AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smile Health: స్మైలింగ్ డిప్రెషన్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా.. అయితే ఈ స్టోరీ చదివేయండి..

నవ్వడం ఓ భోగం.. నవ్వకపోవడం ఓ రోగం అనేది సామెత. అవును మరి.. నవ్వు నలభై విధాలా మేలు అన్నట్లు.. నవ్వడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శారీరకంగా, మానసికంగా నవ్వు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను...

Smile Health: స్మైలింగ్ డిప్రెషన్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా.. అయితే ఈ స్టోరీ చదివేయండి..
Smile Facts
Ganesh Mudavath
|

Updated on: Jan 16, 2023 | 6:39 AM

Share

నవ్వడం ఓ భోగం.. నవ్వకపోవడం ఓ రోగం అనేది సామెత. అవును మరి.. నవ్వు నలభై విధాలా మేలు అన్నట్లు.. నవ్వడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శారీరకంగా, మానసికంగా నవ్వు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. డిప్రెషన్ ఇప్పుడు సాధారణ సమస్యగా మారింది. బిజీ లైఫ్ వల్ల మన గురించి మనం అస్సలు ఆలోచించుకోలేకపోతున్నాం. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ముఖాల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతున్నాయి. ఈ క్రమంలో స్మైలింగ్ డిప్రెషన్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. నవ్వడం డిప్రెషన్‌కు ఎలా దారితీస్తుందో వింటే చాలామంది ఆశ్చర్యపోతారు. దీని కారణంగా దానితో బాధపడుతున్న వ్యక్తి బయటి నుంచి సంతోషంగా లేదా సంతృప్తిగా కనిపిస్తాడు. కానీ లోలోపల చాలా బాధపడుతుంటాడు. విశ్వాసం కోల్పోవడం, ఆకలి, బరువు, నిద్రలో మార్పులు, అభిరుచిపై ఆసక్తి కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయి.

స్మైలింగ్ డిప్రెషన్‌తో బాధపడుతున్న వ్యక్తి వీటిలో కొన్ని లేదా అన్నింటినీ అనుభవించవచ్చు. అయితే ఈ లక్షణాలు చాలా వరకు బయటకు కనిపించవు. WHO ప్రకారం.. స్మైలింగ్ డిప్రెషన్ క్లాసిక్ డిప్రెషన్‌కు విరుద్ధంగా లేదా భిన్నమైన లక్షణాలను చూపుతుంది. దీని కారణంగా గుర్తించడం లేదా నిర్ధారించడం కష్టం. రోగ నిర్ధారణ పరిష్కరించడం కూడా కష్టం. ఎందుకంటే చాలా మందికి తాము డిప్రెషన్‌లో ఉన్నామనే విషయం కూడా తెలియదు.

మీ చుట్టూ ఉన్నవారు డిప్రెషన్‌లో ఉన్నారని మీకు అనిపిస్తే, వీలైనంత త్వరగా అతనికి సహాయం చేయడానికి ప్రయత్నించండి. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ పరిస్థితిలో వైద్యుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం