AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drinking Water After Tea: టీ, కాఫీ తర్వాత నీళ్లు తాగుతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?

మోతాదుకు మించి టీ, కాఫీలు తాగితే పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయంటారు. ఇక చాలమందికి టీ, కాఫీ తాగిన వెంటనే నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ప్రమాదకరమంటున్నారు నిపుణులు.

Drinking Water After Tea: టీ, కాఫీ తర్వాత నీళ్లు తాగుతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
Drinking Water After Tea
Basha Shek
| Edited By: |

Updated on: Nov 18, 2022 | 7:00 AM

Share

మనలో చాలామందికి ఉదయం నిద్రలేవగానే టీ, కాఫీలు తాగడం అలవాటు. అవి తాగితేనే కానీ రోజు ప్రారంభం కాని పరిస్థితి. ఇక పని ఒత్తిడి, అలసట నుంచి ఉపశమనం పొందడానికి రోజులో చాలా సార్లు టీ, కాఫీలు పుచ్చుకుంటాం. ఇక తలనొప్పిగా ఉన్నా, మగతగా ఉన్నా చాలామంది టీ తాగి కాస్త రిలాక్స్ అవుతుంటారు. ఇక చలికాలంలో టీ, కాఫీలకు ఉన్న ప్రాధాన్యం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టీతో చాలా ప్రయోజనాలే ఉన్నప్పటికీ కొన్ని దుష్ర్పభావాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతారు. మోతాదుకు మించి టీ, కాఫీలు తాగితే పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయంటారు. ఇక చాలమందికి టీ, కాఫీ తాగిన వెంటనే నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ప్రమాదకరమంటున్నారు నిపుణులు. వేడి వేడి టీ తాగిన తర్వాత నీళ్లు తాగితే శరీరంలోని వివిధ భాగాలపై ప్రతికూల ప్రభావం పడుతుందంటున్నారు.

దంతాలకు ముప్పు..

టీ, కాపీలు తాగిన తర్వాత నీళ్లు తాగితే దంతాల మీదున్న ఎనామిల్ పొర దెబ్బతింటుంది. చల్లగా, వేడిగా, పులుపుగా, తీపి పదార్థాలు దంతాల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. దంతాల రంగు మారిపోవడం, పంటి నొప్పులు వంటి సమస్యలు కలుగుతాయి.

అల్సర్ సమస్యలు

టీ తర్వాత నీళ్లు తాగడం వల్ల అల్సర్ సమస్యలు మొదలవుతామి. ఎసిడిటీ సమస్య కూడా వేధిస్తుంది.

ముక్కు నుండి రక్తం

టీ తర్వాత నీరు తాగడం వల్ల కొందరికి ముక్కు నుండి రక్తం కారుతుంది. శరీరం చలిని, వేడిని తట్టుకోలేకపోవడమే దీనికి కారణం. వేసవిలో ఈ సమస్య తీవ్రంగా ఉంటుంది.

గొంతునొప్పి

వేడి వేడి టీ తర్వాత చల్లటి నీటిని తాగడం వల్ల గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తాయి. ఇది శరీరంలో జలుబు తీవ్రతను పెంచుతుంది. అందుకే వేడి టీ తర్వాత వెంటనే నీరు తాగకూడదు.

టీకి ముందు నీటిని తాగితే మంచిదా?

టీ తాగిన తర్వాత నీటిని తాగడానికి బదులుగా టీ తాగే ముందే నీటిని తాగడం మంచిదంటున్నారు నిపుణులు. టీ చాలా మందికి గ్యాస్ట్రిక్ సమస్యను పెంచుతుంది. టీ తాగే ముందు నీటిని తాగితే గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి. ముందు నీళ్లు తాగి తర్వాత టీని తాగితే అసిడిటీ, క్యాన్సర్, అల్సర్లను తగ్గించవచ్చని పలు నివేదికలు సూచిస్తున్నాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం  క్లిక్ చేయండి