Sambar: సాంబార్ రుచిగా ఉండాలంటే ఏం చేయాలి.. ఇంట్లో ఇలా తయారు చేసి చూడండి..!

Sambar: సౌత్ ఇండియన్ ఫుడ్ విషయానికి వస్తే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది రుచికరమైన సాంబార్‌. ఇది లేకుండా సౌత్ ఇండియన్ ఫుడ్ అసంపూర్ణమనే చెప్పాలి.

Sambar: సాంబార్ రుచిగా ఉండాలంటే ఏం చేయాలి.. ఇంట్లో ఇలా తయారు చేసి చూడండి..!
Sambar
Follow us

|

Updated on: May 11, 2022 | 6:51 AM

Sambar: సౌత్ ఇండియన్ ఫుడ్ విషయానికి వస్తే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది రుచికరమైన సాంబార్‌. ఇది లేకుండా సౌత్ ఇండియన్ ఫుడ్ అసంపూర్ణమనే చెప్పాలి. సాంబార్ అనేది వివిధ రకాల కూరగాయలతో తయారుచేసే ఒక సూప్. దీని రుచి అద్భుతంగా ఉంటుంది. ఇడ్లీ, దోసె, వడ, అన్నం అన్నింటిలోకి సాంబార్‌ ఉండాల్సిందే. సాంబారును కర్ణాటకలో సాంబారు, తమిళనాడులో సాంబార్ అని పిలుస్తారు. ఇది ఏ పేరుతో పిలిచినా రుచి దాదాపు అన్ని ఒకేలా ఉంటుంది. టేస్టీ సాంబార్‌ను తయారు చేయడం చాలా చిన్న పని. కానీ దీన్ని ఎలా చేయాలో తెలియకపోవడం వల్ల మహిళలు సరిగ్గా చేయలేకపోతారు. అయితే సాంబార్‌ని రుచికరంగా ఎలా చేయాలో తెలుసుకుందాం.

సాంబార్ కోసం ముందుగా పప్పును కనీసం అరగంట సేపు నీటిలో నానబెట్టాలి. తర్వాత పప్పు నుంచి నీటిని వేరు చేసి సరిపడా నీళ్లు పోసి కుక్కర్‌లో 15 నిమిషాలు ఉడకనివ్వాలి. ఒక విజిల్ వచ్చిన తర్వాత మంట తక్కువగా పెట్టాలి. సుమారు మరో 15 నిమిషాల తర్వాత గ్యాస్‌ను ఆపివేసి కుక్కర్‌లోని ఆవిరి చల్లబడే వరకు అలాగే ఉంచాలి. ఆవిరి చల్లారిన తర్వాత కుక్కర్ మూత తెరిచి పప్పును మెత్తగా రుబ్బాలి.

ఇక సాంబార్‌లోకి కూరగాయ ముక్కలని పెద్దగా కట్‌ చేయకూడదు. ఎందుకంటే పెద్ద ముక్కలు సాంబార్‌లో మరగడం కష్టం. అందుకే మీడియం సైజులో కట్ చేసుకోవాలి. వాటిని ఒక పాన్‌లో వేయించి అర టీస్పూన్ ఉప్పు కలపాలి. ఉప్పు వేయడం వల్ల కూరగాయలు త్వరగా ఉడుకుతాయి. తర్వాత వాటిని ఇప్పటికే సిద్ధం చేసిన పప్పులో వేయాలి. బాగా కలిపి అందులో చింతపండు రసం వేయాలి. సన్నని మంటపై బాగా మరిగించాలి. చివరలో సాంబార్ మసాలా వేస్తే రెడీ అయినట్లే. అయితే సాంబార్ మసాలా మార్కెట్‌లో సులువుగా దొరుకుతున్నప్పటికీ ఇంట్లో తయారుచేసే మసాలాల రుచి అద్భుతంగా ఉంటుంది. అందుకే సాధ్యమైనంత వరకు ఇంట్లో చేసిన మసాల వాడితే మంచిది.

మరిన్ని ఆహార వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Health Tips: ఈ పప్పులో పోషకాలు పుష్కలం.. గుండె ఆరోగ్యానికి బెస్ట్‌..!

Garlic Benefits: వేసవికాలం వెల్లుల్లి కచ్చితంగా డైట్‌లో ఉండాలి.. ఎందుకంటే..?

IPL 2022 points table: ప్లే ఆఫ్‌ రేసులో కోల్‌కతా.. ముంబైపై విజయంతో పాయింట్ల పట్టికలో మార్పులు..!