పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిదేనా..? పెరుగు తినేటప్పుడు ఈ తప్పులు చేయకండి..!
పెరుగు ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరూ అనుకుంటారు. కానీ దానిలో చక్కెర కలపాలా..? లేక ఉప్పు కలపాలా..? అన్నదానిపై స్పష్టత అవసరం. ఆయుర్వేద నిపుణుల ప్రకారం పెరుగు తినే విధానమే దాని ప్రయోజనాలను నిర్ణయిస్తుంది. ఆరోగ్యకరమైన దీని వినియోగం కోసం చక్కెర, ఉప్పు వాడకం గురించి వివరంగా తెలుసుకోవడం ముఖ్యం.

పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిదే. కానీ పెరుగుతో చక్కెర కలపాలా..? లేక ఉప్పు కలపాలా..? ఏది మంచిదో తెలుసుకోవాలి. ముందుగా ఆయుర్వేదం నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. పెరుగును వేసవిలో ఎక్కువగా తింటారు. ఎందుకంటే ఇది వేడిని తగ్గిస్తుందని భావిస్తారు. కానీ ఆయుర్వేద నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..? పెరుగు తిన్నా దాని స్వభావం మాత్రం వేడిగానే ఉంటుందని చెబుతున్నారు.
ఎలా తినాలి..?
చాలా మంది పెరుగుతో లస్సీ తయారు చేసుకుంటారు. మరికొందరు దానిలో చక్కెర లేదా ఉప్పు కలిపి తింటారు. అయితే పెరుగులో ఏది కలపడం ఆరోగ్యానికి మేలు చేస్తుందో తెలుసుకోవాలి.
ఆయుర్వేద నిపుణులు చెప్పిన ప్రకారం పెరుగు స్వభావం ఆమ్లంగా ఉంటుంది. దాన్ని ఏదైనా కలపకుండా తినాలి. ఎందుకంటే పెరుగును తప్పుగా తీసుకుంటే రక్తం కలుషితం అవుతుందని.. చర్మ సమస్యలు రావచ్చని చెబుతున్నారు.
రాత్రి పెరుగు తినొచ్చా..?
ప్రతిరోజూ పెరుగు తినడం మంచిది కాదు. ముఖ్యంగా రాత్రి పెరుగు తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చు. కానీ పెరుగును తేనె, నెయ్యి, బెల్లంతో కలిపి తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతున్నారు.
పెరుగులో ఉప్పు..?
కొన్నిసార్లు పెరుగులో ఉప్పు కలిపి తినొచ్చు. కానీ ఎల్లప్పుడూ ఇలా చేయడం మంచిది కాదు. ఎందుకంటే పెరుగు సహజంగా వేడిగా ఉంటుంది. ఎక్కువ ఉప్పు కలిపితే చర్మ సమస్యలు, జుట్టు రాలడం, మొటిమలు వంటి సమస్యలు రావచ్చు.
పెరుగులో చక్కెర..?
పెరుగుతో చక్కెర కలిపి తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. చక్కెర కలిపితే పెరుగులోని వేడిమి తగ్గి శరీరానికి చల్లదనం లభిస్తుంది. అలాగే బెల్లం కలిపి తింటే కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.
లస్సీ మంచిదేనా..?
వేసవిలో పెరుగుతో లస్సీ తాగడం వల్ల శరీరానికి మంచి శక్తి లభిస్తుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచి నీటి కొరతను నివారిస్తుంది. అయితే ఏదైనా ఆహారాన్ని మితంగా తీసుకోవడం మంచిది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




