AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold ETFs Vs Physical Gold: బంగారం కొనాలా? ఈటీఎఫ్‌లు కొనాలా? బెస్ట్ ఆప్షన్ ఏంటంటే..?

డబ్బు సంపాదించడం ముఖ్యం కాదు.. సంపాదించిన మొత్తాన్ని సక్రమంగా ఖర్చు పెట్టడం, కొంత మొత్తం పొదుపు చేయడం.. ఆ పొదుపు చేసి మొత్తం నుంచి వివిధ మార్గాలలో పెట్టుబడులు పెట్టడం ముఖ్యం. అప్పుడే మీ ఆర్థిక లక్ష్యాలను సులభంగా అధిగమించడానికి వీలవుతుంది. మార్కెట్లో అనేక రకాల పెట్టుబడి పథకాలు అందుబాటులో ఉన్నాయి. కొన్నింటిలో కొంచెం రిస్క్ ఉంటుంది.. కానీ లాభం ఎక్కువ కనిపిస్తుంది. కొన్నింటిలో రిస్క్ అస్సలు ఉండదు.. కానీ రాబడి తక్కువ ఉంటుంది. అదే సమయంలో బంగారాన్ని కూడా మంచి పెట్టుబడి పథకంగా చాలా మంది భావిస్తారు.

Gold ETFs Vs Physical Gold: బంగారం కొనాలా? ఈటీఎఫ్‌లు కొనాలా? బెస్ట్ ఆప్షన్ ఏంటంటే..?
Gold
Follow us
Srinu

|

Updated on: Apr 03, 2025 | 5:15 PM

సాధారణంగా బంగారం అంటే మన దేశంలో చాలా ప్రాధాన్యం ఉంటుంది. మన కుటుంబాలలో బంగారాన్ని కేవలం సంపదలా మాత్రమే కాక ఇక ఆభరణాన్ని ధరించడాన్ని ఒక గౌరవంగా కూడా భావిస్తారు. సాధారణంగా ప్రజలు దీనిని ఆభరణాలు, నాణేల రూపంలో కొనుగోలు చేయడం మనం చూస్తుంటాం.. అయితే ఈ బంగారం ద్వారా ఇటీవల కాలంలో పెట్టుబడి పెట్టే వివిధ పథకాలు కూడా అందుబాటులో వచ్చాయి. అవే బంగారు ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్లు( గోల్డ్ ఈటీఎఫ్), సావరిన్ బంగారు బాండ్లు (ఎస్జీబీ), డిజిటల్ బంగారం. ప్రస్తుతం ఇవి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి భౌతిక రూపంలో కొనుగోలు చేయకుండా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి అనువైనవి. ఈ నేపథ్యంలో వీటిల్లో పెట్టుబడులు ఎలా పెట్టాలి? వాటిల్లో ప్రయోజనాలు ఏంటి? ఇబ్బందులు ఏంటి? లాభాలు ఎలా ఉంటాయి? తెలుసుకుందాం రండి..

భౌతిక బంగారంపై మక్కువ..

వివాహాలు, మతపరమైన ఆచారాలు, ప్రత్యేక సందర్భాలలో బంగారం కొనడం శుభప్రదంగా మనం భావిస్తాం. అందుకే ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్బీఐ ) సావరిన్ గోల్డ్ బాండ్ల వంటి పథకాలను ప్రవేశపెట్టినప్పటికీ, ప్రజలు భౌతిక బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రజలు దీనిని ఆభరణాలుగా ధరించడానికి ఇష్టపడటమే కాకుండా, అవసరమైనప్పుడు విక్రయించగల సురక్షితమైన పెట్టుబడిగా కూడా భావిస్తారు. అందుకే భారతీయ మార్కెట్లో ప్రతి సంవత్సరం టన్నుల కొద్దీ బంగారం కొనుగోలు చేయబడుతుంది. దీనిపై ప్రజలకు ఉన్న ఆసక్తి ఎప్పటికీ తగ్గదు.

