Corona Virus: కోవిడ్ దెబ్బకు ఆరోగ్యంపై ప్రజల్లో పెరిగిన శ్రద్ధ.. భారీ సంఖ్యలో హెల్త్ చెకప్స్
తీవ్రమైన మూడో వేవ్ తగ్గుముఖం పట్టిన తర్వాత డయాగ్నొస్టిక్ ల్యాబ్‌లకు COVID-19 నిర్ధారణ పరీక్షలకు వచ్చే బాధితులు తక్కువు అయ్యాయి. అయితే ల్యాబ్స్ లో ఇతర పరీక్షలకు ఎక్కువ డిమాండ్ ఏర్పడింది..
Corona Virus: కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రంగం తిరోగమనంలో పయనిస్తుంది. అదే విధంగా కోవిడ్ -19(Covid 19) అడుగు పెట్టిన మొదటి సంవత్సరంలో నివారణ కోసం అనేక నిబంధనలు అమలు చేశారు. లాక్ డౌన్ (Lock Down), సామజిక దూరం వంటి నిబంధనలు కఠినంగా అమలు చేయడంతో.. డయాగ్నస్టిక్ వంటి అనేక పరిశ్రమలు తమ ఆదాయాలను కోల్పోయాయి. ఇక మార్చి 2021లో రెండవ వేవ్ మళ్ళీ మొదలైంది. . డిసెంబర్ 2021 లో మూడవ వేవ్ మొదలైంది. అప్పుడు మళ్ళీ పాత్ ల్యాబ్‌లలో వ్యాపారం మళ్లీ పుంజుకుంది.
ముఖ్యంగా పాజిటివ్ కోవిడ్ కేసులు పెరిగినప్పుడల్లా.. డయాగ్నొస్టిక్ ల్యాబ్‌లలో పరీక్షలు దామాషా ప్రకారం పెరిగాయి. RTPCR పరీక్షల ధరలు వివిధ రాష్ట్రాల్లో వివిధ ధరల్లో నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లో విధించిన పన్ను ఆధారంగా ఆర్టీపిసిఆర్ పరీక్షలను నిర్వహించారు. దీంతో దేశంలో అన్ని రాష్ట్రాల్లో ల్యాబ్స్ ఆదాయం ఒకేలా లేదు. ఒక నివేదిక ప్రకారం.. భారతదేశంలో అతిపెద్ద డయాగ్నస్టిక్ చైన్ కలిగిన సంస్థ డా లాల్ పాత్‌లాబ్స్ ఆదాయం పరంగా అగ్రభాగాన నిలిచినట్లు తెలుస్తోంది. ఈ డయాగ్నస్టిక్ చైన్ సంస్థ ఆ త్రైమాసికంలో సగటున రూ. 450 కోట్ల నుండి టర్నోవర్ రూ. 600 కోట్లకు పైగా ఉంది. ఆ త్రైమాసికంలో దాదాపు రూ. 200 కోట్ల కోవిడ్ సంబంధిత విక్రయాలు జరిగాయి.
పోస్ట్-COVID పరీక్షలు:
తీవ్రమైన మూడో వేవ్ తగ్గుముఖం పట్టిన తర్వాత డయాగ్నొస్టిక్ ల్యాబ్‌లకు COVID-19 నిర్ధారణ పరీక్షలకు వచ్చే బాధితులు తక్కువు అయ్యాయి. అయితే ల్యాబ్స్ లో ఇతర పరీక్షలకు ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. ఇదే విషయంపై MediBuddy అనే సంస్థ హెడ్ డాక్టర్ గౌరీ కులకర్ణి.. న్యూస్ 9 తో పలు విషయాలను పంచుకున్నారు, “SARS CoV 2 ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురి చేసింది. ఈ సమయంలో ప్రజల ఆరోగ్యం, సంతోషము ప్రాముఖ్యతను హైలైట్ చేసింది. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై దృష్టి సారించారు. అంతేకాదు అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. దీంతో మధుమేహం, థైరాయిడ్, పూర్తి శరీర తనిఖీకి సంబంధించిన ల్యాబ్ పరీక్షలలో వరుసగా 69 శాతం, 67 శాతం , 84 శాతం పెరుగుదల కనిపించిందని చెప్పారు.
ఐరన్, విటమిన్ బి12 , ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల రక్తహీనత, విటమిన్ డి3 లోపం వలన థైరాయిడ్ పనితీరులో మార్పులు, అధిక షుగర్ లెవల్స్, హిమో గ్లోబులిన్‌లు తగ్గడం, ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు లేదా ఇన్‌ఫెక్షన్లు వంటి అనేక కారణాల వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుందని ఆమె చెప్పారు. “ఈ మహమ్మారి బారిన పడిన తర్వాత ప్రజలు ఎంచుకున్న రోగనిరోధక శక్తి పరీక్ష ప్యాకేజీలు ల్యాబ్లో 46 శాతం పెరిగిందని చెప్పారు.
మధుమేహం, థైరాయిడ్, పూర్తి శరీర తనిఖీకి సంబంధించిన ల్యాబ్ పరీక్షల్లో వరుసగా 69 శాతం, 67 శాతం , 84 శాతం పెరుగుదల కనిపించిందని డాక్టర్ గౌరీ కులకర్ణి చెప్పారు.
