Health Tips: పరగడుపున వీటిని తింటే ఆరోగ్య ప్రయోజనాలెన్నో.. ఆ రోగాలకు చెక్..
మరికొందరికి ఉదయాన్నే బెడ్ కాఫీ తాగకపోతే.. వారు మంచం కూడా దిగరు. అయితే వీటి బదులుగా ఇవి పరగడుపున తీసుకుంటే..

ఉదయం లేవగానే కొందరికి టీ తాగడం అలవాటు. తాగితేనే గానీ వారికి రోజు మొదలవదు. మరికొందరికి ఉదయాన్నే బెడ్ కాఫీ తాగకపోతే.. వారు మంచం కూడా దిగరు. అయితే వీటి బదులుగా ఇవి పరగడుపున తీసుకుంటే.. రోగనిరోధక శక్తి పెరుగుతుందని డాక్టర్లు అంటున్నారు. అంతేకాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలెన్నో దక్కుతాయన్నారు. మరి అవేంటో తెలుసుకుందాం..
-
ఉసిరి:
ఉసిరిలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తి పెరగడానికి దోహదపడతాయి. అందుకే పరగడుపున వీటిని తిన్నట్లయితే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చునని వైద్యులు అన్నారు. రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు.. జుట్టు సంరక్షణకు, చర్మ సౌందర్యానికి ఉసిరి ఎంతగానో మేలు చేస్తుంది.
-
తేనె
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో తేనె కలుపుకుని తాగితే ఆరోగ్య ప్రయోజనాలెన్నో.. ఆ రెండింటితో పాటు నిమ్మరసం కూడా జోడిస్తే.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తాయి. అలాగే మీ రోజూవారి డైట్‌లో తేనెను చేర్చినట్లయితే.. బరువు తగ్గడమే కాదు.. చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుంది.
-
తులసి:
రాత్రంతా నానబెట్టిన తులసి ఆకులను ఉదయాన్నే తిని.. ఆ నీటిని తాగినట్లయితే.. దగ్గు, జలుబు లాంటి ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టొచ్చు. అలాగే తులసి రసం తాగడం వల్ల చర్మానికి, జుట్టుకు, దంతాలకు ఎంతో మంచిదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
-
వెల్లుల్లి:
యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్ గుణాలు కలిగిన వెల్లుల్లి సహజసిద్దమైన యాంటీ బయోటిక్‌గా పని చేస్తుంది. దీనిని తినడం వల్ల జలుబు, దగ్గు లాంటి ఇన్ఫెక్షన్లు దరికి చేరవు. అలాగే వ్యాధులతో పోరాడేందుకు శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడమే కాదు.. గుండె, ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. ఉదయాన్నే రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను గోరువెచ్చని నీటితో కలిపి తిన్నట్లయితే.. రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది.




