Health: స్వీట్స్ తయారీకి ఉపయోగించే మైదా ఎలా తయారవుతుందో తెలుసా

సాధారణంగా వంటింట్లో ఉప్పు, కారం, పోపుదినుసులు వంటి సుగంధద్రవ్యాలు, పప్పులు, రవ్వ, పిండి, బియ్యం ఇలా చాలా రకాల పదార్థాలు ఉంటాయి. వీటిని మనం ఆహారంలో భాగంగా వినియోగిస్తూ...

Health: స్వీట్స్ తయారీకి ఉపయోగించే మైదా ఎలా తయారవుతుందో తెలుసా
Wheat
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jul 09, 2022 | 8:08 AM

సాధారణంగా వంటింట్లో ఉప్పు, కారం, పోపుదినుసులు వంటి సుగంధద్రవ్యాలు, పప్పులు, రవ్వ, పిండి, బియ్యం ఇలా చాలా రకాల పదార్థాలు ఉంటాయి. వీటిని మనం ఆహారంలో భాగంగా వినియోగిస్తూ ఉంటాం. అయితే మనం ఉపయోగించే ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి వస్తాయి. ఎలా తయారవుతాయి. వాటి వల్ల కలిగే ఉపయోగాలేమిటి అన్న విషయాలు మనకు కొంత వరకు తెలిసే ఉంటాయి. అయితే పిండి వంటలు చేసేందుకు అవసరమైన ముడిసరుకు ఎక్కడి నుంచి వస్తుందో మీరు ఎప్పుడైనా గమనించారా.. మాకేందుకు తెలియదు.. శనగపప్పు నుంచి శనగపిండి, బియ్యం నుంచి బియ్యప్పిండి, గోధుమల నుంచి గోధుమ పిండి వస్తాయి కదా అంటారా.. అయితే స్వీట్లు, బేకరీ పదార్థాల్లో అధికంగా ఉపయోగించే మైదాపిండి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా. తెలియకుంటే ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మైదాపిండి కూడా గోధుమ పిండి నుంచే వస్తుందన్న విషయం చాలా మందికి తెలియదు. గోధుమలను మిల్లులో బాగా పోలిష్ చేస్తారు. ఈ పోలిష్ చేసిన గోధుమలను పిండి చేసి.. అజో బై కార్బొనమైడ్, బెంజోయిల్ పెరాక్సయిడ్, క్లోరిన్ గ్యాస్ వంటి రసాయనాలతో శుభ్రపరుస్తారు. వీటివల్లనే మైదా పిండి తెల్లగా.. మెత్తగా ఉంటుంది.

అయితే యూరప్ దేశాల్లో బెంజోయిల్ పెరాక్సయిడ్, క్లోరిన్ గ్యాస్ ల వాడకాన్ని పూర్తిగా నిషేధించారు. శరీరాన్ని హానీ కలిగిస్తాయన్న కారణంతో ఆ దేశాల ప్రభుత్వాలు వీటిపై నిషేధం విధించాయి. బేకరీలో దొరికే ఫుడ్, బిస్కట్లు, చిప్స్, బ్రెడ్, కేక్ వంటి చాలా రకాల ఆహార పదార్థాల్లో మైదాను విరివిగా ఉపయోగిస్తున్నారు. మైదా తో చేసే వంటలు రుచికరంగా ఉంటాయి కాబట్టి చాలా మంది ఇష్టపడతారు. కానీ నాణేనికి మరో వైపు, ఈ మైదా ని ఆహారంలో భాగం చేసుకోవడం వలన అనేక రకాల సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నోట్.. ఇందులో పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.. వీటిని పాటించేముందు నిపుణుల సూచనలు తీసుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి