AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sore Throat: మీకెప్పుడైనా గొంతునొప్పిగా అనిపించిందా? జాగ్రత్త ప్రమాదకర వ్యాధికి ఇదొక సంకేతం

కడుపు నొప్పి మాదిరిగానే చాలా మంది గొంతు నొప్పిని కూడా సాధారణమైన సమస్యగా భావిస్తుంటారు. కానీ ఇది ప్రాణాంతక వ్యాధులకు సంకేతం అని చాలా మందికి తెలియదు..

Sore Throat: మీకెప్పుడైనా గొంతునొప్పిగా అనిపించిందా? జాగ్రత్త ప్రమాదకర వ్యాధికి ఇదొక సంకేతం
Sore Throat
Srilakshmi C
|

Updated on: Nov 17, 2024 | 8:42 PM

Share

గొంతు నొప్పి సాధారణంగా జలుబు లేదా ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్ల వల్ల వస్తుంది. గొంతు నొప్పిని సాధారణ వ్యాధిగా పరిగణిస్తుంటారు. అయితే దీని వెనుక తీవ్రమైన కారణాలు ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల, దీనిని నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం. లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. CDC ప్రకారం, గొంతు నొప్పి, మింగడంలో ఇబ్బంది, ముక్కు కారటం, జ్వరం, దగ్గు, కండ్లకలకకు వంటి లక్షణాలు అనేక ప్రమాదకరమైన వ్యాధులను కూడా సూచిస్తాయి.

బాక్టీరియల్ ఇన్ఫెక్షన్

గొంతు నొప్పి కొన్నిసార్లు దానంతట అదే పోదు. అటువంటి పరిస్థితిలో అది స్ట్రెప్టోకోకల్ సమస్యకు దారితీయవచ్చు. అంటే స్ట్రెప్ థ్రోట్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. దీన్ని నిర్లక్ష్యం చేస్తే రుమాటిక్ ఫీవర్, నెఫ్రైటిస్, చీముతో కూడిన కురుపులు వచ్చే ప్రమాదం ఉంది. అటువంటి పరిస్థితిలో డాక్టర్‌ను సంప్రదించి, పరీక్షలు చేయించుకుని, వెంటనే దాని చికిత్సను ప్రారంభించవల్సి ఉంటుంది.

క్యాన్సర్

గొంతునొప్పి సమస్య అధికకాలం కొనసాగితే, అది క్యాన్సర్ లక్షణం కూడా కావచ్చు. ఇది ఫారింక్స్ లేదా టాన్సిల్స్ నుంచి ప్రారంభమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి.

ఇవి కూడా చదవండి

తీవ్రమైన అలెర్జీలు

కొన్నిసార్లు అలెర్జీలు గొంతు నొప్పి, మంటను కలిగిస్తాయి. ఇది దుమ్ము, మట్టి లేదా ఆహార అలెర్జీల వల్ల కూడా సంభవించవచ్చు. ఈ పరిస్థితిలో పరిస్థితి మరింత దిగజారవచ్చు. అటువంటి పరిస్థితిలో డాక్టర్ సహాయం తప్పక తీసుకోవాలి.

యాసిడ్ రిఫ్లక్స్ లేదా గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధితో దీర్ఘకాలిక కడుపు సమస్యలు వస్తాయి. దీంతో కడుపులోని ఆమ్లం కారణంగా గొంతు నొప్పికి కారణమవుతుంది. ఆటో ఇమ్యూన్ వ్యాధులున్న వారిలో ఇది తరచుగా నొప్పిని కలిగిస్తుంది. గొంతు నొప్పిని వదిలించుకోవడానికి జీవనశైలిలో మార్పులు చేసుకోవడం అవసరం.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఇరాన్‌కు చైనా HQ-9B వైమానిక రక్షణ వ్యవస్థ ఎలా వచ్చింది?
ఇరాన్‌కు చైనా HQ-9B వైమానిక రక్షణ వ్యవస్థ ఎలా వచ్చింది?
స్త్రీలు కాళ్లకు వెండి పట్టీలు ధరించడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..
స్త్రీలు కాళ్లకు వెండి పట్టీలు ధరించడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..
దేశవ్యాప్తంగా 350 విమానాలు రద్దు..!
దేశవ్యాప్తంగా 350 విమానాలు రద్దు..!
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
హోలీ పండగ గందరగోళానికి తెర.. ఏ రోజు జరుపుకోవాలో తెలుసా..?
హోలీ పండగ గందరగోళానికి తెర.. ఏ రోజు జరుపుకోవాలో తెలుసా..?
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
'ఏదేమైనా నేను ఎప్పుడూ నీతోనే ఉంటా'త్రిష షాకింగ్ ట్వీట్!
'ఏదేమైనా నేను ఎప్పుడూ నీతోనే ఉంటా'త్రిష షాకింగ్ ట్వీట్!
నా సినిమాను రిలీజ్‌కు ముందే లీక్ చేశారు'.. హీరో శ్రీవిష్ణు ఆవేదన
నా సినిమాను రిలీజ్‌కు ముందే లీక్ చేశారు'.. హీరో శ్రీవిష్ణు ఆవేదన
కామ్న జెఠ్మలానికి ఇంత పెద్ద కూతురు ఉందా? ఫొటోస్ వైరల్
కామ్న జెఠ్మలానికి ఇంత పెద్ద కూతురు ఉందా? ఫొటోస్ వైరల్
శివునికి జలాభిషేకం ఎందుకు చేస్తారు..? ఏ రోజు చేస్తే ఎలాంటి ఫలితం
శివునికి జలాభిషేకం ఎందుకు చేస్తారు..? ఏ రోజు చేస్తే ఎలాంటి ఫలితం