గోల్డ్ ఈటీఎఫ్..

బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఆధునిక మార్గం ఇది. ఈ గోల్డ్ ఈటీఎఫ్‌లు స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో వర్తకం చేస్తాయి. వాటి ధరలు భౌతిక బంగారం ధరలతో ముడిపడి ఉంటాయి. బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి కానీ నిల్వ, దొంగతనం, అపరిశుభ్రత గురించి ఆందోళన చెందకుండా ఉండాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక. గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టడానికి డీమ్యాట్ ఖాతా అవసరం. దీనిని స్టాక్ ఎక్స్ఛేంజ్ ద్వారా కొనుగోలు చేయవచ్చు లేదా అమ్మవచ్చు. ఇది పూర్తిగా డిజిటల్, కాబట్టి పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితంగా ఉంచడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో (ఫిబ్రవరి 2025 వరకు), గోల్డ్ ఈటీఎఫ్‌లు రూ.14,948 కోట్ల పెట్టుబడులను నమోదు చేశాయి. ఇది 2023-24 కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. నిర్వహణలో ఉన్న ఆస్తులు (ఏయూఎం) పరంగా, గోల్డ్ ఈటీఎఫ్‌లు ఫిబ్రవరి 2025కి వార్షికంగా ఏయూఎంలో 95.2% పెరిగి రూ.55,677 కోట్లకు చేరుకున్నాయని నివేదించింది.

ఇవి కూడా చదవండి

పదేళ్లలో ఏది ఎక్కువ రాబడినిస్తుందంటే..?

భౌతిక బంగారంతో ఈ గోల్ట్ ఈటీఎఫ్ ను పోల్చి చేస్తే.. మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అందుకే పదేళ్లు, పదిహేనళ్లలో ఏది ఎక్కువ రాబడిని ఇచ్చిందో ఓసారి చూద్దాం..

భౌతిక బంగారంపై పెట్టుబడి..

  • 10 సంవత్సరాలలో రాబడి.. గత 10 సంవత్సరాలలో, బంగారం ధర 10 గ్రాములకు రూ.26,340 నుంచి రూ.88,996కి పెరిగింది. ఇది 12% సీఏజీఆర్. మార్చి 28, 2025 నాటికి ఎంసీఎక్స్ లో బంగారం స్పాట్ ధర 10 గ్రాములు రూ.88,996గా ఉంది.
  • 15 సంవత్సరాలలో బంగారం పెట్టుబడి రాబడి.. 2010 నుండి 2025 వరకు బంగారం 15 సంవత్సరాల ప్రయాణాన్ని పరిశీలిస్తే, పసుపు లోహం ధర 10 గ్రాములకు రూ. 18,500 వద్ద ఉండి, రూ. 88,996కి పెరిగింది, ఇది 17.01% సీఏజీఆర్

గోల్డ్ ఈటీఎఫ్ లలో పెట్టుబడి..

  • గత 10 సంవత్సరాలలో బంగారు ఈటీఎఫ్ లలో సగటు రాబడి 11.44%, అదే గత 15 సంవత్సరాలలో చూస్తే 10.80%.
  • భౌతిక బంగారంతో ప్రయోజనాలు.. భౌతిక బంగారానికి దాని ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే దీనిని ఆభరణాలుగా ధరిస్తారు. తరం నుండి తరానికి వారసత్వంగా భద్రపరచవచ్చు. భారతీయ కుటుంబాలలో భౌతిక బంగారాన్ని ఎల్లప్పుడూ సురక్షితమైన ఆస్తిగా పరిగణించడానికి ఇదే కారణం. దీనితో పాటు భౌతిక బంగారం యొక్క మరొక పెద్ద ప్రయోజనం ఏమిటంటే అవసరమైతే దానిని తనఖా పెట్టవచ్చు. ఎప్పుడైనా ఆర్థిక సంక్షోభం ఎదురైతే, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు దానిపై రుణాలు అందిస్తాయి.

