రమైన ప్రదేశాల్లో ఆహారం ఉంచడంతో పురుగులు, బొద్దింకలు కూడా దర్శనమిస్తున్నాయి. తాజాగా.. ఓ హోటల్‌లో బీర్యానీ, షవర్మా తిన్న చాలా మంది ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటన కలకలం రేపింది.
తమిళనాడు తిరువల్లికేణిలోని బిలాల్ రెస్టారెంట్-హోటల్‌లో ఆహారం తిన్న తర్వాత 20 మందికి పైగా అస్వస్థతకు గురైనట్లు పోలీసులు తెలిపారు. దీని తర్వాత, ఆహార భద్రతా అధికారులు, పోలీసులు హోటల్‌ను తాత్కాలికంగా సీజ్ చేశారు. 30వ తేదీ రాత్రి చెన్నైలోని తిరువల్లికేణిలోని బిలాల్ హోటల్‌లో కొంతమంది బిర్యానీ, షవర్మా తిన్నారు.. ఆ తర్వాత 20 మందికి పైగా వాంతులు, తలతిరగడంతోపాటు విరేచనాలతో బాధపడ్డారు. తరువాత, వారిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.
మూడు ఆసుపత్రుల్లో చికిత్స..
ప్రముఖ రెస్టారెంట్‌లో బిర్యానీ, షవర్మాతో సహా ఆహారం తిన్న తర్వాత తిరువల్లికేని, ఓల్డ్ వాషర్‌మన్‌పేట్, సైదాపేట ప్రాంతాలకు చెందిన 20 మందికి వాంతులు, తల తిరగడం, విరేచనాలు అయ్యాయి. తరువాత, బాధిత వ్యక్తులను తిరువల్లికేనిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి, తండయార్‌పేట అంటు వ్యాధుల ఆసుపత్రి, రాయపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. ఈ రెస్టారెంట్ మధ్యాహ్నం 1 గంట నుండి అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటుందని.. పండుగ వేళ కావడంతో చాలా మంది కలుషిత ఆహారం తిన్నట్లు పేర్కొన్నారు.
బాధితుల తరపున వచ్చిన ఫిర్యాదు ఆధారంగా, ఆహార భద్రతా అధికారులు తనిఖీ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం, వారు వచ్చేసరికి హోటల్ మూసిఉంది.. దీంతో అధికారులు యజమానులకు ఫోన్ చేశారు. అయితే, కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో అధికారులు హోటల్‌ను తాత్కాలికంగా మూసివేశారు. హోటల్ ను సీజ్ చేశామని.. దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.
ఇదిలాఉంటే.. అన్నా సలైలోని మరో హోటల్‌లో కూడా ఇదే సమస్య తలెత్తింది. ఆహార భద్రతా అధికారులు అక్కడ కూడా తనిఖీలు నిర్వహించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




