ఈ ఫుడ్స్‎తో కిడ్నీకి హాని.. జాగ్రత్త తప్పనిసరి.. 

02 April 2025

TV9 Telugu

శరీరంలో ఉన్న భాగాల్లో కిడ్నీ చాలా ముఖ్యం.ఇలాంటి సమయంలో కిడ్నీల ఆరోగ్యం గురించి ఖచ్చితంగా ఆలోచించాలి.

శరీరంలో వ్యర్థాలను, అదనపు ద్రవాన్ని తొలగించడంలో, రక్తం సరఫరాకి అవసరమయ్యే నీరు, లవణాలు, ఖనిజాలను నిర్వహించడంలో సహాయపడతాయి.

అయితే ఈ 5 ఆహారాల రుచిగా ఉన్నాయని అధికంగా తీసుకుంటే కిడ్నీలు దెబ్బతింటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మయోన్నైస్ ఫుడ్ పోషకాలను పాడు చేస్తుంది. ఇది తీసుకుంటే బరువు మెరగడమే కాదు కిడ్నీ సమస్యలు కూడా వస్తాయి.

ప్రాసెస్ చేసిన ఆహారాలలో చక్కెర, సోడియం, కొవ్వు అధికంగా ఉంటాయి. దీని కారణం మూత్రపిండాలు దెబ్బతింటాయి.

సోడాలో ఎలాంటి పోషక విలువలు లేవు. దీని వినియోగం మూత్రపిండాల వ్యాధి, జీవక్రియ సిండ్రోమ్, దంత సమస్యలను కారణం అవుతుంది.

ప్రాసెస్ చేసిన మాంసాంలో సోడియం అధికంగా ఉంటుంది. దీని కారణంగా మూత్రపిండాలపై అదనపు ఒత్తిడి పడి కిడ్నీ వ్యాధి బారిన పడతారు.

బంగాళదుంపలతో చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్ లో పొటాషియం అధికంగా ఉన్న కారణంగా మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు వీటిని తినడం తగ్గించాలి.