డిజిటల్ హెల్త్‌కేర్ ప్లాట్‌ఫారమ్ 12 నుండి 18 సంవత్సరాల వయస్సు వారు 3.67 శాతం, 19 నుండి 30 సంవత్సరాల వయస్సు వారు 56.5 శాతం, 31 నుండి 40 సంవత్సరాల వయస్సు వారు 27.3 శాతం, 40 సంవత్సరాల వయస్సు వారు 11.73 శాతం వృద్ధి రేటును నమోదు చేసిందని తెలిపారు. ఇక 50 ఏళ్ళు పై బడినవారు 0.8 శాతం ఇంటి వద్దనే పరీక్షలు నిర్వహించారని తెలిపారు.
ఫోర్టిస్ హెల్త్‌కేర్ స్వతంత్ర అనుబంధ సంస్థ SRL డయాగ్నోస్టిక్స్ CEO ఆనంద్ కె మాట్లాడుతూ.. “అక్టోబర్ 2020 నాటికి.. తాము కోవిడ్ వెలుగులోకి రాక ముందు ఏ విధంగా ఉన్నదో అదే స్టేజ్ కి తిరిగి చేరుకున్నామని తెలిపారు. కోవిడ్ యేతర పరీక్షలు గరిష్ట సమయంలో మాత్రమే ప్రభావితమయ్యాయని తెలిపారు. మున్ముందు మా ఆదాయం 5 నుంచి 10 శాతంగా ఉంటుంది.. ఎందుకంటే ఈ పరీక్షలు ప్రజలను ఆసుపత్రిలో చేరడానికి.. ఉపయోగబడతాయని తెలియపారు. కనుక కరోనా అనంతరం కొన్ని పరీక్షలు కొనసాగుతాయి” అని ఫార్చ్యూన్ ఇండియా నివేదించింది.
RTPCRలు మాత్రమే కాదు ఇతర పరీక్షలకు ధరలకు రెక్కలు:
మహమ్మారి ప్రారంభ రోజుల్లో, ప్రభుత్వ క్యాపింగ్ కారణంగా RT-PCR పరీక్షల ధరలలో హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఉదాహరణకు.. నవంబర్ 2020లో, ఢిల్లీ ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌లలో RT-PCR పరీక్షల రేటును రూ. 800కి పరిమితం చేసింది. గత ఏడాది ఆగస్టులో దానిని రూ. 500కి తగ్గించింది. అనంతరం ప్రభుత్వం ఈ పరీక్షల ధరను పరిమితం చేసింది. ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌లలో COVID-19 నిర్ధారణ పరీక్షలు RT-PCR ల ధర రూ. 300లకు మాత్రమే నిర్వహించారు.
ఈ ధరలను మునుపటి రేటుతో పోలిస్తే 40 శాతం తగ్గింపని చెప్పవచ్చు. RT-PCR పరీక్షకు ఇంతకు ముందు ధర రూ. 500. ప్రస్తుతం ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ (RAT) ధర రూ. 100. ఇంతకుముందు, RAT ధర రూ. 300. అదే కరోనా నిర్ధారణ కోసం ఇంటి వద్ద శాంపిల్స్ సేకరిస్తే.. మొదట్లో రూ. 700 లు ఉండగా ఇప్పుడు రూ. 500 ధర .కొనసాగుతుంది.
అయితే, కొన్ని ల్యాబ్‌లు తమ ప్యాకేజీల్లో 2020కి ముందు ఉన్న ధరలకు ఎలాంటి వ్యత్యాసం లేదని నొక్కి చెబుతున్నాయి. “రక్త పరీక్షలు, ఇతర సాధారణ పరీక్షల ధరలు కోవిడ్-19కి ముందు.. తర్వాత కూడా అదేవిధంగా ఉన్నాయి. అయితే RT-PCR ధరల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం మార్పులు చోటు చేసుకున్నాయి.. కనుక డయాగ్నొస్టిక్ ల్యాబ్ కంపెనీ ఆదాయంలో మార్పులు చోటు చేసుకున్నాయని డాక్టర్ కులకర్ణి అన్నారు.
విటమిన్ B12 ప్రొఫైల్ కోసం SRL పరీక్షల ధరలు 2021లో రూ. 820 మాత్రమే. అయితే ఇప్పుడు ఆ పరీక్ష ధర రూ. 1150లకు చేరుకుంది. ఇక ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ రూ.240 లు ఉండగా ప్రస్తుతం రూ.350కి చేరింది.
“COVID వెలుగులోకి వచ్చిన తర్వాత.. ప్రజల మనస్సులలో తమ ఆరోగ్యంపై అనేక సందేహాలు కలుగుతున్నాయి. తమ ఆరోగ్యం గురించి తెలుసుకోవాలనే కుతూహలం కలిగి ఉన్నారు. దీంతో ఎక్కువ మంది ప్రజలు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నారు. అందువల్ల పాత్ ల్యాబ్‌లో మళ్ళీ రద్దీ నెలకొంటాయి. ఈ భయాందోళనల పరిస్థితి సద్దుమణిగెందుకు ఇంకో రెండేళ్లు” పడుతుందని.. నోయిడాలోని జేపీ హాస్పిటల్స్‌కు చెందిన కన్సల్టెంట్ ఫిజీషియన్ డాక్టర్ మీతా భగవత్ అన్నారు. (Source)
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..