ఉదయం లేవగానే బ్లాక్ టీ తాగుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్టట్లే

ప్రతి ఒక్కరికీ ఉదయం నిద్రలేవగానే కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అదేవిధంగా కొందరికి ఉదయం పూట అల్పాహారానికి ముందు టీ తాగడం అలవాటు ఉంటుంది.

ఉదయం లేవగానే బ్లాక్ టీ తాగుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్టట్లే
ఎక్కువగా టీ, కాఫీలు తాగకూడదని చాలా సార్లు వినే ఉంటారు. టీ, కాఫీలలో ఉండే కెఫిన్ ఆరోగ్యానికి హానికరం. ముఖ్యంగా కామెర్లు ఉన్న రోగులకు కాఫీ, టీలను నివారించండి.
Follow us

| Edited By: Narender Vaitla

Updated on: Jun 09, 2023 | 10:17 AM

ప్రతి ఒక్కరికీ ఉదయం నిద్రలేవగానే కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అదేవిధంగా కొందరికి ఉదయం పూట అల్పాహారానికి ముందు టీ తాగడం అలవాటు ఉంటుంది. కొంతమందికి మిల్క్ టీ అంటే ఇష్టం అయితే మరికొందరికి బ్లాక్ టీ అంటే చాలా ఇష్టం. అయితే ఉదయం బ్లాక్ టీ తాగుతో మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొవల్సిందే.

రోజంతా ఆరోగ్యంగా గడపాలనుకునే వారికి ఉదయాన్నే బ్లాక్ టీ తాగడం అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే బ్లాక్ టీ తాగుతే అనేక వ్యాధులకు గురి కావాల్సి ఉంటుంది. ఖాళీ కడుపుతో తాగడం వల్ల ఈ ఆరోగ్య సమస్యలు వస్తాయి. అవేంటో చూద్దాం.

అజీర్ణం:

ఇవి కూడా చదవండి

నిపుణుల అభిప్రాయం ప్రకారం, బ్లాక్ టీ లేదా బ్లాక్ కాఫీ ఆమ్ల ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఖాళీ కడుపుతో త్రాగడం వల్ల శరీరం యాసిడ్-ఆల్కలీన్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. ఇది రోజు గడుస్తున్న కొద్దీ ఎసిడిటీ లేదా అజీర్తిని పెంచుతుంది.

డీహైడ్రేషన్ :

బ్లాక్ టీలో థియోఫిలిన్ ఉంటుంది, ఇది శరీరంలో డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది. రోజూ తాగే అలవాటు ఉన్నవాళ్లకి ఇదో ఇబ్బంది.

మలబద్ధకం:

శరీరంలో డీహైడ్రేషన్ ఉన్నప్పుడు, మలబద్ధకం కూడా ఉంటుంది. తిన్న ఆహారం పేగుల్లో సరిగా జీర్ణం కాకపోతే మల విసర్జన ప్రక్రియలో చాలా మార్పు వస్తుంది.

దంతాల ఎనామిల్ దెబ్బతింటుంది:

బ్లాక్ టీ ఆమ్లత్వం కలిగి ఉంటుంది. కాబట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం వల్ల ఆమ్ల ప్రభావం పెరుగుతుంది. ఇది దంతాల ఉపరితల ఎనామిల్‌ను దెబ్బతీస్తుంది. ఇతర చిగుళ్ల సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది.

కడుపు ఉబ్బరం:

బ్లాక్ టీ తాగితే గ్యాస్టిక్‌గా ఉంటుంది. ఇది క్రమేణా వాత సమస్యను కలిగిస్తుంది. దాని ఆమ్ల ప్రభావం కారణంగా, ఇతర ఆరోగ్యకరమైన ఆహారాలను సరిగ్గా తీసుకోవడం సాధ్యం కాదు.

బ్లాక్ టీ తాగడానికి సరైన సమయం:

మీకు బ్లాక్ టీ కోసం కోరిక ఉంటే, దాని ఉత్తమ ప్రయోజనాలను పొందాలంటే భోజనం చేసిన రెండు గంటల తర్వాత తాగడం ఉత్తమమని నిపుణులు అంటున్నారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం

Latest Articles