AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: 2026లో రూ.2000 నోట్లను మార్చుకోవచ్చా? ఆర్బీఐ ఏం చెబుతోంది..?

2000 Notes Exchanged: మీ ఇంట్లో ఇంకా రూ.2,000 నోట్లు ఉన్నాయా? వాటిని మార్చుకోవడం ఇబ్బందిగా భావిస్తున్నారా? నో టెన్షన్. ఈ నోట్లు వాడుకలో లేకపోయినా మార్చుకునేందుకు ఇంకా అవకాశం ఉంది. ఆర్బీఐ ఈ ఏడాది 2026లో కూడా మార్చుకునే అవకాశం ఇచ్చింది..

RBI: 2026లో రూ.2000 నోట్లను మార్చుకోవచ్చా? ఆర్బీఐ ఏం చెబుతోంది..?
2000 Notes Exchanged
Subhash Goud
|

Updated on: Jan 10, 2026 | 8:33 PM

Share

2000 Notes Exchanged: మీ ఇంట్లో ఇంకా రూ.2,000 నోట్లు ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. యాక్టివ్ సర్క్యులేషన్ నుండి ఉపసంహరించినప్పటికీ రూ.2,000 నోటు ఇప్పటికీ చట్టబద్ధమైనదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పదే పదే స్పష్టం చేసింది. మే 2023లో కరెన్సీ నిర్వహణలో భాగంగా ఆర్బీఐ రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. చిన్న విలువ కలిగిన నోట్లలో ద్రవ్యతను మెరుగుపరచడం ఈ చర్య.

దీనికి ప్రధాన కారణం రోజువారీ లావాదేవీలకు రూ. 2,000 నోట్లను సాధారణంగా ఉపయోగించకపోవడమే. ముఖ్యంగా ఈ ఉపసంహరణ నోట్ల రద్దు కాదు. రూ. 2,000 నోట్లలో 98% కంటే ఎక్కువ ఆర్బీఐకి తిరిగి వచ్చాయి. ఇంకా రూ. 5,669 కోట్ల విలువైన నోట్లు మాత్రమే చెలామణిలో ఉన్నాయి. ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే 2026లో కూడా రూ. 2,000 నోట్లను మార్చుకోవచ్చా లేదా అనేది. 2000 రూపాయల నోట్లు 2026 వరకు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయి. అయితే వాటి వాడుక ప్రయోజనం గణనీయంగా తగ్గింది. ఆర్బీఐ ఇప్పటికే వాటిని చెలామణి నుండి ఉపసంహరించుకుంది.

దేశ పౌరుల వద్ద తగినంత ఇతర డినామినేషన్ల నోట్లు ఉన్నాయి. అందువల్ల ఆర్బీఐ తన “క్లీన్ నోట్ పాలసీ” కింద మే 2023లో రూ.2000 నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. రూ.2000 నోట్లలో 98% కంటే ఎక్కువ ఆర్బీఐకి తిరిగి వచ్చాయి. రూ.5,669 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ఇప్పటికీ చెలామణిలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Budget 2026: ఎవ్వరితో సంబంధం లేకుండా 10 రోజుల పాటు గదిలోనే బడ్జెట్‌ బృందం.. ఎందుకో తెలుసా?

తదుపరి నోటీసు వచ్చే వరకు రూ.2000 నోట్లు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయి. అయితే దేశంలోని ఏ సాధారణ బ్యాంకు శాఖలోనైనా వాటిని మార్చుకునే అవకాశం అక్టోబర్ 7, 2023న ముగిసింది. దీని అర్థం మీరు ఇకపై బ్యాంకుకు వెళ్లి మీ రూ. 2000 నోట్లను గతంలో చెలామణిలో ఉన్న ఇతర కరెన్సీ నోట్లతో చేసినట్లుగా మార్చుకోలేరు. అయితే మరొక ఆప్షన్‌ ఏమిటంటే మీరు ఇప్పటికీ మీ రూ.2000 నోట్లను మార్చుకోవచ్చు లేదా ఆర్బీఐ 19 ప్రాంతాల్లో ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. అక్కడ మార్చుకునేందుకు వీలుంటుంది. ఈ కార్యాలయాలు అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురం, బేలాపూర్‌లలో ఉన్నాయి.

Mukesh Ambani: అంబానీ ఒక రోజులో ఎంత సంపాదిస్తారో తెలిస్తే బిత్తరపోవాల్సిందే..!

ఆర్బీఐ ఇష్యూ ఆఫీసును సందర్శించలేని వారు భారతదేశంలోని ఏదైనా పోస్టాఫీసు నుండి ఇండియా పోస్ట్ ద్వారా రూ.2,000 నోట్లను ఆర్బీఐ ఇష్యూ ఆఫీసుకు పంపి వారి బ్యాంకు ఖాతాలలో జమ చేసుకోవచ్చు. ఈ ఎంపిక ముఖ్యంగా మారుమూల ప్రాంతాలలో నివసించే వ్యక్తులు, సీనియర్ సిటిజన్లు లేదా ఇతర సమస్యలు ఉన్నవారికి ఉపయోగపడుతుంది. చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాలు, రిజర్వ్ బ్యాంక్ లేదా ప్రభుత్వ నిబంధనల ప్రకారం మార్చుకోవాల్సి ఉంటుంది. రూ.2,000 నోట్లను అంగీకరించడం చట్టబద్ధమే కానీ అది ఎల్లప్పుడూ వాడకలో ఉండవు. కేవలం నోట్లను మార్పిడి మాత్రమే చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి