Telangana: పవన్ కొడుకు స్కూల్లో ప్రమాదం..ఘటనపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారునికి జరిగిన ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. పవన్ కుమారుడికి గాయాలు కావడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారునికి జరిగిన ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. పవన్ కుమారుడికి గాయాలు కావడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదువుతున్న పాఠశాలలో ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పవన్ కొడుకు శంకర్ సహా పలువురు చిన్నారులు గాయపడ్డారు. అప్రమత్తమైన స్కూల్ సిబ్బంది వారిని వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం పవన్ కుమారుడు శంకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలిసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు తన “X” ఖాతాలో పోస్ట్ చేశారు.
అయితే మన్యం జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ కాసేపటి క్రితమే పర్యటన ముంగించుకొని వైజాగ్ చేరుకున్నారు. కాసేపట్లో ఆయన సింగపూర్ వెళ్లనున్నారు. పవన్ కల్యాణ్ తో పాటు చిరంజీవి దంపతులు కూడా వెళ్లనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ చూడండి