Late Night Snacks: అర్ధరాత్రి ఆకలేస్తుందా..? అయితే ఇలాంటి స్నాక్స్ తీసుకోండి..
Late night food craving: రాత్రిపూట భోజనం చేసినప్పటికీ.. చాలామంది అర్ధరాత్రి వేళ ఆకలితో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో హెవీ ఫుడ్ తీసుకోవడం అస్సలు మంచిది కాదు. అయితే ఇలాంటి సందర్భంలో ఆహారాన్ని తినాలనుకుంటే.. కొన్ని తేలికపాటి పదార్థాలను తీసుకోవడం ద్వారా ఆకలిని నియంత్రించుకోవచ్చు.
Updated on: Mar 01, 2022 | 8:46 AM

అర్థరాత్రి చాలామంది ఆకలితో బాధపడుతుంటారు. అలాంటి వారు అందుబాటులో ఉన్న ఆహారాన్ని తీసుకుంటుంటారు. అయితే.. ఇలాంటి సమయంలో తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. అయితే.. అలాంటి ఆహార కోరికను సాఫ్ట్ ఫుడ్‌తో నియంత్రించవచ్చు. ఆ ఆహార పదార్థాలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.

డ్రై ఫ్రూట్స్: మీకు పగలు లేదా రాత్రి ఎప్పుడైనా ఆకలి అనిపిస్తే.. మీరు డ్రై ఫ్రూట్స్ తినడం చాలా మంచిది. ఇలా చేయడం ద్వారా ఆహార కోరికను తగ్గించుకుకోవచ్చు. ఈ పద్ధతి పూర్తిగా ఆరోగ్యకరమైనదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే.. డ్రై ఫ్రూట్స్‌ను పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి.

ఉడకబెట్టిన గుడ్డు: మీరు నాన్-వెజ్‌ని ఇష్టపడితే.. ఉడికించిన గుడ్డు కూడా చాలా మంచిది. ఉడికించిన గుడ్లు ఆకలిని శాంతపరుస్తాయి. అందులో ఉండే పోషకాలు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయని పలు అధ్యయనాలు కూడా పేర్కొంటున్నాయి.

పండ్లు: చాలా మంది వ్యక్తులు తరచుగా అర్థరాత్రి ఆకలితో బాధపడుతుంటారు. అలాంటి వారు ఆకలిని శాంతింపజేయడానికి పండ్లను తినవచ్చు. పరిమిత పరిమాణంలో పండ్లను తినడం వల్ల ఆకలిని అరికట్టడంతోపాటు.. ఆరోగ్యం కూడా కలుగుతుందని పేర్కొంటున్నారు.

పనీర్: ఈ ఆహార పదార్థాన్ని పచ్చిగా కూడా తినవచ్చు. విశేషమేమిటంటే దీని రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ అర్ధరాత్రి సమయంలో ఆకలి అవుతుంటే.. దీనిని తినడం మంచిది.

పాప్‌కార్న్: అర్థరాత్రి ఆకలిని తగ్గించుకోవడానికి మీరు పాప్‌కార్న్ కూడా తినవచ్చు. మీరు మార్కెట్‌లో పాప్‌కార్న్ ప్యాకెట్‌లను కొనుగోలు చేసి ఇంట్లో ఉంచుకుంటే.. నిమిషాల్లోనే వాటిని చేసుకోని తినవచ్చు. అలాగే సులభంగా జీర్ణం అవుతాయి.




