Health: వేడి నీటితో స్నానం చేస్తే జుట్టు ఊడిపోతోందా.. నిపుణుల సమాధానం వింటే షాక్ అవ్వాల్సిందే
నేటి యుగంలో మన జీవితం చాలా వేగంగా గడిచిపోవడమే కాదు.. ఒత్తిడి కూడా చాలా పెరిగింది. అంతే కాకుండా వాతావరణంలో మార్పువల్ల కూడా జుట్టు రాలుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తలలో అనేక....
నేటి యుగంలో మన జీవితం చాలా వేగంగా గడిచిపోవడమే కాదు.. ఒత్తిడి కూడా చాలా పెరిగింది. అంతే కాకుండా వాతావరణంలో మార్పువల్ల కూడా జుట్టు రాలుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తలలో అనేక రకాల ఇన్ఫెక్షన్లు, జుట్టు సమస్యలు రావడం సర్వసాధారణమైపోయాయి. ఆయుర్వేదం ప్రకారం వాత, పిత్త, కఫ దోషాలపై ఒక వ్యక్తి ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కీలక శక్తులలో అసమతుల్యత ఉన్నప్పుడు, జుట్టు సంబంధిత సమస్యలు ఏర్పడతాయి. వర్షంతో పాటు వాతావరణంలోని తేమ శరీరంలో గాలి కదలికకు ఆటంకం కలిగిస్తుంది. ఇది వాత సంచితానికి దారితీస్తుంది. వర్షాకాలంలో పిత్త కూడా పెరుగుతుంది. ‘వాత. పిత్తలో అసమతుల్యత ఉంటే కఫం కూడా అడ్డుపడుతుంది. దీని కారణంగా వివిధ జుట్టు సమస్యలు వస్తాయి.
ఆయిల్ స్కాల్స్ ఉన్నవారికి జిడ్డు జుట్టు, హెవీ చుండ్రు, దురద వంటి సాధారణ జుట్టు సమస్యలు ఉంటాయి. సరిగ్గా జాగ్రత్త తీసుకోకపోతే ఇది ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. అంతేకాకుండా జుట్టు మూలాలను బలహీనపరిచి జుట్టు రాలిపోయేలా చేస్తుంది. అయితే జుట్టు రాలే సమస్యను అరికట్టేందుకు ఆయుర్వేదంలో చికిత్సలు అందుబాటులో ఉంటాయి. చికిత్స తీసుకునే ముందు జుట్టు ఎందుకు రాలుతుందన్న విషయాన్ని తెలుసుకోవాలి. తర్వాత చికిత్స ఆరంభిస్తే మంచి పరిష్కారం లభిస్తుంది. తలకు నూనె రాసుకోవాలి. ఇది జుట్టు రాలడాన్, బట్టతలను నివారిస్తుంది. జుట్టు నల్లగా, పొడవుగా. అందంగా కనిపించేలా చేస్తుంది. ఇది జుట్టు మూలాలకు పోషణనిస్తుంది.
రెగ్యులర్ హెయిర్ మసాజ్ కోసం ఆవాలు, కొబ్బరి నూనెను కూడా ఉపయోగించవచ్చు. వేడినీళ్లు తలపై పోసుకోవడం వల్ల వెంట్రుకలు నిస్సారంగా మారతాయి. వారానికి మూడు సార్లు తలస్నానం చేయాలి. షాంపూలు, సబ్బులు తేలికపాటిగా రసాయనాలు లేని విధంగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
నోట్.. ఇందులో పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.. వీటిని పాటించేముందు నిపుణుల సూచనలు తీసుకోవడం మంచిది.