viral video: ఓరీ దేవుడో.. పళ్లతో 5 కార్లను లాగుతున్నాడు.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్.. వీడియో వైరల్

Jyothi Gadda

Jyothi Gadda |

Updated on: Jul 09, 2022 | 9:03 AM

అతను ఇంతకుముందు కూడా ఇలాంటి ఫీట్స్ చేశాడు. తన పేరును రికార్డులతో పదిలంగా ఉంచుకున్నాడు. అతను అనేక స్థానిక స్వచ్ఛంద సంస్థల కోసం డబ్బును సేకరించడానికి..

viral video: ఓరీ దేవుడో.. పళ్లతో 5 కార్లను లాగుతున్నాడు.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్.. వీడియో వైరల్
Troy Conley

Follow us on

Viral Video:  ఆస్ట్రేలియా న్యూ సౌత్ వేల్స్‌లో గల బ్యాంక్స్‌ టౌన్‌లో ఓ వ్యక్తి తన పళ్లతో ఐదు కార్లను లాగి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. న్యూ సౌత్ వేల్స్‌లో గల బ్యాంక్స్‌ టౌన్‌లో ట్రాయ్ కాన్లీ మాగ్నస్సన్ తన పళ్లతో కారు లాగాడు. గతేడాది నవంబర్ 17వ తేదీన సదరు వ్యక్తి ఈ రికార్డు ప్రదర్శన చేశాడు. ప్రపంచ రికార్డుకు ప్రయత్నించిన అప్పటి ఈ పాత వీడియో ఇటీవల గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయబడింది. “ట్రాయ్ కాన్లీ మాగ్నుసన్ తన పళ్ళతో 5 కార్లను లాగుతున్నాడు” అని క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది.

వైరల్ వీడియోలో ఐదు SUVలను ఒకదానికొకటి తాళ్లతో కట్టివేసి ఉన్నాయి. ట్రాయ్ తన పళ్లతో ముందు కారుకు కట్టిన తాడును పట్టుకోవడం మనం చూడవచ్చు. తర్వాత మెల్లగా వెనక్కి వెళ్లి కార్లు లాగుతున్నాడు. నవంబర్ 2021లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ డేని జరుపుకోవడానికి ట్రాయ్ ఈ రికార్డును ప్రయత్నించాడు. అతను తన దంతాల సహాయంతో 100 అడుగుల వరకు వాహనాలను నెట్టడం సహా అనేక విన్యాసాలు చేసినందుకు వివిధ ప్రసిద్ధ అవార్డులను అందుకున్నాడు. అతను ఇంతకుముందు కూడా ఇలాంటి ఫీట్స్ చేశాడు. తన పేరును రికార్డులతో పదిలంగా ఉంచుకున్నాడు. అతను అనేక స్థానిక స్వచ్ఛంద సంస్థల కోసం డబ్బును సేకరించడానికి తన రికార్డు ప్రయత్నాలను ఉపయోగిస్తాడు. తద్వారా సామాజిక కార్యకర్తగా కూడా గుర్తింపు పొందారు.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఖాతా ద్వారా ఒక రోజు క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియోకు 9,000 మందికి పైగా లైక్‌లు, లక్షన్నర వ్యూస్ వచ్చాయి. కేవలం తన పళ్లతో ఐదు వాహనాలను లాగగల వ్యక్తి శక్తిని కొనియాడుతూ చాలా మంది వీడియోపై కామెంట్‌ చేశారు. ఒకరు “బలమైన పని” అని వ్యాఖ్యానించగా, మరొకరు “ఇది ప్రభావవంతంగా ఉంది” అంటూ కామెంట్‌ చేశారు. మరి కొందరు నెటిజన్లు ఫన్నీ వీడియోకి ఫన్నీ కామెంట్స్ కూడా చేశారు. ఈ వ్యక్తి ప్రతిరోజూ రాళ్ళు తింటాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అంటూ ఒక ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు కామెంట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

నిజానికి పళ్ల ద్వారా వాహనాలను లాగే సమయంలో చాలా కేర్ తీసుకోవాలి. లేదంటే ప్రమాదం పొంచి ఉంటుంది. సరయిన జాగ్రత్తలు తీసుకుంటూ.. ముందడుగు వేయాలి. ట్రాయ్ తన పేరును పదిలంగా ఉంచుకునేందుకు సాహసమే చేశారు. ఇప్పుడే కాదు ఇదివరకు కూడా.. అలా చేశారు. రికార్డులను నెలకొల్పుతూ.. మిగతా వారికి సవాల్ విసురుతున్నాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu