Ginger Tea: అదే పనిగా అల్లం టీ తాగుతున్నారా.. ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువ.. బీ అలర్ట్..

వణికించే చలికాలంలో అందరూ టీ తాగడానికి ఇష్టపడతారు. చల్లని వాతావరణంలో రోజుకు రెండు నుంచి మూడు సార్లు తాగుతుంటారు. టీ ప్రియులకైతే ఈ సంఖ్య మరింత ఎక్కువే అని చెప్పాలి. స్ట్రాంగ్ టీ తాగడం...

Ginger Tea: అదే పనిగా అల్లం టీ తాగుతున్నారా.. ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువ.. బీ అలర్ట్..
Ginger Tea
Follow us

|

Updated on: Jan 21, 2023 | 9:57 PM

వణికించే చలికాలంలో అందరూ టీ తాగడానికి ఇష్టపడతారు. చల్లని వాతావరణంలో రోజుకు రెండు నుంచి మూడు సార్లు తాగుతుంటారు. టీ ప్రియులకైతే ఈ సంఖ్య మరింత ఎక్కువే అని చెప్పాలి. స్ట్రాంగ్ టీ తాగడం వల్ల రోజంతా అలసట, ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుందని చాలా మంది భావిస్తుంటారు. ముఖ్యంగా టీలో అల్లం యాడ్ చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, అది టీ రుచిని మరింత పెంచుతుందంటారు టీ లవర్స్. కానీ రోజుకు రెండు సార్లు కంటే ఎక్కువ సార్లు అల్లం టీ తాగడం వల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అల్లంతో చాలా ప్రయోజనాలున్నాయన్న మాట నిజమే.. కానీ అతిగా తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఒక వ్యక్తి రోజుకు 5 గ్రాముల అల్లం తీసుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు – 2.5 గ్రాములు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు 3 గ్రాములు, డైజేషన్ సమస్యలు ఉన్నవారు 1.2 గ్రాములు, బరువు తగ్గాలనుకునేవారు 1 గ్రాము అల్లం తీసుకోవడం మంచిది.

అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎసిడిటీ వస్తుంది. ఇది శరీరంలో అదనపు యాసిడ్ ఏర్పడటానికి కారణమవుతుంది. దీంతో అనేక ఇతర వ్యాధులు వస్తాయి. అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు కలుగుతుంది. రక్తాన్ని పలుచగా చేస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు అల్లం అధికంగా తీసుకోవడం మానుకోవాలి. అల్లం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా తగ్గుతాయి. కాబట్టి డయాబెటిక్ పేషెంట్లు అల్లం ఎక్కువగా తినకూడదు. ఇది హైపోగ్లైసీమియాకు దారితీస్తుంది. రాత్రిపూట అల్లం టీ తాగడం వల్ల నిద్రలేమి కలుగుతుంది. టీలో అల్లం ఎక్కువగా కలిపి తాగడం వల్ల ఛాతీలో మంట, గుండెల్లో మంట వస్తుంది. జీర్ణక్రియ మందగిస్తుంది.

గర్భిణీ స్త్రీలకు మంచిది కాదు. రోజూ అరకప్పు కంటే ఎక్కువ అల్లం టీ తాగే గర్భిణీ స్త్రీలకు ఇది హానికరం. గర్భిణీ స్త్రీలలో కడుపు నొప్పి కలగవచ్చు. ఖాళీ కడుపుతో అల్లం టీ తాగడం వల్ల పేగు సమస్యలు వస్తాయి. కాబట్టి అల్లం ఎక్కువగా తీసుకోకూడదు. అల్లం టీని మితంగా తాగడం మంచిది.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..