Weight Gain Foods: ఆరోగ్యంగా బరువు పెరగాలనుకునేవారికి.. అమేజింగ్ సూపర్ ఫుడ్స్ ఇవే!
బరువు తగ్గాలనుకునే వారే కాదు.. పెరగాలనుకునే వారు కూడా ఉంటారు. ఇప్పటివరకూ మనం బరువు తగ్గాలనుకునే వారి గురించి చాలా టిప్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు బరువు పెరగాలనుకు వారు ఎలాంటి ఫుడ్స్ తిని, టిప్స్ పాటిస్తే ఆరోగ్యంగా బరువు పెరుగుతారో తెలుసుకుందాం. బరువు తగ్గడం కష్టం కానీ.. బరువు మాత్రం చాలా ఈజీగా పెరగొచ్చు. అలాగని ఏవి పడి అవి తినకూడదు. కొంత మంది బక్క పల్చగా ఉంటారు. ఎంత తిన్నా.. ఎన్ని టిప్స్ పాటించినా బరువు మాత్రం..

బరువు తగ్గాలనుకునే వారే కాదు.. పెరగాలనుకునే వారు కూడా ఉంటారు. ఇప్పటివరకూ మనం బరువు తగ్గాలనుకునే వారి గురించి చాలా టిప్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు బరువు పెరగాలనుకు వారు ఎలాంటి ఫుడ్స్ తిని, టిప్స్ పాటిస్తే ఆరోగ్యంగా బరువు పెరుగుతారో తెలుసుకుందాం. బరువు తగ్గడం కష్టం కానీ.. బరువు మాత్రం చాలా ఈజీగా పెరగొచ్చు. అలాగని ఏవి పడి అవి తినకూడదు. కొంత మంది బక్క పల్చగా ఉంటారు. ఎంత తిన్నా.. ఎన్ని టిప్స్ పాటించినా బరువు మాత్రం పెరగరు. అలాగని ట్యాబ్లెట్స్ కూడా వేసుకుంటారు. కానీ వీటి వల్ల భవిష్యత్తులో నష్టాలే తప్ప.. లాభాలు ఉండవు. నేచురల్ గానే బరువు పెరగొచ్చు. అందుకు ఎలాంటి ఫుడ్స్ తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్యాట్ మిల్క్:
కొవ్వు ఎక్కువగా ఉన్న పాలను తాగితే ఈజీగా బరువు పెరుగుతారు. ఫ్యాటీ మిల్క్ తీసుకోవడం హెల్త్ కి కూడా మంచిదే. ఈ పాలలో కొవ్వు, విటమిన్లు, పోషకాలు, విటమిన్ డి, ఏ వంటివి ఉంటాయి. ఇవి బరువు పెరిగేందుకు సహాయం చేస్తాయి. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఫ్యాట్ మిల్క్ తాగితే బరువు పెరుగుతారు.
రెడ్ మీట్:
బరువు పెరగాలనుకునే వారికి బెస్ట్ ఫుడ్ ఏంటంటే.. రెడ్ మీట్ అని చెప్పవచ్చు. ఇది తినడం వల్ల ఈజీగా వెయిట్ గైన్ అవ్వొచ్చు. ఇందులో కొలెస్ట్రాల్ లెవల్స్, ప్రోటీన్స్, ఐరన్ వంటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రెడ్ మీట్ ని హాయిగా తినొచ్చు.
పీనట్ బటర్:
పీనట్ బటర్ తినడం వల్ల ఆరోగ్యంతో పాబు బలం, బరువు కూడా పెరుగుతారు. దీన్ని బ్రెడ్ తో తింటే ఈజీగా వెయిల్ గైన్ అవుతారు. ఇందులో ప్రోటీన్, కొవ్వు పదార్థాలు, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, విటమిన్ బి, ఇలు మెండుగా ఉంటాయి. ఓ టేబుల్ పీనట్ బటర్ లో దాదాపు వంద కేలరీలు ఉంటాయి.
పండ్లు:
పండ్లు బరువు తగ్గడానికే కాదు.. బరువు పెరగడానికి కూడా తీసుకోవచ్చు. పైనాపిల్, బొప్పాయి, మామిడి కాయ వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటే బరువు పెరగొచ్చు. వీటిని నేరుగా తిన్నా, వీటితో పాటు తయారు చేసిన స్వీట్స్, స్మూతీలను తీసుకుంటే వెయిల్ గైన్ అవుతారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.