Health Tips: వెనుక జేబులో పర్స్ పెట్టుకుంటున్నారా.. అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే
మనం పాటించే కొన్ని కొన్ని అలవాట్లే మన శరీరానికి తీవ్ర ఇబ్బంది కలిగిస్తాయి. అప్పటికప్పుడే వాటి దుష్ప్రభావాలు తెలియకపోయినా.. భవిష్యత్ లో చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చూడటానికి చాలా...
మనం పాటించే కొన్ని కొన్ని అలవాట్లే మన శరీరానికి తీవ్ర ఇబ్బంది కలిగిస్తాయి. అప్పటికప్పుడే వాటి దుష్ప్రభావాలు తెలియకపోయినా.. భవిష్యత్ లో చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చూడటానికి చాలా కామన్ గా అనిపించే అలవాట్లే.. ముందు ముందు అత్యంత ప్రమాదకరమైనవిగా మారతాయి. అలాంటి వాటిలో ప్యాంటు వెనుక జేబులో (Purse in Pant Pocket) పర్సు పెట్టుకుని కూర్చోవడం. వెనుక జేబులో పర్సు పెట్టుకుని గంటల సేపు కూర్చొనేవారికి తుంటి సమస్యలు ఏర్పడుతున్నట్లు వైద్య నిపుణులు (Health Experts) చెబుతున్నారు. బయటకు వెళ్లినప్పుడు ప్యాంట్ వెనుక జేబులో పర్సు పెట్టుకునే వాళ్లు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ముఖ్యంగా పర్సులను జేబులో పెట్టుకొని గంటల సేపు కూర్చొనేవారు, డ్రైవింగ్ చేసేవారికి నడుపు నొప్పి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. వాలెట్ (Wallet) పై కూర్చోవడం వల్ల వెన్నుముకలోని చివరి భాగంపై ఒత్తిడి పడుతుంది. ఇది వెన్నెముక సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఎత్తుగా ఉండే పర్స్ పై కూర్చోవడం ద్వారా కండరాల సామర్థ్యం తగ్గుతుంది. దీంతో విపరీతమైన నొప్పి కలుగుతుంది.
ఈ అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండేందుకు మనం కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఆఫీస్‌లో పని చేస్తున్న సమయంలో పర్సును బ్యాగ్ లో గానీ, డెస్క్ లో గానీ పెట్టుకోవడం మంచిది. వాహనాలు నడుపుతున్నప్పుడు బైక్ ముందు కవర్‌లో లేదా కారు డెస్క్‌లో పెట్టాలి. పర్సును వెనుక జేబులో కంటే ముందు జేబులో పెట్టుకోవడం సరైనది. పర్సులో అనవసరమైన వాటిని తీసేయాలి. మెత్తగా ఉండే వాలెట్ వాడాలి. పర్సులో కార్డులు, కాయిన్స్, ఐడీలు ఉండకుండా… కేవలం నగదు మాత్రమే ఉండేలా జాగ్రత్త వహించాలి.
Also Read
Amaravati: ఆయోమంలో రాష్ట్ర ప్రజలు.. క్లారిటీ ఇవ్వాలంటూ.. సీఆర్డీఏ, రెరాలకు లీగల్ నోటీసులు..!
Teaching Jobs: హైదరాబాద్ అటామిక్ ఎనర్జీ స్కూల్‌లో టీచర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Viral Video: ఈ బుడ్డోడు చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు.. క్షణం ఆలస్యం అయ్యిఉంటే ..