Health Tips: టవల్ ను ఎన్ని రోజులకు ఒక సారి ఉతుకుతున్నారు.. ఈ విషయాలు తెలిస్తే రోజూ శుభ్రం చేస్తారు..
నిత్య జీవితంలో ఎక్కువగా ఉపయోగించే వస్తువుల్లో టవల్ చాలా ముఖ్యమైనది. చేతులు కడుక్కోవడం నుంచి స్నానం చేసేంత వరకు టవల్ ను ఉపయోగిస్తూనే ఉంటాం. అయితే టవల్ ను వీలైనంత కాలం మృదువుగా, శుభ్రంగా..
నిత్య జీవితంలో ఎక్కువగా ఉపయోగించే వస్తువుల్లో టవల్ చాలా ముఖ్యమైనది. చేతులు కడుక్కోవడం నుంచి స్నానం చేసేంత వరకు టవల్ ను ఉపయోగిస్తూనే ఉంటాం. అయితే టవల్ ను వీలైనంత కాలం మృదువుగా, శుభ్రంగా ఉంచడానికి కొన్ని చిట్కాలు పాటించాల్సిన అవసరం చాలా అవసరం. తువ్వాళ్లను కడగడం కష్టతరమైన పని కాదని అనిపించినప్పటికీ.. ఇందుకు సరైన ఓపిక, పద్ధతులు పాటించడం చాలా అవసరం. టవల్ ను ప్రతి వారం ఉతకడం చాలా అవసరం. తుడుచుకునే సమయంలో శరీరానికి అంటుకున్న దుమ్ము, ధూళి, మురికి టవల్ కు అంటుకుంటుంది. దీంతో టవల్ పై హానికర సూక్ష్మజీవులు పేరుకుపోయి ఆరోగ్యం దెబ్బతింటుంది . అయితే.. టవల్స్‌ను ఎంత తరచుగా కడగాలి అనే విషయంపై కొన్ని చిట్కాలు పాటించడం చాలా అవసరం. వాషింగ్ మెషిన్ లో బట్టలు ఉతికేటప్పుడు టవల్ ను ఉంచకూడదు. వాష్ లోడ్ పరిమితిని మించి ఉంటే.. తువ్వాలు సరిగ్గా శుభ్రం కావు. మహిళలు, పిల్లలు ‘స్వచ్ఛ భారత్’ కోసం విజిల్ బ్లోయర్‌లలా పనిచేశారని జల్ శక్తి మంత్రి గతంలో చెప్పిన విషయం తెలిసిందే.
తువ్వాళ్లను మృదువుగా, మెత్తగా ఉంచడంలో వెనిగర్ ఉపయోగపడుతుంది. మీ టవల్ మృదుత్వాన్ని కోల్పోకుండా ఉండేందుకు నీటిలో ఒక కప్పు వెనిగర్ వేసి, తువ్వాలును నానబెట్టాలి. ఎక్కువ డిటర్జెంట్ ఉపయోగించడం వల్ల టవళ్లు దెబ్బ తింటాయి. అంతే కాకుండా వాటిని తక్కువ మృదువుగా, మెత్తటివిగా ఉంచుతాయి. నాణ్యమైన డిటర్జెంట్‌ని వాడాలి. ఇలా చేయడం వల్ల టవల్ ఎక్కువ సేపు మృదువుగా ఉంచేందుకు సహాయపడుతుంది. వారానికి ఒకసారి టవల్ కడగడం మంచిది. తువ్వాలను వాటి రంగులను బట్టి వేరు చేయడం గుర్తుంచుకోండి. తెల్లటి తువ్వాళ్ల కోసం, అవసరాన్ని బట్టి వేడి నీటిని, క్లోరిన్ కాని బ్లీచ్‌ను ఉపయోగించడం మంచిది.
వాషింగ్ మెషీన్ నుంచి టవల్ ను బయటకు తీసే సమయంలో దానిని పిండడం మర్చిపోకూడదు. ఇలా చేయడం ద్వారా తువ్వాలులో ఉన్న అదనపు నీరు పోయి.. త్వరగా ఆరిపోయేలా చేస్తుంది. కాబట్టి నిత్య జీవితంలో భాగమైన టవల్ ను ఎప్పటికప్పడు శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యమనే విషయాన్ని గుర్తించుకోవడం మాత్రం మర్చిపోకూడదు.
ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి