Hair Loss: చిన్న వయస్సులోనే బట్టతల వేధిస్తోందా.? అయితే ఇలా చేయండి..

పోషకాహార లోపం, హార్మోన్ల మార్పులు, ఒత్తిడి, కాలుష్యం, ధూమపానం, జన్యుపరమైన కారణాల వల్ల బట్టతల వస్తుంది.

Hair Loss: చిన్న వయస్సులోనే బట్టతల వేధిస్తోందా.? అయితే ఇలా చేయండి..
Baldness
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 29, 2022 | 10:18 AM

పోషకాహార లోపం, హార్మోన్ల మార్పులు, ఒత్తిడి, కాలుష్యం, ధూమపానం, జన్యుపరమైన కారణాల వల్ల బట్టతల వస్తుంది. ఇటీవలకాలంలో పురుషులకు చిన్న వయస్సులోనే ఈ సమస్య తలెత్తుతోంది. దాన్ని నివారించేందుకు చాలామంది వివిధ డైట్స్ ఫాలో అవుతుంటారు. జీవనశైలిలో మార్పులు, ఆరోగ్యానికి హాని తలపెట్టే ఆహారపదార్థాలు తీసుకోవడం ద్వారా ఎవరైనా కూడా బట్టతల బారిన పడవచ్చునని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే మొదట్లోనే లక్షణాలు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు రాలడాన్ని, బట్టతల రాకుండా నివారించవచ్చు.

ఇదిలా ఉంటే.. పలు చికిత్సల ద్వారా జుట్టు రాలాడాన్ని తగ్గించడమే కాదు.. మళ్లీ జుట్టు పెరిగేలా చేయొచ్చునని ఓహియో యూనివర్సిటీ డెర్మటాలజీ ప్రొఫెసర్ డాక్టర్ సుసాన్ మాసిక్ తెలిపారు. సమతుల్య ఆహారం, సమయోచిత మినాక్సిడిల్(ఒక రకమైన రసాయన మిశ్రమం) జుట్టు రాలడాన్ని నివారించడంలో సహాయపడతాయన్నారు. ప్రొటీన్లు, ఐరన్ సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చునని మాసిక్ తెలిపారు. జుట్టు రాలడం అనేది ఒత్తిడి, ‘అలోపేసియా అరేటా’ అనే ఆటోఇమ్యూన్ డిసీజ్ వల్ల సంభవించవచ్చు. 21 సంవత్సరాల వయస్సులోపు, 25 శాతం మంది పురుషులలో జుట్టు రాలిపోయే సంకేతాలు కనిపిస్తాయి. ఆ తర్వాత 70 శాతం మందికి జుట్టు రాలడం ప్రారంభమవుతుంది.

పురుషులలో బట్టతల రావడానికి కారణాలు:

డైహైడ్రోటెస్టోస్టెరాన్ (DHT) అనే హార్మోన్ వల్ల పురుషులలో బట్టతల వస్తుంది. ఇది హెయిర్ ఫోలికల్స్‌ను తగ్గిస్తుంది. తద్వారా జుట్టు సన్నబడటమే కాదు.. చాలా సులభంగా రాలిపోతుంది.

ఈ ఆహారాలతో బట్టతల నివారణ:

ప్రోటీన్లు, ఐరన్ అధికంగా ఉండే గుడ్లు, బచ్చలికూర, గొడ్డు మాంసం, చిక్‌పీస్, గుమ్మడి గింజలు, బ్లాక్ బీన్స్ వంటి సమతుల్యమైన ఆహారాలు మీ జుట్టు ఆరోగ్యకరంగా, దృఢంగా ఉండటంలో సహాయపడతాయి. హెయిర్ ఫోలికల్స్ ప్రోటీన్, ఐరన్‌తో తయారవుతాయి. ఇవి శరీరంలో జుట్టు పెరుగుదలకు దోహదపడే కణాలకు ఆక్సిజన్‌ను అందించడంలో సహాయపడతాయి.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)