Health: పేరెంట్స్ బీ అలర్ట్.. కాలం మారుతోంది జాగ్రత్త.. చిన్నారుల్లో ఈ సమస్యలు వస్తాయి.
సీజన్ మారిన ప్రతీసారి వ్యాధులు రావడం సర్వసాధారణం. మరీ ముఖ్యంగా చిన్నారుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. ప్రస్తుతం చలి కాలం ముగిసే దశకు చేరుకున్నాం. మరో పది రోజుల్లో వేసవిలోకి ప్రవేశించనున్నాము. ఇలా ఒక సీజన్ నుంచి మరో సీజన్‌లోకి మారే సమయంలో...

సీజన్ మారిన ప్రతీసారి వ్యాధులు రావడం సర్వసాధారణం. మరీ ముఖ్యంగా చిన్నారుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. ప్రస్తుతం చలి కాలం ముగిసే దశకు చేరుకున్నాం. మరో పది రోజుల్లో వేసవిలోకి ప్రవేశించనున్నాము. ఇలా ఒక సీజన్ నుంచి మరో సీజన్‌లోకి మారే సమయంలో వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. చిన్నారుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అనవసర భయాలకు పొవొద్దని ప్రముఖ వైద్యులు మంచుకొండ రంగయ్య తెలిపారు. ఇంతకీ సీజన్ మారే సమయంలో ఎలాంటి వ్యాధులు వస్తాయి.? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ మాటల్లోనే..
‘చలి కాలం నుంచి వేసవిలోకి వెళ్తున్న సమయంలో వాతావరణంలో మార్పులు జరుగుతాయి. ఈ కారణంగా చిన్నారుల్లో వైరల్ వ్యాధులు వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. చెవి, ముక్కు, గొంతు సంబంధిత ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. వీటి తర్వాత ఛాతికి సంబంధించిన వ్యాధులు వస్తుంటాయి. చిన్నారుల్లో కొందరికి గొంతు నొప్పి, జలుబు, దగ్గుతో వ్యాధి మొదలవుతుంది. అయితే కొందరిలో జ్వరం, జలుబు తగ్గుతుంది కానీ.. దగ్గు మాత్రం ఎంతకీ తగ్గదు. కొందరు పేరెంట్స్ నా దగ్గరికి దగ్గు తగ్గడం లేదని మా చిన్నారికి కోవిడ్ టెస్ట్ రాస్తారా అని అడుగుతారు. కానీ ప్రస్తుతం కోవిడ్ మన దగ్గర లేదు. అలాంటి భయాలు అనవసరం’ అని తెలిపారు.
‘అయితే సహజంగా వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత చాలా మందికి ఎలర్జిక్ దగ్గు లాంటివి వస్తాయి. ఈ దగ్గు తగ్గడానికి కొంచెం సమయం పడుతుంది. కాబట్టి పేరెంట్స్ కంగారుపడకూడదు. ఓపికతో ఉండాలి, చిన్నారికి జ్వరం వస్తే డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. అయితే ప్రస్తుతం డెంగ్యూ, న్యూమోనియా వంటి వ్యాధులు వ్యాపిస్తున్నాయి. పేరెంట్స్ వీటికి కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వ్యాధి ఒక్కరోజులోనే తగ్గిపోవాలని అనుకోకూడదు. డాక్టర్లను మార్చుకుండా.. ఒకే ట్రీట్‌మెంట్‌ను కొనసాగించాలి. అవసరం లేకుండా యాంటీ బయోటిక్ వాడకూడదు. పరీక్షల ద్వారా కారణాలు తెలుసుకొని సరైన ట్రీట్‌మెంట్ తీసుకుంటో సరిపోతుంది’ అని సూచించారు.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..