Pregnancy Myths: గర్భిణుల్లో భయాలు.. వాటిలో నిజాలేవి? అపోహలేవి? నిపుణుల సలహాలు

Madhu

Madhu | Edited By: Anil kumar poka

Updated on: Jan 22, 2023 | 1:13 PM

అదే సమయంలో, చాలా మంది మహిళలు తమ ఆరోగ్యానికి, వారి పిల్లల ఆరోగ్యానికి హాని కలిగించే కొన్ని తప్పులు చేస్తారు. అందువల్ల గర్భధారణను ప్లాన్ చేయడానికి ముందు, దానికి సంబంధించిన కొన్ని అపోహలు, వాస్తవాలు.. కొన్ని సందేహాలు, ప్రశ్నల గురించి సరైన సమాచారాన్ని పొందడం చాలా ముఖ్యం.

Pregnancy Myths: గర్భిణుల్లో భయాలు.. వాటిలో నిజాలేవి? అపోహలేవి? నిపుణుల సలహాలు
Pregnancy

గర్భధారణ.. స్త్రీ జీవితంలో అత్యంత ప్రాధాన్య అంశం. అందుకనే ఈ విషయంలో చాలా మంది అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఇదే క్రమంలో కొన్ని సమాధానం లేని ప్రశ్నలు, అపోహలు కూడా ఉంటాయి. ఆ ప్రశ్నలకు సమాధాన ఇవ్వడంతో పాటు అపోహలను తొలగించడం.. వాటిని నమ్మదగిన వాస్తవాలతో భర్తీ చేయడం చాలా ముఖ్యం. లేకపోతే, గర్భధారణ సమయంలో మహిళలు తమ జీవితాన్ని చాలా వరకు రిస్ట్రిక్ట్ చేసుకుంటారు. అదే సమయంలో, చాలా మంది మహిళలు తమ ఆరోగ్యానికి, వారి పిల్లల ఆరోగ్యానికి హాని కలిగించే కొన్ని తప్పులు చేస్తారు. అందువల్ల, గర్భధారణను ప్లాన్ చేయడానికి ముందు, గర్భధారణకు సంబంధించిన కొన్ని అపోహలు, వాస్తవాలు.. కొన్ని సందేహాలు, ప్రశ్నల గురించి సరైన సమాచారాన్ని పొందడం చాలా ముఖ్యం. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని, గర్భధారణ అపోహలకు సంబంధించి మహిళలు ఎక్కువగా అడిగే ప్రశ్నలపై ప్రముఖ గైనకాలజిస్ట్ లు చెబుతున్న సూచనలివే..

నెయ్యి తినడం వల్ల సాధారణ ప్రసవం జరుగుతుందా?

ఇది దాదాపు ప్రతి గర్భిణీ అడిగే ప్రశ్న. అయితే వాస్తవం ఏమిటంటే నెయ్యికి సాధారణ ప్రసవానికి ఒకదానికొకటి సంబంధం లేదు. సాధారణ ప్రసవం పూర్తిగా శిశువు పరిమాణం, మీ కటి పరిమాణం, గర్భధారణ సమయంలో మీ శారీరక శ్రమపై ఆధారపడి ఉంటుంది. అయితే మీరు గర్భంతో ఉన్నప్పుడు నెయ్యిని అధికంగా తీసుకుంటే, అది మీ బరువుతో పాటు మీ బిడ్డ బరువును కూడా పెంచుతుంది, దీని కారణంగా డెలివరీ సమయంలో సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందుకే గర్భధారణ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారంపై దృష్టి పెట్టడం, నెయ్యిని మితంగా తీసుకోవడం ఉత్తమం.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

విటమిన్ ఇ, కోకో బటర్ వాడకం స్ట్రెచ్ మార్క్స్ ని నివారిస్తుందా?

గర్భంతో ఉన్న సమయలో స్ట్రెచ్ మార్క్స్ నివారించడానికి మహిళలు తరచుగా వివిధ మార్గాలను వెతుకుతూ ఉంటారు . ప్రజలు సాధారణంగా విటమిన్ ఇ, కోకో బటర్‌ని అప్లై చేయమని సిఫార్సు చేస్తారు. అయితే, గర్భధారణ సమయంలో పొట్టపై ఏదైనా క్రీమ్ లేదా హోం రెమెడీని అప్లై చేయడం ద్వారా స్ట్రెచ్ మార్క్స్ తొలగిపోవు. కొందరికి స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువగా ఉంటే మరికొందరికి తక్కువగా ఉంటాయి. ఇది పూర్తిగా మీ చర్మం రకం, శిశువు పరిమాణంపై ఆధారపడి ఉంటుంది.

వ్యాయామం చేయడం సురక్షితమేనా?

గర్భధారణ సమయంలో వ్యాయామం చేయడం పూర్తిగా సురక్షితం. ఇది సాఫీగా డెలివరీ చేయడానికి మీకు సహాయపడుతుంది. అయితే, వ్యాయామం, తీవ్రత ఏ వ్యాయామం ఎప్పుడు చేయాలనే దాని గురించి మీ ఫిట్‌నెస్ నిపుణుడు లేదా వైద్యుడిని సంప్రదించడం అవసరం.

సీఫుడ్ తినొచ్చా?

ఆహారంలో సీఫుడ్ తీసుకోవడం గురించి చాలా మంది గర్భిణులు గందరగోళానికి గురవుతుంటారు. వాస్తవం ఏమిటంటే గర్భంతో ఉన్నప్పుడు సీఫుడ్ తీసుకోవడం పూర్తిగా సురక్షితం. చేపలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇది పిల్లల మెదడు అభివృద్ధికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే మీరు తినే చేపలలో అధిక మొత్తంలో పాదరసం ఉండకూడదని గుర్తుంచుకోవాలి. దీంతో పాటు, మీరు ఏ రకమైన సీఫుడ్ తీసుకున్నా, తినడానికి ముందు దానిని బాగా ఉడికించాలి.

ఎక్కువ ఆహారం తీసుకోవాలా?

గర్భం ధరించిన మహిళ, అలాగే శిశువు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆహారం తినాలి. 450 నుండి 500 కేలరీల కంటే ఎక్కువ తినవలసిన అవసరం లేదు.

కారం ఎక్కువగా తీసుకుంటే సుఖ ప్రసవం అవుతుందా?

ఇదే నిజమైతే అందరికీ సాధారణ ప్రసవాలే జరుగుతాయి. స్పైసీ ఫుడ్ కి డెలివరీకి సంబంధం లేదు. పైగా స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఎసిడిటీ, గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలతో ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. వాటికి దూరంగా ఉండటమే మేలు.

సెక్స్ చేయడం సురక్షితమేనా?

మీకు సాధారణ గర్భం ఉంటే, మీరు మొదటి కొన్ని నెలలపాటు సెక్స్ చేయవచ్చు. అయితే చివరి త్రైమాసికంలో సెక్స్‌కు దూరంగా ఉండటం మంచిది. ప్రెగ్నెన్సీలో ఏదైనా కాంప్లికేషన్ ఉంటే డాక్టర్ ని సంప్రదించాలి. అలాగే గర్భం సమయలో సెక్స్ చేయాలని ఎంచుకుంటే, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. కఠినమైన సెక్స్ భంగిమలు నివారించాలి. ఎక్కువ ఫోర్స్ అప్లై చేయకుండా ఉండాలి. గర్భంపై భారం పడకుండా చూసుకోవాలి.

ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల బిడ్డ బ్రీచ్ పొజిషన్‌గా మారుతుందా?

సాధారణంగా శిశువు తల క్రిందికి అంటే యోని వైపు ఉంటుంది, కానీ కొన్ని గర్భధారణ సందర్భాలలో, శిశువు తల పైకి, అంటే తల్లి ఛాతీ వైపు ఉంటుంది. దాన్నే బ్రీచ్ పొజిషన్ అంటారు. అయితే, ఇది కేవలం కూర్చోవడం వల్ల జరగదు. ఇది అనేక ఇతర అంశాలపై కూడా ఆధారపడి ఉంటుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu