Health Care: రొయ్యలతో కలిపి ఈ ఆహారాలను అస్సలు తినకండి.. తింటే ఆ సమస్యలు తప్పవు!
రొయ్యలతో తయారు చేసిన ఆహార పదార్థాలు తీసుకున్న తర్వాత.. ఖచ్చితంగా పాల పదార్థాలకు దూరంగా ఉండాలి. లేకుంటే అలెర్జీ ససమ్యలకు తలెత్తుతాయని నిపుణులు అంటున్నారు. ఇలా తినడం వల్ల పొట్టలో ఎసిడిటీ పెరగడానికి కారణం అవుతుంది. జీర్ణ క్రియకు కూడా ఆటంకం కలిగిస్తుంది. దీని వల్ల కడుపులో నొప్పి, మల బద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. రొయ్యల్లో ఐరన్ శాతం ఖచ్చితంగా ఎంతో కొంత ఉంటుంది. రొయ్యలతో తయారు చేసిన ఆహారం..

నాన్ వెజ్ ప్రియులకు ఇష్టంగా తినే వాటిల్లో రొయ్యలు కూడా ఒకటి. పచ్చి రొయ్యలతో అనేక రకాలైన వంటలు తయారు చేసుకోవచ్చు. స్టాటర్స్, స్నాక్స్, బిర్యానీలు, రకరకాలైన కర్రీలు ఇలా ఏది చేసినా.. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. అయితే రొయ్యలతో కొన్ని రకాల ఫుడ్స్ తింటే.. అలెర్జీ సమస్యలు తప్పవు. కాబట్టి రొయ్యలు తినేవారు ఆ ఆహార పదార్థాలకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. మరి ఆ ఫుడ్ కాంబినేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
పాల పదార్థాలు:
రొయ్యలతో తయారు చేసిన ఆహార పదార్థాలు తీసుకున్న తర్వాత.. ఖచ్చితంగా పాల పదార్థాలకు దూరంగా ఉండాలి. లేకుంటే అలెర్జీ ససమ్యలకు తలెత్తుతాయని నిపుణులు అంటున్నారు. ఇలా తినడం వల్ల పొట్టలో ఎసిడిటీ పెరగడానికి కారణం అవుతుంది. జీర్ణ క్రియకు కూడా ఆటంకం కలిగిస్తుంది. దీని వల్ల కడుపులో నొప్పి, మల బద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి.
ఐరన్ ఆహారాలు:
రొయ్యల్లో ఐరన్ శాతం ఖచ్చితంగా ఎంతో కొంత ఉంటుంది. రొయ్యలతో తయారు చేసిన ఆహారం తీసుకున్న తర్వాత ఐరన్ అధికంగా ఉండే పాల కూర, రెడ్ మీట్ తీసుకుంటే ఐరన్ శోషణ పెరుగుతుంది. ఐరన్ తక్కువగా ఉన్నవాళ్లకు ఇది బెస్ట్ అయినా.. ఐరన్ సమపాలల్లో ఉన్నవారికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
సిట్రస్ ఫ్రూట్స్:
చాలా మంది స్పైసీ ఫుడ్ పై నిమ్మకాయ పిండుకుని తింటూ ఉంటారు. నిజానికి ఇలా తినడం చాలా తప్పు. ఇది రొయ్యలకు కూడా వర్తిస్తుంది. రొయ్యలపై ఇలా పుల్లని పదార్థాన్ని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. రొయ్యల్లో ఉండే ప్రోటీన్.. నిమ్మకాయలో ఉండే ఆమ్లత్వం కలిసి.. కడుపులో నొప్పి రావడానికి అవకాశం ఉంటుంది. కాబ్టటి ఈ సారి ఇలా ట్రై చేయకపోవడమే బెటర్.
పిండి పదార్థాలు:
రొయ్యలు తిన్నప్పుడు పాస్తా, బ్రెడ్ వంటి పిండి పదార్థాలు కూడా దూరంగా ఉండటమే బెటర్. అలాగే బంగాళ దుంపలు వంటివి కూడా తినకూడదు. ఎందుకంటే ఆలుగడ్డలో కూడా స్టార్చ్ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరంలోకి చేరి అధిక బరువు పెరగడానికి కారణం అవుతుంది. అంతే కాకుండా పొట్ట ఉబ్బినట్టు అనిపిస్తుంది. జీర్ణ క్రియకు కూడా ఆటంకం ఏర్పడి.. మలబద్ధకం సమస్య తలెత్తవచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.








