AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fatty Liver: సైలెంట్‌ కిల్లర్‌ ఈ వ్యాధి.. లక్షణాలు అస్సలు కనిపించవు! ఈ జాగ్రత్తలు తీసుకుంటే సేఫ్‌

శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో లివర్ ఒకటి. అయితే జీవనశైలి కారణంగా మన చేతులతో మనమే దీనిని అనారోగ్యంపాలు చేస్తున్నాం. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ సమస్య నేటి యువత ప్రాణాలను సైలెంట్ గా హరిస్తుంది..

Fatty Liver: సైలెంట్‌ కిల్లర్‌ ఈ వ్యాధి.. లక్షణాలు అస్సలు కనిపించవు! ఈ జాగ్రత్తలు తీసుకుంటే సేఫ్‌
Fatty Liver
Srilakshmi C
|

Updated on: Nov 17, 2024 | 8:55 PM

Share

దేశంలో ఫ్యాటీ లివర్ వ్యాధి యువతలో నానాటికీ పెరుగుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొవ్వు కాలేయాన్ని హెపాటిక్ స్టీటోసిస్ అని కూడా అంటారు. ఇది కాలేయ కణాలలో అధిక కొవ్వు పేరుకుపోయినప్పుడు సంభవించే తీవ్రమైన ఆరోగ్య పరిస్థితి. మధుమేహం, ఊబకాయం ఉన్న రోగులలో దాదాపు 90 శాతం మందికి FLD (చెడు కొలెస్ట్రాల్‌) ఉంటుంది. ఇది అధిక బరువు ఉన్నవారిలో 75%, తీవ్రమైన ఊబకాయం ఉన్నవారిలో 90% మందిలో సంభవిస్తుంది. దేశంలో ఇప్పటికే 30-40 కోట్ల మంది ఫ్యాటీ లివర్ సమస్య ఉన్న రోగులు ఉన్నారు. వచ్చే రెండు, మూడేళ్లలో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఫ్యాటీ లివర్ సమస్య ఒక రకమైన సైలెంట్ కిల్లర్. చాలా మందికి ఈ వ్యాధి లక్షణాలు కనిపించవు. అందుకే వీలైనంత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా కాలేయం దెబ్బతిన్నప్పటికీ, అది కోలుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ప్రధాన సమస్య ఏమిటంటే ఈ సమస్యను ముందుగానే గుర్తించడం కష్టం. లక్షణాలు కనిపించడం ప్రారంభించే సమయానికి వ్యాధి పూర్తిగా తీవ్రమవుతుంది. శరీరంలో కాలేయం 50-60% పాడైపోయినా, దాని గురించి తెలిసే అవకాశం ఉండదు. కానీ కొందరికి ముఖం, మెడ ప్రాంతాల్లో కొన్ని సంకేతాలు కనిపిస్తాయి.

ఫ్యాటీ లివర్ లక్షణాలు

  • కడుపు కుడి వైపున భారమైన భావన
  • కడుపునొప్పి
  • అలసట
  • ఆకలి లేకపోవడం
  • కామెర్లు

ఫ్యాటీ లివర్‌లో ఏ దశ ప్రమాదకరం?

కాలేయ పనితీరుపై ఆధారపడి F0 నుంచి F4 వరకు స్కోర్ ఉంటుంది. ఈ పరీక్షల్లో ఎఫ్4 స్కోర్ చేస్తే మూడో దశకు చేరుకున్నారని అర్థం. మూడవ దశను కాలేయ ఫైబ్రోసిస్ అంటారు. ఫైబ్రోసిస్ చాలా ప్రమాదకరమైనది. నాల్గవ దశను సిర్రోసిస్ అంటారు. ఈ దశలో కాలేయం పూర్తిగా దెబ్బతింటుంది. ఈ దశకు చేరుకున్న వ్యక్తులు చనిపోయే ప్రమాదం 20 నుండి 30 శాతం వరకు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి?

ఫ్యాటీ లివర్ సమస్య తొలిదశలో ఉన్నట్లయితే, కొన్ని ఆరోగ్యకరమైన జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా దాన్ని సరిచేయవచ్చు. ముఖ్యంగా బరువు తగ్గడానికి చాలా మంచిది. ఆరోగ్యం కోసం మంచి ఆహారం తీసుకోవాలి. కొవ్వు, నూనె పదార్థాల వినియోగాన్ని తగ్గించాలి. కూరగాయలు, పండ్లు పూర్తిగా శుభ్రం చేసిన తర్వాతే తినాలి. చక్కెర, శీతల పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్‌ నివారించాలి. అలాగే ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

నోట్‌: ఇక్కడ ఉన్న విషయాలు కేవలం సమాచారం కోసం మాత్రమే ఇచ్చాం. మీకు ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్‌ చేయండి.