Hair Care Tips: జుట్టు పొడుగ్గా అవ్వాలంటే.. ఈ ఆహార పదార్థాలు మీ డైట్ లో ఉండేట్టు చూసుకోండి!
జుట్టు అందంగా, మెరుస్తూ, పొడుగ్గా ఉండాలని అనుకోని స్త్రీ ఉండదు. పూర్వం చాలా మంది మహిళలకు పొడవాటి జుట్టు ఉండేది. అందుకు తగ్గేట్టే జీవన శైలి, ఆహార నియమాలు ఉండేవి. కానీ ఇప్పుడున్న పరిస్థితి వేరు. లైఫ్ స్టైల్ కూడా మారిపోయింది. దీంతో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా జుట్టు గురించి ఆందోళన చెందుతున్నారు. జుట్టు రాలడం, పల్చగా ఉండటం, చుండ్రు, నెరిసిపోవడం వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. తీసుకునే ఆహార విషయంలో సరైన..

జుట్టు అందంగా, మెరుస్తూ, పొడుగ్గా ఉండాలని అనుకోని స్త్రీ ఉండదు. పూర్వం చాలా మంది మహిళలకు పొడవాటి జుట్టు ఉండేది. అందుకు తగ్గేట్టే జీవన శైలి, ఆహార నియమాలు ఉండేవి. కానీ ఇప్పుడున్న పరిస్థితి వేరు. లైఫ్ స్టైల్ కూడా మారిపోయింది. దీంతో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా జుట్టు గురించి ఆందోళన చెందుతున్నారు. జుట్టు రాలడం, పల్చగా ఉండటం, చుండ్రు, నెరిసిపోవడం వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. తీసుకునే ఆహార విషయంలో సరైన మెళకువలు పాటిస్తే.. జుట్టు మాత్రమే కాదు.. ఆరోగ్యం కూడా మన సొంతం అవుతుంది. మరి ఎలాంటి ఆహారాలు తీసుకుంటే మంచిదో ఇప్పుడు చూద్దాం.
గుడ్డు:
మనం ప్రతి రోజూ తీసుకునే వాటిల్లో గుడ్డు కూడా ఒకటి. మీ డైట్ లో క్రమం తప్పకుండా గుడ్డు తీసుకుంటే జుట్టుకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఉడకబెట్టిన గుడ్డు అయినా ఆమ్లెట్ అయినా గుడ్లు తీసుకుంటే.. జుట్టుకు పోషణ అందిస్తుంది.
చిలగడ దుంపలు:
చిలగడ దుంపలు కూడా జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు, బీటలా కెరోటిన్ తో నిండి ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల స్కాల్ఫ్ ఆరోగ్యంగా ఉంటుంది. అంతే కాకుండా ఈ దుంపలు సహజ కండీషనర్ గా పని చేస్తాయి.
డ్రై ఫ్రూట్స్:
డ్రై ఫ్రూట్స్ ని కూడా అప్పుడప్పుడు స్నాక్ రూపంలో తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ లో ఓమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్, విటమిన్లు వంటివి మెండుగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల జుట్టుకు సంబంధించిన సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
బెర్రీస్:
బెర్రీస్ తో కేవలం శరీరక ఆరోగ్యమే కాకుండా.. జుట్టుకు సంబంధించిన సమస్యలను కూడా తగ్గించు కోవచ్చు. బెర్రీస్ జాతికి సంబంధించిన వాటిల్లో పలు రకాల విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి జుట్టు కుదళ్లను బలపరుస్తాయి. అంతే కాకుండా జుట్టు పెరిగేందుకు హెల్ప్ చేస్తాయి.
అవకాడో:
తరచూ అవకాడో తీసుకోవడం వల్ల జుట్టుకు సంబంధించిన ఎన్నో సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. స్కాల్ఫ్ ను, జుట్టుకు పోషణ అందించి.. హైడ్రేట్ గా ఉండేలా చేస్తాయి. అవకాడో తీసుకోవడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.








