Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మండుతున్న ఎండలతో చేపల విలవిల.. గోస వెళ్లబోస్తున్న మత్స్యకారులు..!

నీటి నిల్వ ఎక్కువగా ఉంటే.. చేపలు.. కింది వరకు వెళ్లితాయి. ఆహారం కూడా ఎక్కువగా దొరుకుతుంది. నీరు తక్కువగా ఉండటంతో.. నీళ్లు వెంటనే వేడిగా మారుతున్నాయి. వాటిని తాగడంతో చేపలు అలిసిపోతున్నాయి. అస్వస్థతకు గురై చనిపోతున్నాయి. అన్ని రకాలు చేపలు చనిపోవడంతో.. మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. కనీసం గిట్టుబాటు ధర కూడా పలికడం లేదని గోడు వెళ్లబోసుకున్నారు.

మండుతున్న ఎండలతో చేపల విలవిల.. గోస వెళ్లబోస్తున్న మత్స్యకారులు..!
Heatwave Kills Fish
Follow us
G Sampath Kumar

| Edited By: Balaraju Goud

Updated on: Apr 03, 2025 | 5:28 PM

మండుతున్న ఎండలతో మత్స్య సంపదపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎన్నడూ లేని విధంగానే ఫిబ్రవరి నెల నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో భూగర్భజలాలు వేగంగా అడుగంటుతున్నాయి. ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో నీళ్లు ఇంకిపోతున్నాయి. దీని కారణంగా మత్స్య సంపదపై తీవ్ర ప్రభావం పడుతోంది. చేపల ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. మరోవైపు ఎండ తీవ్రతను తట్టుకోలేక పెద్ద ఎత్తున చేపలు ప్రాణాలు విడుస్తున్నాయి. చేపల ఎదుగుదల లేకున్నా.. మత్స్య కార్మికులు చేపలు పడుతున్నారు. ఈసారి చేపల సైజు తక్కువగా ఉండటంతో మార్కెట్లో రేటు కూడా కరువైంది. ఎండల తీవ్రత ఇలా ఉంటే.. ఈ నెల చివరి వారం లోపే చెరువులు, కుంటల్లో చుక్క నీరు కూడా కరువయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది.

ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా చేపల ఉత్పత్తి జరుగుతుంది. ఇక్కడ ప్రాజెక్టులతో పాటు చెరువులు, కుంటల్లో చేపలను పెంచుతున్నారు. వాస్తవానికి మే నెల మొదటి వారం నుంచి చేపల సైజు పెరుగుతుంది. ఆ సమయానికి నీళ్లు సరిపడా ఉన్నట్లైయింతే, చేపల సైజు పెరుగుతుంది. మే నెలతో పాటు జూన్ నెలల్లో చేపలు పుష్కలంగా అందుబాటులోకి వస్తాయి. అప్పటికే రెండు కిలలకు పైగా ఉంటా యి చేపల దిగుబడి బాగుటుంది.

కానీ, ఈసారి మాత్రం ఎండలు ఫిబ్రవరి నుంచే దంచుతున్నాయి. దీని కారణంగా ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో నీరు వేగంగా ఇంకిపోతుంది. ఇప్పుడు చాలా చెరువుల్లో నీరు తగ్గింది. అక్కడక్కడ మడుగుల్లో మాత్రమే నీటి జాడలు కనిపిస్తున్నాయి. వాటిలో చేపలు ఉన్నా.. వేడికి చనిపోతున్నాయి. అదే విధంగా ప్రధాన ప్రాజెక్టులు లోయర్ మానేరు డ్యామ్. మిడ్ మానేరు డ్యామ్‌లలో కూడా నీరు వేగంగా ఇంకిపోతుంది. దీని కారణంగా చేపలు చనిపోతున్నాయి. వేడి నీళ్లు తాగడంతో చేపలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నాయి. చనిపోయిన చేపలన్నీ నీటిలో తేలుతున్నాయి. దీంతో చేసేదీలేక చేపల సైజు తక్కువగా ఉన్నప్పటికీ.. చేపలను పడుతున్నారు మత్స్యకారులు.

ఉత్తర తెలంగాణలో ఎక్కువగా మంచి నీటిలో చేపల పెంపకం జరుగుతుంది. ఇతర రాష్ట్రాల్లో మన చేపలకు మంచి డిమాండ్ ఉంటుంది. అయితే.. పెద్దగా ఉన్న చేపలకు మాత్రమే డిమాండ్ ఉంటుంది. వాటిని కొనుగోలు చేయడానికి వ్యాపారస్తులతో పాటు.. వినియోగదారులు ఆసక్తి చూపుతారు. ఇప్పుడు మాత్రం.. చేపలన్నీ కిలో లోపు మాత్రమే ఉంటున్నాయి. మార్కెట్లో వీటిని తీసుకెళ్తే.. 50 రూపాయాలలోపు.. కిలోకు కొనుగోలు చేస్తున్నారు. పొద్దంతా చేపలు పడుతే.. కనీస డబ్బులు కూడా రావడం లేదు. చేపల సైజు తక్కువగా ఉండటంతో వలలో కూడా చేపలు పడటం లేదు. చేపలు పెరిగినా.. పెరగకున్నా.. ఈ 15 రోజుల్లో చేపల వేట కొనసాగిస్తున్నారు.

నీటి నిల్వ ఎక్కువగా ఉంటే.. చేపలు.. కింది వరకు వెళ్లితాయి. ఆహారం కూడా ఎక్కువగా దొరుకుతుంది. నీరు తక్కువగా ఉండటంతో.. నీళ్లు వెంటనే వేడిగా మారుతున్నాయి. వాటిని తాగడంతో చేపలు అలిసిపోతున్నాయి. అస్వస్థతకు గురై చనిపోతున్నాయి. అన్ని రకాలు చేపలు చనిపోవడంతో.. మత్స్యకార్మికులు ఆందోళన చెందుతున్నారు. కనీసం గిట్టుబాటు ధర కూడా పలికడం లేదని గోడు వెళ్లబోసుకున్నారు. ఇంకా ఎండ తీవ్రత పెరుగుతే.. మిగిలిన చేపలు కూడా బతకడం కష్టమనే అంటున్నారు.. పెరిగిన ఎండల కారణంగా.. మత్స్య సంపదకు కోలుకోలేని దెబ్బగా తయారైంది. తమను ప్రభుత్వం ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..