Headache: తలనొప్పి రాగానే ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా.? చాలా డేంజర్‌.. ఈ నేచురల్‌ టిప్స్‌ ఫాలో అవ్వండి.. వెంటనే రిలీఫ్‌ ఉంటుంది.

Headache: మనలో చాలా మంది ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలో తలనొప్పి ఒకటి. కాస్త ఒత్తిడికి గురైనా, నిద్ర తక్కువ అయినా వెంటనే తలనొప్పి వస్తుంది. బద్దలయ్యే...

Headache: తలనొప్పి రాగానే ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా.? చాలా డేంజర్‌.. ఈ నేచురల్‌ టిప్స్‌ ఫాలో అవ్వండి.. వెంటనే రిలీఫ్‌ ఉంటుంది.
Follow us

|

Updated on: Sep 15, 2021 | 7:10 PM

Headache: మనలో చాలా మంది ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలో తలనొప్పి ఒకటి. కాస్త ఒత్తిడికి గురైనా, నిద్ర తక్కువ అయినా వెంటనే తలనొప్పి వస్తుంది. బద్దలయ్యే తలనొప్పి రాగానే మందులు వేసుకోవడానికి మెడికల్‌ షాప్‌కి పరుగెడుతుంటాం. ఎడాపెడా ట్యాబ్లెట్లు వేసుకుంటాం. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తూనే ఉంటున్నారు.

చీటికి మాటికి ట్యాబ్లెట్లు వేసుకుంటే అప్పటికప్పుడు తలనొప్పి నుంచి ఉపశమనం లభించినా తర్వాత తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి తరచూ వచ్చే తలనొప్పిగా సహజంగా తగ్గించుకోలేమా అంటే.. దానికి ఓ మార్గం ఉంది. కొన్ని నేచురల్‌ టిప్స్‌ పాటించడం ద్వారా అప్పటికప్పుడు తలనొప్పి నుంచి బయటపడొచ్చు. ఇంతకీ ఆ నేచురల్‌ ఫుడ్‌ ఏంటంటే..

లవంగంతో..

ముందుగా 4 నుంచి 6 లవంగాలను తీసుకోవాలి. అనంతరం ఒక పెనంపై బాగా వేయించాలి. అనంతరం ఆ లవంగాను పొడిగా చేయాలి. తర్వాత ఆ పొడిని కర్చీఫ్‌లాంటి ఓ వస్త్రంలో కట్టాలి. ఆ పొడిని క్రమం తప్పకుండా వాసన చూస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల తలనొప్పి నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది.

అల్లంతో తలనొప్పి ఉష్‌..

అన్ని రకాల నొప్పులను తగ్గించడంలో అల్లం కీలక పాత్ర పోషిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అల్లంను ఆహారం రూపంలో తీసుకున్నా మంచి ఫలితం లభిస్తుంది. ఇక అప్పటికప్పుడు తలనొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే ముందుగా అల్లం పొట్టును తీసుకొని ఎండబెట్టి పొడి చేయాలి. తర్వాత అల్లం పొడికి నీరు కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. తర్వాత ఆ పేస్ట్‌ను నుదిటిపై కొన్ని నిమిషాల పాటు ఉంచాలి వెంటనే ఫలితం లభిస్తుంది.

పుదీనా ఆకులు..

తలనొప్పి తగ్గిచండంలో పుదీనా కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇందుకోసం పుదీనా ఆకులతో రసాన్ని తీయాలి. అనంతరం రసాన్ని నుదిటిపై రాయాలి. ఇలా చేయడం వల్ల తలనొప్పి నుంచి బయట పడొచ్చు. పుదీనాను నేరుగా తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

తులసి కూడా..

ఒక కప్పు నీరును మరిగించి అందులో కొన్ని తులసి ఆకులు వేసి మరగించాలి. అనంతరం టీలా తయారైన తర్వాత దానిని తాగాలి ఇలా చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. ఇక రుచి కోసం కొంచెం తేనెను కూడా యాడ్‌ చేసుకోవచ్చు.

అల్లంతో ఆవిరి..

సాధారణంగా ఆవిరిపట్టుకునే సమయంలో నీటిలో పసుపు లేదా జండూబామ్‌ వేసుకుంటాం. అయితే అల్లంతో ఆవిరి పట్టుకున్నా మంచి ఫలితం లభిస్తుంది. పచ్చి అల్లం లేదా అల్లం పొడిని మరుగుతున్న నీటిలో వేసుకొని ఆవిరి పట్టుకోవాలి ఇలా చేయడం వల్ల తలనొప్పి నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది.

Also Read: Heavy Rains: కుండపోత వర్షాలతో విలవిలలాడుతున్న ఒడిశా, చత్తీస్‌ఘడ్‌.. వరదల బీభత్సంతో అపారనష్టం

Viral Video: అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేస్తే ఇలా ఉంటుందా..! వైరల్‌గా మారిన ఈ వీడియో చూస్తే మీరూ ఇదే అంటారు.

Two Headed Snake: అదృష్టాన్ని తెచ్చే రెండు తలల పామంటూ అమ్మకానికి యత్నం.. పోలీసుల ఎంట్రీతో..