AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hangover: బాగా తాగి హ్యాంగోవర్ అయిందా.. అయితే ఇలా చేయండి..

నూతన సంవత్సరం (నూతన సంవత్సరం 2022) అనేది వేడుకల సమయం. ప్రజలు స్నేహితులు, కుటుంబ సభ్యులతో కొత్త ప్రణాళికలను రూపొందించడం ప్రారంభిస్తారు...

Hangover: బాగా తాగి హ్యాంగోవర్ అయిందా.. అయితే ఇలా చేయండి..
Drink
Srinivas Chekkilla
|

Updated on: Dec 31, 2021 | 9:57 PM

Share

నూతన సంవత్సరం (నూతన సంవత్సరం 2022) అనేది వేడుకల సమయం. ప్రజలు స్నేహితులు, కుటుంబ సభ్యులతో కొత్త ప్రణాళికలను రూపొందించడం ప్రారంభిస్తారు. గత సంవత్సరం చాలా మంది కొత్త సంవత్సరాన్ని ఇంట్లో జరుపుకోవాల్సి వచ్చింది. కానీ ఈసారి మీరు కొన్ని పరిమితులతో న్యూ ఇయర్ పార్టీని జరుపుకోవచ్చు. అదే సమయంలో పార్టీలో వినోదం కోసం మద్యం సేవించడం చేస్తారు. కానీ దీని తర్వాత హ్యాంగోవర్ చాలా మందిని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది.

పార్టీ సమయంలో ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరంపై ప్రభావం చూపుతుంది, దీని కారణంగా అలసట, బద్ధకం, డీహైడ్రేషన్, వికారం, తలనొప్పి, కండరాలు పట్టేయడం వంటి సమస్యలు ఉంటాయి. అయితే, హ్యాంగోవర్ నుంచి ఉపశమనం పొందే చిట్కాలు మీ కోసం

నిమ్మరసం

హ్యాంగోవర్‌ను తొలగించడంలో నిమ్మకాయ నీరు అత్యంత ప్రభావవంతంగా పని చేస్తుంది. రాత్రి పార్టీ అయ్యాక నిద్రించే ముందు నిమ్మరసం తాగాలి. గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయను పిండుకుని తాగి పడుకోండి. ఇది తలనొప్పి నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది.

నీరు తాగడం

హ్యాంగోవర్‌ను వదిలించుకోవాలనుకుంటే ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత పుష్కలంగా నీరు తాగాలి. ఆల్కహాల్ వల్ల శరీరంలో డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. దీని వల్ల శరీరంలోని టాక్సిక్ ఎలిమెంట్స్ కూడా బయటకు వచ్చి చాలా రిలీఫ్ ఫీలవుతారు.

అల్లం-తేనె బ్లాక్ టీ

ఉదయం నిద్రలేచిన వెంటనే అల్లం, తేనె బ్లాక్ టీ తాగండి. అల్లం కడుపు సమస్యలను తొలగిస్తుంది. తేనె టీ రుచిని మెరుగుపరుస్తుంది. దీనితో మీ తలనొప్పి పోతుంది.

కొబ్బరి నీరు

మీరు హ్యాంగోవర్ కారణంగా వాంతులు చేసుకుంటే దానిని ఆపడానికి నిమ్మకాయ తీసుకోండి. వాంతులు ఆగినప్పుడు కొబ్బరి నీళ్లు తాగండి. దీంతో శరీరంలో నీటి కొరత త్వరగా తీరుతుంది.

పెరుగు తినండి

పెరుగులో ఉండే యాసిడ్ కడుపు సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది.

Read  Also.. Green Coriander Benefits: పచ్చి కొత్తిమీరను తినేవారు ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే.. ఏంటంటే..