Health: పైల్స్ సమస్య వేధిస్తోందా..? వీటిని తీసుకోండి, వెంటనే ఫలితం ఉంటుంది..
Health: ఇటీవల చాలా మంది ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో (Piles) ఒకటి. మారుతోన్న జీవనశైలి (Lifestyle), ఆహార అలవాట్ల కారణంగా ఈ సమస్య వస్తుంది. ముఖ్యంగా షిప్ట్‌ల్లో పనిచేసే వారు, ఆహారం తీసుకునే సమయాల్లో ఒక పద్ధతి పాటించని వారు, గంటల తరబడి కూర్చోవడం...
Health: ఇటీవల చాలా మంది ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో (Piles) ఒకటి. మారుతోన్న జీవనశైలి (Lifestyle), ఆహార అలవాట్ల కారణంగా ఈ సమస్య వస్తుంది. ముఖ్యంగా షిప్ట్‌ల్లో పనిచేసే వారు, ఆహారం తీసుకునే సమయాల్లో ఒక పద్ధతి పాటించని వారు, గంటల తరబడి కూర్చోవడం, మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం, ఇలా రకరకాల కారణంగా పైల్స్ సమస్య వేధిస్తుంటుంది. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలతో ఈ పైల్స్ సమస్యకు చెక్ పెట్టవచ్చనే విషయం మీకు తెలుసా.? పైల్స్ సమస్యను సహజంగా తగ్గించుకోవడానికి డైట్‌లో కచ్చితంగా కొన్ని ఆహార పదార్థాలను చేర్చాలి.. అవేంటంటే..
- సహజంగా పైల్స్ సమస్యకు ప్రధాన కారణం జీర్ణ సమస్యలే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాబట్టి ఈ పైల్స్‌తో ఇబ్బంది పడుతున్న వారు బెల్లంను క్రమంతప్పకుండా తీసుకోవాలి. ప్రతి రోజూ రాత్రి భోజనం అనంతరం చిన్న బెల్లం ముక్కను తీసుకోవాలి. ఇలా చేస్తే ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. మరుసటి రోజు సుఖ విరేచనానికి కూడా దోహదపడుతుంది.
- పైల్స్ సమస్యను తగ్గించడంలో వెల్లుల్లి కూడా మంచి ఔషధంగా పని చేస్తుంది. ఉదయంలేవగానే పరగడుపున 3 లేదా 4 పచ్చి వెల్లుల్లి రెబ్బలను తీసుకొని పెనంపై వేసి వేయించి అలాగే తినాలి. లేదా తేనేతో కలిపి తీసుకున్న పర్వాలేదు. ఇలా చేయడం వల్ల అజీర్ణం, మలబద్దకం తగ్గి పైల్స్ తగ్గుతుంది.
- పైల్స్ సమస్యతో బాధపడే వారు కిస్మిస్‌లను తీసుకోవాలి. వీటిలో ఉండే జింక్, కాల్షియం, విటమిన్లు ఎంతో మేలు చేస్తాయి. రాత్రిపూట కిస్మిస్‌లను తీసుకుంటే మరుసటి సుఖ విరేచనం అవుతుంది. దీంతో పైల్స్ సమస్య తగ్గుతుంది.
- బాదం పప్పు కూడా పైల్స్‌కు మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఇ, కాల్షియం, ఫాస్ఫరస్ పైల్స్‌కు విరుడుగా పనిచేస్తాయి. బాదంపప్పును రాత్రి పూట నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపునే వాటిని పొట్టు తీసి తినాలి. దీని వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోవడంతోపాటు మలబద్దకం తగ్గుతుంది.
- ఇక పైల్స్‌ను దూరం చేసే ఆహార పదార్థాల్లో జామ పండు కూడా ఒకటి. జామ పండు తీసుకోవడం వల్ల మలబద్దకం ఉండదు. రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక జామ పండు తీసుకుంటే ఆహారం బాగా జీర్ణమవుతుంది.
నోట్: పైన తెలిపిన ఆహార పదార్థాలు పైల్స్ సమస్యను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే సమస్య ప్రారంభంలో ఉంటేనే ఈ డైట్ పనిచేస్తుంది. ఒకవేళ మరీ ఎక్కువగా ఉంటే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా రక్తస్రావం ఎక్కువగా అయ్యేవారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదిస్తే సర్జరీ లేకుండానే సమస్య నుంచి బయటపడొచ్చు..
Narayana Swamy-YS Jagan: సినిమా హీరో కాదు.. సీఎం జగన్ హీరోలకే హీరో.. ఏపీ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు