Phool Makhana: ఫూల్ మఖానా తింటే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?

ఫూల్ మఖానా గురించి చాలా మందికి తెలిసినా.. మరికొంత మందికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ తామర గింజలు అంటే మాత్రం తెలుస్తుంది. చాలా మంది ఇప్పుడు ఈ తామర గింజనలకు కూడా తమ ఆహారంలో చేర్చుకుంటున్నారు. మఖానాతో అనేక రకాలైన చిరుతిళ్లు, కూరలు తయారు చేస్తున్నారు. ఇప్పుడు పెళ్లిళ్లు, ఫంక్షన్స్‌లో కూడా మఖానాతో తయారు చేసే కూరలనే వడిస్తున్నారు. వీటిలో ఎన్నో రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వైద్యులు కూడా వీటిని ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు. పలు రకాల అనారోగ్య సమస్యల్ని..

Phool Makhana: ఫూల్ మఖానా తింటే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?
Makhana Benefits
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Jan 16, 2024 | 12:30 PM

ఫూల్ మఖానా గురించి చాలా మందికి తెలిసినా.. మరికొంత మందికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ తామర గింజలు అంటే మాత్రం తెలుస్తుంది. చాలా మంది ఇప్పుడు ఈ తామర గింజనలకు కూడా తమ ఆహారంలో చేర్చుకుంటున్నారు. మఖానాతో అనేక రకాలైన చిరుతిళ్లు, కూరలు తయారు చేస్తున్నారు. ఇప్పుడు పెళ్లిళ్లు, ఫంక్షన్స్‌లో కూడా మఖానాతో తయారు చేసే కూరలనే వడిస్తున్నారు. వీటిలో ఎన్నో రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వైద్యులు కూడా వీటిని ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు. పలు రకాల అనారోగ్య సమస్యల్ని కూడా తగ్గించుకోవచ్చు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

వెయిట్ లాస్:

వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారు వీటిని ఎలాంటి సందేహం లేకుండా తినొచ్చు. ఎందుకంటే వీటిల్లో ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతో వీటిని కొద్దిగా తీసుకున్నా.. కడుపు నిండిన భావన కలుతుంది. అలాగే క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలి అనుకునే వారు మఖానాతో తయారు చేసే స్నాక్స్, కర్రీస్ వంటివి డౌట్ లేకుండా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

నరాలు బాగా పని చేస్తాయి:

చాలా మంది నరాల వీక్‌నెస్‌తో ఉంటారు. అలాంటి వారు మఖానా తినడం వల్ల ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అదే విధంగా నరాల పని తీరు కూడా మెరుగు పడుతుంది.

ఇవి కూడా చదవండి

డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది:

డయాబెటీస్ సమస్య ఉన్న వారు కూడా మఖానాను తీసుకోవచ్చు. మఖానాలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి అదుపులో ఉంటాయి. కాబట్టి షుగర్ వ్యాధి గ్రస్తులు ఎలాంటి సందేహం లేకుండా మఖానా తినొచ్చు.

ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి:

ఫూల్ మఖానా తినడం వల్ల ఎముకలు, దంతాలు కూడా దృఢంగా తయారవుతాయి. మఖానాలో కాల్షియం కూడా లభిస్తుంది. ప్రతి రోజు వీటిని తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, వాపులు వంటివి కూడా తగ్గుతాయి.

గుండె పనితీరు మెరుగు పడుతుంది:

మఖానా తినడం వల్ల గుండె పని తీరు మెరుగు పడటమే కాకుండా.. గుండె సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. మఖానాలో మెగ్నీషియం. గల్లిక్ యాసిడ్స్ వంటివి ఉంటాయి. ఇవి గుండె పోటు రాకుండా నిరోధిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

జర్మనీ వేదికగా న్యూస్9 గ్లోబల్ సమ్మిట్.. ప్రధాన మోదీ కీలక ప్రసంగం
జర్మనీ వేదికగా న్యూస్9 గ్లోబల్ సమ్మిట్.. ప్రధాన మోదీ కీలక ప్రసంగం
కోతికి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన యువకుడు..!
కోతికి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన యువకుడు..!
గంట కొట్టాలంటే ఒకలా.. గంట కొట్టేయాలంటే మరొకలా..
గంట కొట్టాలంటే ఒకలా.. గంట కొట్టేయాలంటే మరొకలా..
విమానంలో కుదుపులు.. ఎగిరిపడ్డ ప్రయాణికులు.! వీడియో వైరల్..
విమానంలో కుదుపులు.. ఎగిరిపడ్డ ప్రయాణికులు.! వీడియో వైరల్..
అమెరికాలో భారీగా ఉద్యోగాల కోత.. వివేక్ రామస్వామి హింట్.!
అమెరికాలో భారీగా ఉద్యోగాల కోత.. వివేక్ రామస్వామి హింట్.!
భద్రకాళి చెరువు ఖాళీ. అబ్బో.. ఎన్ని రకాల చేపలో! అదిరిపోయే వీడియో
భద్రకాళి చెరువు ఖాళీ. అబ్బో.. ఎన్ని రకాల చేపలో! అదిరిపోయే వీడియో
మందు పార్టీ తరువాత ఘోరం.! రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన శరీరభాగాలు
మందు పార్టీ తరువాత ఘోరం.! రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన శరీరభాగాలు
ఇన్సూరెన్స్ కోసం ఎలుగుబంటి వేషంలో కార్లు నాశనం.! వీడియో..
ఇన్సూరెన్స్ కోసం ఎలుగుబంటి వేషంలో కార్లు నాశనం.! వీడియో..
ఫ్రీ డేటా, నో ఛార్జింగ్‌, టెస్లా.. ఇలాంటి ఫోన్లను తయారుచేస్తోందా?
ఫ్రీ డేటా, నో ఛార్జింగ్‌, టెస్లా.. ఇలాంటి ఫోన్లను తయారుచేస్తోందా?
రంగులు మారే శివలింగం.. ఎక్కడో తెలుసా.? వీడియో వైరల్..
రంగులు మారే శివలింగం.. ఎక్కడో తెలుసా.? వీడియో వైరల్..