Health News: ఈ ఆహారాలు తింటే గుండె సురక్షితం.. కొవ్వు అస్సలు పెరగదు..!

Health News: గుండె దృఢంగా ఉండాలంటే మన శరీరంలో కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉండకూడదు. ఒకవేళ ఎక్కువగా ఉంటే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుందని అందరికీ తెలుసు.

Health News: ఈ ఆహారాలు తింటే గుండె సురక్షితం.. కొవ్వు అస్సలు పెరగదు..!
Eating Foods
Follow us

|

Updated on: Mar 27, 2022 | 5:57 AM

Health News: గుండె దృఢంగా ఉండాలంటే మన శరీరంలో కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉండకూడదు. ఒకవేళ ఎక్కువగా ఉంటే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుందని అందరికీ తెలుసు. గుండెపోటు తీవ్రమైన వ్యాధిగా మారడానికి ఇదే కారణం. WHO ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలకు గుండెపోటే ప్రధాన కారణం. ఇది మానవ రక్త నాళాలలో కొలెస్ట్రాల్ వల్ల ఏర్పడే ఒక అడ్డంకి వల్ల వస్తుంది. ఈ పరిస్థితిలో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మన శరీరానికి మంచి కొలెస్ట్రాల్ అవసరం. అయితే కొన్ని పండ్లు, కూరగాయలతో చెడు కొలెస్ట్రాల్‌ను కంట్రోల్‌ చేయవచ్చు. కాబట్టి అటువంటి ఆహారాలు, కూరగాయలు గురించి తెలుసుకుందాం. గుండె రోగులు ప్రతి రోజు ఒక యాపిల్‌ తినాలని తరచూ డాక్టర్లు సూచిస్తారు. నిజానికి యాపిల్స్ తినడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. కాబట్టి ప్రతి రోజూ ఒక యాపిల్ తినాలి. అవోకాడోను కూడా ఆహారంలో చేర్చుకోవాలి. ఎందుకంటే ఈ సూపర్ ఫుడ్ మీ ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. వ్యాధులను దూరం చేస్తుంది. అవకాడోలో ఫ్యాటీ యాసిడ్‌లతో పాటు విటమిన్‌ ఎ, బి, ఇ, ఫైబర్‌, మినరల్స్‌, ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. అవకాడోలో చక్కెర పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. ఇది చాలా మంచి శక్తి వనరు. అవోకాడో తినడం కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, గుండె ఆరోగ్యానికి చాలా మంచిదిగా చెప్పవచ్చు.

పప్పుధాన్యాలు ప్రోటీన్‌కి ఉత్తమ మూలం. గుండె సంబంధిత సమస్యలున్నప్పుడు చాలా మంది పప్పులు తినాలని చెబుతారు. ఎందుకంటే వీటిని తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరగదు. ఇది కాకుండా ఆహారంలో ఎక్కువగా ఆకుపచ్చ కూరగాయలను చేర్చడానికి ప్రయత్నించాలి. దీని నుంచి మీరు కొలస్ట్రాల్‌ పొందుతారు. అంతేకాదు పచ్చి కూరగాయలు తినడం వల్ల ఎలాంటి వ్యాధులు దరిచేరవు. గుండె రోగులు ఎండాకాలంలో ప్రతిరోజు మజ్జిగ తీసుకోవాలి. దీనివల్ల డీ హైడ్రేషన్‌కి గురికాకుండా ఉంటారు. దాహం లేకున్నా తరచుగా నీళ్లు తాగుతూ ఉండాలి. పుచ్చకాయ, దోసకాయ వంటి నీరు శాతం ఎక్కువగా ఉన్న పండ్లని డైట్‌లో చేర్చుకుంటే మంచిది.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

Tirupati: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన పెళ్లి బస్సు.. పలువురు మృతి

Vitamin C: విటమిన్ సి తో చర్మం కాంతివంతం.. సమ్మర్‌లో ఇలా చేయండి..!

సరికొత్త ప్రేమ కథా చిత్రమ్‌.. 67 ఏళ్ల మహిళ.. 28 ఏళ్ల అబ్బాయి..!