Neck Pain: మెడ నొప్పి తీవ్రంగా బాధిస్తుంటే ఇంట్లో ఉండే పదార్థాలతో ఇలా చేయండి.. క్షణాల్లో ఉపశమనం..

ప్రస్తుతం కరోనా ప్రభావంతో చాలా మందికి వర్క్ ఫ్రమ్ విధానం వలన అనేక అనారోగ్య సమస్యల భారిన పడుతున్నారు. ముఖ్యంగా వెన్ను నొప్పి, కీళ్ల నొప్పి, మెడ నొప్పి ఇలాంటివి. ఒకేవైపు ఎక్కువ సమయం చూడడం వలన మెడ నొప్పి బాధిస్తుంటుంది.

Neck Pain: మెడ నొప్పి తీవ్రంగా బాధిస్తుంటే ఇంట్లో ఉండే పదార్థాలతో ఇలా  చేయండి.. క్షణాల్లో ఉపశమనం..
Neck Pain
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Rajitha Chanti

Updated on: Jul 17, 2021 | 8:15 PM

ప్రస్తుతం కరోనా ప్రభావంతో చాలా మందికి వర్క్ ఫ్రమ్ విధానం వలన అనేక అనారోగ్య సమస్యల భారిన పడుతున్నారు. ముఖ్యంగా వెన్ను నొప్పి, కీళ్ల నొప్పి, మెడ నొప్పి ఇలాంటివి. ఒకేవైపు ఎక్కువ సమయం చూడడం వలన మెడ నొప్పి బాధిస్తుంటుంది. అలాగే..కొందిరికి నిద్రలో ఒకేవైపు పడుకోవడం వలన మెడ పట్టేస్తుంది. అయితే కొన్నిసార్లు మెడ నొప్పి తీవ్రంగా వేధిస్తుంది. కొందరికి మెడ పై భాగంలో కండరాల ఒత్తిడి, గర్భాశయ వెన్నుపూస, నరాలపై ఒత్తిడి కారణంగా మెడ నొప్పి తలెత్తుతుంది. అంతేకాకుండా.. మరికొందరు ఇష్టానుసారంగా.. వెరైటీ భంగిమలలో కూర్చోవడం వలన కూడా ఈ నొప్పి కలగవచ్చు. నడుస్తున్నప్పుడు, ఆడేటప్పు కండరాల ఒత్తిడి వలన మెడ నొప్పి కలుగుతుంది. అయితే దీని నుంచి తాత్కాలిక ఉపశమనం పొందేందుకు కొన్ని చిట్కాలను పాటించవచ్చు అవెంటో తెలుసుకుందామా.

1. మెడ వాపు నుంచి ఉపశమనం పొందడానికి.. ఐస్ ముక్కను మెడపై కొన్ని నిమిషాలు ఉండనివ్వాలి. అలాగే మెడనొప్పి మొదలవగానే.. కాస్త గోరువెచ్చని నీటితో స్నానం చేయడం.. క్లాత్ కాస్త వేడిగా చేసి మెడ పై కొన్ని నిమిషాలు ఉంచడంతో నొప్పి తగ్గుతుంది.

2. మెడపై కాస్త గోరు వెచ్చని నూనెతో మసాజ్ చేయాలి. ఇలా చేయడం వలన మెడ, వెనుక కండరాలకు కాస్త విశ్రాంతి లభించడమే కాకుండా.. నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

3. మెడ నొప్పి వేధిస్తున్న సమయంలో బరువు ఎత్తకూడదు. అలాగే శారీరక శ్రమ అస్సలు చేయకూడదు. బరువు ఎత్తడం వలన మెడ నొప్పి ఎక్కువగా బాధిస్తుంది.

4. అలాగే జుట్టును గట్టిగా కట్టి ఉంచకండి.. మెడ నొప్పి వేధిస్తున్న సమయంలో జుట్టు గట్టిగా వేసుకోకూడదు. అలాగే గోరువెచ్చని నూనెతో తలకు మసాజ్ చేయడం వలన నొప్పి తగ్గుతుంది. అలాగే తలను అటు,ఇటు తిప్పకూడదు. అలా చేయడం వలన మెడ కండరాల ఒత్తిడి కలుగుతుంది. ఫలితంగా నొప్పి ఎక్కువవుతుంది. అలాగే దిండు లేకుండా నిద్రించకూడదు.

Also Read: Venkatesh: “నారప్ప” సినిమాకు తీవ్రంగా శ్రమించా.. అయినా ఇలా.. అభిమానులకు క్షమాపలు చెప్పిన వెంకటేశ్..

అడుగులు వేయకముందే స్విమ్మింగ్‏ నేర్చుకుంటున్న ఈ చిన్నారి ఇప్పుడు టాప్ హీరోయిన్.. ఇంతకీ ఎవరో తెలుసా..