AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine War: వారికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన కర్ణాటక.. ఆ రాష్ట్రంలో ఎక్కడికెళ్లిన ఫ్రీ..

ఉక్రెయిన్(Ukraine) నుంచి కర్ణాటక(Karnataka ) విమానాశ్రాయలకు చేరుకున్న విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించేందుకు..

Russia Ukraine War: వారికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన కర్ణాటక.. ఆ రాష్ట్రంలో ఎక్కడికెళ్లిన ఫ్రీ..
Ksrtc
Srinivas Chekkilla
|

Updated on: Feb 28, 2022 | 5:00 PM

Share

ఉక్రెయిన్(Ukraine) నుంచి కర్ణాటక(Karnataka ) విమానాశ్రాయలకు చేరుకున్న విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించేందుకు కర్ణాటక ప్రభుత్వం సోమవారం నిర్ణయించింది. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) మేనేజింగ్ డైరెక్టర్ శివయోగి సి కలసద్ మాట్లాడుతూ.. “ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చే మా ప్రజలు, ముఖ్యంగా విద్యార్థుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, సమీప విమానాశ్రయం నుండి కెఎస్‌ఆర్‌టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని అందించాలని నిర్ణయించాం. విద్యార్థులు కర్ణాటకలోని వారి స్వస్థలాలకు బస్సులో ఉచితంగా వెళ్లొచ్చు.” అని చెప్పారు. కర్ణాటక స్టేట్ ఎయిర్‌పోర్ట్‌లోని నోడల్ అధికారులందరూ, KSRTC సంబంధిత DCలు ససమన్వయం చేసుకోలన్నారు.

ఉక్రెయన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను భారత ప్రభుత్వం విమానాల్లో ఉచితంగా తీసుకొస్తుంది. ఇందులో భాగంగానే దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రత్యేకంగా విమానాలను నడుపుతోంది. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే.. ఒక్కో విమానం ఇక్కడి నుంచి బయలుదేరివెళ్లి తిరిగి రావడానికి ఏకంగా రూ. 1.10 కోట్లు ఖర్చవుతోందని తెలిసింది. ఉక్రెయిన్ సరిహద్దులోని రొమేనియా, హంగరీలకు ఎయిర్ ఇండియా తన విమానాలను నడుపుతోంది. ఇందుకోసం బోయింగ్ 787 భారీ విమానాలను వినియోగిస్తోంది. ఈ విమానాలను నడిపేందుకు గంటకు రూ. 7 నుంచి 8 లక్షల వరకు ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది.

విమాన ప్రయాణ సమయం భారీగా ఉండటం వల్ల.. ఎక్కువ మంది సిబ్బందిని వినియోగించాల్సి రావటం కూడా వ్యయం పెరగటానికి కారణంగా తెలుస్తోంది. బుకారెస్ట్‌ నుంచి శనివారం ముంబయి చేరుకున్న విమానం దాదాపు ఆరు గంటలు ప్రయాణించింది. బుడాపెస్ట్‌ నుంచి ఢిల్లీకి వచ్చిన విమానానికి కూడా దాదాపుగా అంతే సమయం పట్టింది. ఈ సుదీర్ఘ ప్రయాణం కోసం గంటకు రూ.7-8 లక్షల చొప్పున మొత్తంగా ప్రయాణానికి రూ.1.10 కోట్లు ఖర్చవుతుందని అంచనా. డ్రీమ్‌లైనర్‌ నడవడానికి గంటకు 5 టన్నుల ఇంధనం అవసరమవుతుంది. ఈ ప్రయాణానికి అయ్యే ఖర్చును భారత ప్రభుత్వం చెల్లించనున్నట్లు తెలుస్తోంది. ఇటు తెలంగాణలోనూ ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ అవకాశాన్ని కల్పిస్తున్నారు.

Read Also.. Russia Ukraine War: యుద్ధంపై ప్రధాని మోడీ ప్రత్యేక సమావేశం.. ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు కేంద్ర మంత్రులు..