Joint Pains: వర్షా కాలంలో కీళ్ల నొప్పులు వస్తున్నాయా.. ఇలా చేస్తే నొప్పులన్నీ మాయం అవుతాయ్!!
వర్షా కాలం వచ్చిందంటే.. వాతావరణంలోనే కాదు.. మన శరీరంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా వర్షా కాలంలోనే జబ్బుల బారిన ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యలు వెంటాడతాయి. ఎందుకంటే వర్షా కాలంలో వాతావరణం తేమగా ఉంటుంది. దీంతో బ్యాక్టీరియా, క్రిములు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ వర్షా కాలం వచ్చిందంటే.. కీళ్ల నొప్పులతో బాధ పడే వారికి ఇబ్బందిగా ఉంటుంది. రెయినీ సీజన్ లో కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడే వారు మరిన్ని సమస్యలను..

వర్షా కాలం వచ్చిందంటే.. వాతావరణంలోనే కాదు.. మన శరీరంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా వర్షా కాలంలోనే జబ్బుల బారిన ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యలు వెంటాడతాయి. ఎందుకంటే వర్షా కాలంలో వాతావరణం తేమగా ఉంటుంది. దీంతో బ్యాక్టీరియా, క్రిములు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ వర్షా కాలం వచ్చిందంటే.. కీళ్ల నొప్పులతో బాధ పడే వారికి ఇబ్బందిగా ఉంటుంది. రెయినీ సీజన్ లో కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడే వారు మరిన్ని సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుంది. వర్షా కాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి కీళ్లు అనేవి దృఢత్వం అవడమే కాకుండా.. నొప్పులు తీవ్ర తరం అవుతాయి. వాటి నుంచి ఉపశమనం పొందాలంటే ఈ చిట్కాలు పాటించిండి.
యాక్టీవ్ గా ఉండాలి:
వర్షాకాలంలో కీళ్ల నొప్పులు వేధిస్తూ ఉంటే కనుక.. ఒకచోటనే ఎక్కువగా ఉండకుండా యాక్టీవ్ గా ఉండేందుకు ట్రై చేయండి. ఇలాంటి వారికి వాకింగ్ అనేది చక్కగా ఉపయోగ పడుతుంది. వర్షా కాలంలో కూడా ఉదయం లేదా ఎప్పుడు సమయం కుదిరిగా కాస్త వాకింగ్ వంటివి చేసుకుంటూ ఉండాలి. స్విమ్మింగ్ చేసినా కూడా బాడీ అంతా ఎక్సర్ సైజ్ అవుతుంది. కాబట్టి కీళ్ల నొప్పులు ఎక్కువగా బాధించవు.
బరువు తగ్గాలి:
వర్షా కాలంలో కీళ్ల నొప్పుల సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే బరువును అదుపులో ఉంచుకోవడం మంచిది. మీరు బరువు పెరుగుతూ ఉంటే కనుక.. ఆ ప్రభావం కూడా కీళ్లపై పడే అవకాశాలు ఎక్కుగా ఉన్నాయి. వాకింగ్ చేయడం, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటివి చేస్తూ ఉంటే మీరు బరువు తగ్గడమే కాకుండా.. కీళ్ల సమస్యలు ఉన్నా తగ్గుతాయి.
ఒదులుగా ఉన్న దుస్తులు ధరించాలి:
కీళ్ల నొప్పులతో బాధ పడే వారు ఎక్కువగా ఒదులుగా ఉండే బట్టలను ధరించడం మేలు. దీంతో కీళ్లు కూడా ఫ్రీగా ఉంటాయి. అదే టైట్ గా ఉన్న లెగ్గిన్స్ లేదా జీన్స్ వంటి వాటిని ధరిస్తే.. అవి శరీరానికి పట్టి ఉంటాయి. కాబట్టి కీళ్ల సమస్యలు మరింత ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా టైట్ గా ఉన్న బట్టలు తడిస్తే.. ఫంగల్ ఇన్ ఫెక్షన్స్ ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఒదులుగా ఉండే బట్టలు ధరించడం బెటర్ అని నిపుణులు చెబుతున్నారు.
నీరు తాగుతూ ఉండాలి:
కీళ్ల నొప్పులతో బాధ పడేవారు ఎప్పుడూ హైడ్రేట్ గా ఉండాలి. శరీరంలో తగినంత నీరు లేకపోతే.. కీళ్ల సమస్యలు తీవ్రతరం అయ్యేందుకు అవకాశం ఉంది. కాబట్టి నీరు లేదా ఫ్రూట్ జ్యూస్ లు వంటివి తీసుకుంటూ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచాలి.
కూల్ గా ఉండేందుకు ట్రై చేయండి:
ప్రస్తుతం ఇప్పుడున్న బిజీ లైఫ్ కారణంగా.. ఒత్తిడి, ఆందోళన అనేవి ఎక్కువగా ఉంటాయి. ప్రతీ ఒక్కరూ వీటిని ఫేస్ చేస్తారు. అయితే కీళ్ల నొప్పులతో బాధ పడేవారు మాత్రం.. ఒత్తిడి, ఆందోళనకు దూరంగా ఉండాలి. లేదంటే కీళ్ల సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. ఒత్తిడిని తగ్గించుకోవాలనుకుంటే.. మ్యూజిక్ వినడం, డ్యాన్స్ చేయడం, వాకింగ్ లేదా యోగా వంటివి చేసుకోవచ్చు. వీటి వల్ల కాస్త ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.