భౌతిక బంగారంతో ఇబ్బందులు

భౌతిక బంగారాన్ని కొనడం ఎంత సులభమో, దానిని ఉంచుకోవడం కూడా అంతే కష్టం. భద్రత, నిల్వ అనేవి అతిపెద్ద ఆందోళనలలో ఒకటి. దానిని ఉంచడానికి లాకర్ అవసరం. దీని వలన అదనపు ఖర్చులు వస్తాయి. ఇంట్లో ఉంచుకుంటే, దొంగతనం లేదా నష్టం జరిగే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. రెండవ సమస్య ఏమిటంటే అశుద్ధత, తయారీ ఛార్జీలు. నకిలీ లేదా అశుద్ధ బంగారు ఆభరణాలు మార్కెట్లో సులభంగా లభిస్తాయి. కాబట్టి కొనుగోలుదారులు ఎల్లప్పుడూ బీఐఎస్ హాల్‌మార్క్‌ను పరిశీలించిన తర్వాత కొనుగోలు చేయాలి. దీనితో పాటు, బంగారు ఆభరణాలను తయారు చేసేటప్పుడు తయారీ ఛార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇది దాని మొత్తం ఖర్చును పెంచుతుంది.

బంగారు ఈటీఎఫ్‌ల ప్రయోజనాలు

బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునే పెట్టుబడిదారులకు, నిల్వ, భద్రత వంటి ఇబ్బందులను నివారించాలనుకునే వారికి గోల్డ్ ఈటీఎఫ్ ఒక అద్భుతమైన ఎంపిక. ఇది డిజిటల్ రూపంలో డీమ్యాట్ ఖాతాలో సురక్షితంగా ఉంటుంది కాబట్టి, దీనిలో దొంగతనం లేదా నష్టం జరుగుతుందనే ఆందోళన ఉండదు. గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టడానికి ఎటువంటి మేకింగ్ ఛార్జ్ చెల్లించాల్సిన అవసరం లేదు. దీనిని మార్కెట్ ధరకు కొనుగోలు చేయవచ్చు మరో అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే బంగారు ఈటీఎఫ్ లను తక్షణమే కొనుగోలు చేయవచ్చు. అమ్మవచ్చు. ఇది స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో జాబితా చేసి ఉంటుంది. కాబట్టి దీనిలో లిక్విడిటీ సమస్య ఉండదు. మీకు నగదు అవసరమైనప్పుడల్లా, మీరు దానిని వెంటనే అమ్మవచ్చు.

బంగారు ఈటీఎఫ్ ప్రతికూలతలు

పెట్టుబడి పెట్టడానికి డీమ్యాట్ ఖాతా అవసరం. ప్రతి పెట్టుబడిదారుడికి డీమ్యాట్ ఖాతా ఉండదు, లేకపోతే, దానిని తెరవడానికి, నిర్వహించడానికి డబ్బు ఖర్చు కావచ్చు. అదనంగా, దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్ఈసీజీ) వర్తిస్తుంది. మీరు 12 నెలల కంటే ఎక్కువ కాలం బంగారు ఈటీఎఫ్ లను కలిగి ఉంటే, మీరు ఇండెక్సేషన్ లేకుండా 12.5% ​​ఎల్టీసీజీ పన్ను చెల్లించాలి. ఇది భౌతిక బంగారంపై కూడా వర్తిస్తుంది. బంగారు ఇటిఎఫ్‌లు స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో వర్తకం చేయబడతాయి కాబట్టి, దాని ధర హెచ్చుతగ్గులకు లోనవుతుంది. ఇది మార్కెట్‌లోని డిమాండ్ , సరఫరాను బట్టి హెచ్చుతగ్గులకు లోనవుతుంది, ఇది కొంతమంది పెట్టుబడిదారులకు ఆందోళన కలిగిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి