Corona Vaccination: 12 ఏళ్లలోపు చిన్నారులకు కొవాగ్జిన్, కొర్బెవ్యాక్స్ వినియోగానికి సిఫార్సు..
కరోనా మహమ్మారి ఇంకా ప్రపంచ దేశాలను వెంటాడుతూనే ఉంది. మన దేశంలో కూడా మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. చాపకింద నీరులా రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో వర్షాకాలం ఆరంభంతో
Corona Vaccination: బయోలాజికల్-ఇ అభివృద్ధి చేసిన కొర్బెవ్యాక్స్, భారత్ బయోటెక్ కొవాగ్జిన్ టీకాలను 5 నుంచి 12 ఏళ్లలోపు చిన్నారులకు వేసేందుకు ‘ఎన్‌టాగి’ స్టాండింగ్ టెక్నికల్ సబ్ కమిటీ సిఫార్సు చేసింది. కొర్బెవ్యాక్స్‌ను 5-12 ఏళ్లలోపు పిల్లలకు వేయనుండగా, కొవాగ్జిన్ టీకా 6-12 ఏళ్ల మధ్య చిన్నారులకు ఉద్దేశించినది. 6 నుంచి 12 ఏళ్లలోపు చిన్నారులకు ఉపయోగించేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ భారత్ బయోటెక్‌కు అనుమతి మంజూరు చేసింది. అదే నెలలో డీసీజీఐ నిపుణుల ప్యానెల్ 5 నుంచి 12 ఏళ్లలోపు చిన్నారులకు వేసేందుకు బయోలాజికల్-ఇ కొర్బెవ్యాక్స్‌కు అత్యవసర వినియోగ అనుమతిని మంజూరు చేయాలని సిఫార్సు చేసింది.
కరోనా మహమ్మారి ఇంకా ప్రపంచ దేశాలను వెంటాడుతూనే ఉంది. మన దేశంలో కూడా మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. చాపకింద నీరులా రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో వర్షాకాలం ఆరంభంతో అంటువ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున ప్రజలుల భయాందోళనకు గురవుతున్నారు. ఎవరికి వారు స్వీయ జాగ్రత్తలు తప్పని సరిగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని కోవిడ్ వ్యాక్సిన్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి