AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tomato: టమాటాలతో జాగ్రత్త! అతిగా తింటే ఈ ఆరోగ్య సమస్యలు తప్పవు..

టమాటా.. కూరలన్నింటికీ రాజు. దాదాపు ప్రతి భారతీయ వంటకంలో దీనిని ఉపయోగిస్తారు. ఇది ఆహారానికి రుచిని, రంగును ఇస్తుంది. అయితే, టమాటాలో మంచి గుణాలే కాకుండా, కొన్ని హానికరమైన గుణాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? ఒక పాత సామెత చెప్పినట్లు, అతిగా తింటే అమృతం కూడా విషం అవుతుంది. అలాగే రుచిగా ఉన్నాయని టమాటాలను కూరలు పచ్చళ్ల రూపంలో ఎక్కువగా తీసుకుంటే ఈ అనర్థాలు తప్పవట.

Tomato: టమాటాలతో జాగ్రత్త! అతిగా తింటే ఈ ఆరోగ్య సమస్యలు తప్పవు..
దీంతో క్రమంగా దేశ వ్యాప్తంగా టమాట ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రాబోయే నెల రోజుల్లో టమాట ధర రూ. 100కు చేరే అవకాశం ఉన్నట్లు మార్కెట్‌ నిపుణులు అంటున్నారు.
Bhavani
|

Updated on: Sep 16, 2025 | 7:42 PM

Share

టమాటాలు మన వంటగదిలో రోజువారీ ఉపయోగించే ఒక ముఖ్యమైన వస్తువు. కొన్ని వంటకాలకు రుచిని పెంచుతాయి. టమాటాలో అనేక పోషకాలు, విటమిన్లు, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. టమాటాలో ఉండే విటమిన్ సి, లైకోపీన్, ఫైబర్ రక్తహీనత, ఆస్తమా, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే, ఏ పదార్థం అయినా అతిగా తింటే శరీరానికి హాని చేస్తుంది.

టమాటాలు ఎక్కువగా తింటే కలిగే 4 ప్రధాన సమస్యలు ఇవి:

అసిడిటీ: టమాటాలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీనిని అధికంగా తీసుకుంటే అసిడిటీ సమస్యలు వస్తాయి.

గ్యాస్ సమస్య: మీకు కడుపులో గ్యాస్ సమస్య ఉంటే, టమాటాలను ఎక్కువగా తినకూడదు. ఈ సమస్య తగ్గించుకోవాలంటే తక్కువ పరిమాణంలో టమాటాలు తినాలి.

కిడ్నీలో రాళ్ళు: కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు టమాటాలను తినకూడదు. టమాటా గింజలు పిత్తాశయంలో రాళ్లకు కారణం అవుతాయి. అందుకే టమాటాలు తినేటప్పుడు గింజలు తీసేసి తినడం మంచిది.

గుండెలో మంట: టమాటాలు ఎక్కువగా తినడం వల్ల గ్యాస్ సమస్యలు పెరిగి గుండెలో మంట వస్తుంది.

అంతేకాకుండా, టమాటాలు అధికంగా తీసుకుంటే గొంతు, నోరు మండడం, తలతిరగడం లాంటి సమస్యలు కూడా రావచ్చు. టమాటాలో ఫ్రక్టోజ్ అధికంగా ఉంటుంది. అది కొందరిలో హిస్టామిన్ ప్రతిచర్యలకు కారణం అవుతుంది. టమాటాలో సోలనిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. అది కీళ్లనొప్పులు, వాపులకు దారితీస్తుంది.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న ఆరోగ్య సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. టమాటాలు తినడం వల్ల మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని భావిస్తే, వైద్య నిపుణుడిని సంప్రదించడం మంచిది. సొంతంగా వైద్యం చేసుకోవడం తగదు.